TG CPGET 2024 Results : పీజీ ప్రవేశాలు - రేపు 'సీపీగెట్' ఫలితాలు, మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి..!-ts cpget 2024 result will be released on 9th auhust at the httpscpgettscheacin ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Cpget 2024 Results : పీజీ ప్రవేశాలు - రేపు 'సీపీగెట్' ఫలితాలు, మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి..!

TG CPGET 2024 Results : పీజీ ప్రవేశాలు - రేపు 'సీపీగెట్' ఫలితాలు, మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 08, 2024 07:54 PM IST

TG CPGET 2024 Results :తెలంగాణ సీపీగెట్ (కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) పరీక్షల ఫలితాలు ఆగస్టు 9వ తేదీన విడుదల కానున్నాయి. https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

సీపీగెట్ ఫలితాలు 2024
సీపీగెట్ ఫలితాలు 2024

TG CPGET 2024 Results : తెలంగాణలో పీజీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీగెట్(కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) - 2024 ఫలితాలు విడుదల కానున్నాయి. ఆగస్టు 09వ తేదీన మధ్యాహ్నం తర్వాత అందుబాటులోకి వస్తాయి. ఈ రిజల్ట్స్ ను https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TG CPGET 2024 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

Step 1: పరీక్ష రాసిన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

Step 2: సీపీగెట్ - 2024 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: ఓపెన్ అయ్యే విండోలో హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.

Step 4: మీ ర్యాంక్ కార్డ్ డిస్ ప్లే అవుతుంది.

Step 5: ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న 297 పీజీ కాలేజీల్లో( ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు) 51 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ నిర్వహిస్తున్నారు.సీపీగెట్ పరీక్షలను జూలై 6వ తేదీ నుంచి కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించారు.జులై 17వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తి అయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీపీగెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఎంబీబీఎస్, బీటెక్‌ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరే వీలుంది.

మొత్తం 100 మార్కులకు సీపీగెట్ పరీక్ష నిర్వహించారు.ఈ ఏడాది కూడా ఉస్మానియా వర్శిటే ఈ పరీక్ష నిర్వహించింది. ప్రశ్నాపత్రంలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్-ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్-ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు. ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఫలితాల విడుదల తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు.