TS CPGET 2022 : పీజీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం… పూర్తి షెడ్యూల్ ఇదే
tscpget counselling 2022: తెలంగాణవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వివరాలు చూస్తే....
TS CPGET Counselling 2022: తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి గాను పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.ఈ ఏడాది 57,262 మంది సీపీగెట్ రాయగా.. కౌన్సెలింగ్‌కు 54,050 మంది అర్హత సాధించారు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత పొందిన వారు 2022–23 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంపీడీ, ఎంసీజే, లైబ్రరీ సైన్స్‌లతో పాటు ఐదేళ్ల పీజీ, పీజీ డిప్లొమాలో ప్రవేశాలు పొందుతారు.

కౌన్సెలింగ్ షెడ్యూల్:
సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 10 వరకు రిజిస్ట్రేషన్, ఆన్ లైన్ లో సర్టిఫికెట్ల పరిశీలన
అక్టోబరు 11 - తప్పుల సవరణకు అవకాశం
అక్టోబరు 12- 15: వెబ్ ఆప్షన్ల నమోదు
అక్టోబరు 16 - వెబ్ ఆప్షన్లలో సవరణలకు అవకాశం
అక్టోబరు 18 - మొదటి విడత సీట్ల కేటాయింపు
అక్టోబరు 21 వరకు - సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి
అక్టోబరు 24 - రెండో విడత రిజిస్ట్రేషన్లకు ఛాన్స్
ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి:
SCC, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు
టీసీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరి
పీజీ ఎంట్రెన్స్ ర్యాంక్ కార్డు
TS CPGET Results 2022: ఇక టీఎస్ సీపీజీఈటీ– 2022 ఫలితాలు సెప్టెంబర్ 16న విడుదలయ్యాయి. ఓయూతో పాటు ఇతర వర్సిటీలలో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, 5 ఏళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు నెల 11 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఓయూ నిర్వహించిన CPGET– 2022లో 45 సబ్జెక్టులకు 67,115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఓయూతో పాటు తెలంగాణ, తెలంగాణ మహిళ, కాకతీయ, పాలమూరు, శాతా వాహన, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ వర్సి టీల్లో పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఇక.. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇదే లింక్ తో ర్యాంక్ కార్డు పొందవచ్చు. ఇతర అప్డేట్స్ ను కూడా చూడవచ్చు.