Telugu News  /  Telangana  /  Trolls And Memes On Kavitha Over Delhi Liquor Scam
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Trolls On Liquor Scam : మెషిన్ అరుస్తుందిక్కడ.. లిక్కర్ స్కామ్‪పై ట్రోల్స్

07 December 2022, 14:14 ISTHT Telugu Desk
07 December 2022, 14:14 IST

Trolls On Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్‪పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరోవైపు ట్రోల్స్, మీమ్స్ పేజీల వాళ్లూ.. ఈ విషయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది కామన్ అనుకోవాలా? ప్రత్యర్థి పార్టీల వాళ్లు క్రియేట్ చేయిస్తున్నారా?

మెుదట్లో సినిమా వాళ్లు మీద.. లేదంటే.. ఏదైనా విషయం కొత్తగా అనిపిస్తే.. ట్రోల్స్, మీమ్స్(Memes) క్రియేట్ అయ్యేవి. వాటిని జనాలు కూడా చూసి నవ్వుకునేవారు. సినిమా(Cinema)ల్లోని క్లిప్పులను యాడ్ చేసి.. షురూ అయిన ట్రోల్స్.. ఆ తర్వాత ఫేమస్ పర్సన్ మాట్లాడే మాటలను అందులో యాడ్ చేసి జనాల్లోకి వదిలేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా రాజకీయ, సినీ అంశాలపై ప్రతి రోజూ.. మీమ్స్, ట్రోల్స్ ఇస్తున్నారు. తాజాగా దిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో కవిత పేరు వినిపించడంతో ఆమెపై ట్రోల్స్ పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు

యూట్యూబ్ ఛానల్స్(Youtube Channels), సోషల్ మీడియా(Social Media) పేజీల్లో దిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ట్రోల్స్ వందల్లో ఉన్నాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ గురించి.. అంతకుముందు టీఆర్ఎస్(TRS) నేతలు మాట్లాడిన క్లిప్పులు.., కవిత పేరు రిమాండ్ రిపోర్టులో వచ్చాక మాట్లాడిన మాటలను యాడ్ చేస్తూ.. చాలా వీడియోలు క్రియేట్ అయ్యాయి. అయితే ఇదంతా.. ప్రతిపక్ష పార్టీలు కావాలనే చేయిస్తున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జనాల్లోకి తప్పుగా తీసుకెళ్లేందుకు ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తున్నాయని మండిపడుతున్నాయి.

దిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి.. యూట్యూబ్ లో వందల ట్రోల్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువ వీడియో(Video)ల్లో.. చాలా ఉన్నాయి లోపల.. ఇంకా దాచాం అని సీబీఐ(CBI) అధికారులు చెబుతున్నట్టుగా అర్థం వచ్చేలా క్రియేట్ అయ్యాయి. ఓ సినిమాలో అబద్ధం చెప్తే అరిచే.. మెషిన్ మీమ్ ను కూడా బాగా ఉపయోగిస్తున్నారు. వీటిపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మహిళ నేతపై ఇలాంటి ట్రోల్స్ సరికాదంటున్నారు. ఇంకా నిజానిజాలు తెలియాల్సి ఉందని.. ముందే ఇలా ఓ వ్యక్తి మీద బురదజల్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మెుదట్లో రాజకీయ నేతలను ట్రోలింగ్(Trolling) చేసేందుకు ట్రోలర్స్.. కాస్త ఆలోచించేవాళ్లు. సోషల్ మీడియా పెరిగిపోయాక.. ప్రతి పార్టీ.. సొంతంగా సోషల్ మీడియా వింగ్స్ ను ఏర్పాటు చేసుకుంటోంది. అక్కడ నుంచి ప్రత్యర్థి పార్టీల నేతలపై ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నేతలు.. ఇలా పేజీలు మెయింటేన్ చేయిస్తున్నారని కూడా తెలుస్తోంది. తమ గురించి పాజిటివ్ గా జనాల్లోకి పంపించేలా.. క్రియేట్ చేయిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై బురదజల్లేందుకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు.

ఈ సోషల్ మీడియా(Social Media) పేజీల కోసం లక్షల్లో డబ్బులు ఖర్చు చేస్తున్నారు నేతలు. గంటలు గంటలు స్పీచ్ ఇచ్చి.. ప్రత్యర్థి పార్టీ గురించి చెప్పడం.. కంటే ఒక్క మీమ్(Meme) జనాల్లోకి పంపిస్తేనే ఎక్కువ ఉపయోగమని నేతలూ నమ్ముతున్నారు. ఇప్పుడంతా.. ఇదే ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఉన్న యూట్యూబ్ ట్రోల్స్ ఛానళ్లు, మీమ్స్ పేజీలకు డబ్బులు చెల్లించి కూడా కొంతమంది నేతలు ప్రత్యర్థులపై క్రియేట్ చేయిస్తున్నారు.

మరోవైపు దిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ టీఆర్‌ఎస్‌(TRS) ఎమ్మెల్సీ కవితకు సీబీఐకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఖరారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం మంగళవారం విచారణకు తాను రాలేనంటూ కవిత సీబిఐకి లేఖ రాశారు. 11,12,14,15 తేదీల్లో సీబీఐ(CBI) అధికారులకు అనువుగా ఉన్న తేదీలలో హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ కావడానికి అభ్యంతరం లేదని వివరించారు. వివరణ కోసం.. కవితతో 11వ తేదీన సమావేశానికి సీబీఐ అంగీకారం తెలిపింది.