Hyderabad Trigyn Center : హైదరాబాద్ లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు-trigyn technologies agreed to ai center at hyderabad after met cm revanth reddy at usa ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Trigyn Center : హైదరాబాద్ లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు

Hyderabad Trigyn Center : హైదరాబాద్ లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు

Hyderabad Trigyn Center : హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ట్రైజిన్ టెక్నాలజీస్ ప్రకటించింది. మూడేళ్లలో 1000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. ఈ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో అమెరికాలో భేటీ అయ్యారు.

హైదరాబాద్ లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు

Hyderabad Trigyn Center : హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అమెరికా పర్యటన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందంతో ట్రైజిన్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు.

రాబోయే మూడేళ్లలో 1000 ఉద్యోగాలు

ఈ కంపెనీ డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. హైదరాబాద్ లో ట్రైజిన్ కంపెనీ అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందించనుంది. ఈ కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో పనిచేస్తున్న 2,500 మందిలో వెయ్యి మంది మన దేశంలో ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు వంద మంది ఉన్నారు. మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది.

రెండు దశాబ్దాలకు పైగా ఐక్య రాజ్య సమితితో పాటు అనుబంధ విభాగాలకు ట్రైజిన్ సంస్థ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గత ఏడాది నుంచి ట్రైజిన్ కంపెనీ తమ సేవలను అందుకుంటున్న సంస్థల్లో అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణలు చేస్తోంది. అన్ని రంగాలలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది.