snoring treatment: గురక సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇక్కడికి వెళ్లండి!
snoring treatment: ప్రస్తుతం చాలామంది గురక సమస్యతో బాధపడుతున్నారు. గురక ఉన్నవారే కాకుండా.. పక్కన ఉండేవారి నిద్ర కూడా చెడిపోతుంది. దీంతో ఎంతోమంది చుట్టాల ఇళ్లకు వెళ్లాలన్న భయపడుతుంటారు. అలాంటి గుడ్ న్యూస్ చెప్పింది నిమ్స్.
గురక సమస్యతో బాధపడేవారికి హైదరాబాద్‌లో చికిత్స అందనుంది. అవును.. హైదరాబాద్ నిమ్స్‌లో గురకతో బాధపడుతున్నవారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్యకు చికిత్స అందించేందుకు.. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గురకతో బాధపడేవారికి ఇక్కడ చికిత్స అందించనున్నారు.
ఈ అలవాట్లే కొంప ముంచుతున్నాయి..
ధూమపానం, మద్యపానం అలవాట్లు, శ్వాస నాళాల్లో అడ్డంకులు, అధిక బరువు ఉంటే గురక వస్తుంది. ఈ సమస్య ఉన్నవారికి కొన్నిసార్లు అకస్మాత్తుగా శ్వాస ఆగిపోతుంది. దీంతో మెలకువ వస్తుంది. మళ్లీ పడుకున్న కాసేపటికి అదే రిపీట్ అవుతుంది. దీంతో మెదడుకు ప్రాణవాయువు అందక పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
హార్ట్ బీట్ తగ్గే ఛాన్స్..
గురక సమస్యతో హార్ట్ బీట్ రేటు కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. మహిళల కంటే పురుషుల్లో ఎక్కువ శాతం ఈ సమస్య ఉంటుందని అంటున్నారు. 30 ఏళ్లు దాటిన చాలామంది గురకతో ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. దీని కోసం చికిత్స పొందితే చాలావరకు సమస్యకు తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంటున్నారు వైద్యులు.
ఎలా చికిత్స అందిస్తారు..
గురక బాధితులను 24 గంటల పాటు ల్యాబ్‌లో ఉంచుతారు. వారి నిద్రపై స్టడీ చేస్తారు. గురక ఉన్నవారు నిద్రిస్తున్న సమయంలో గుండె, ఊపిరితిత్తులు, మెదడు కార్యకలాపాలు, శ్వాస విధానాలు, చేయి, కాలు కదలికలు, రక్తంలో ఆక్సిజన్ స్థాయులను వైద్యులు పరిశీలిస్తారు. అనంతరం సమస్యను విశ్లేషించి వైద్యం చేస్తారు.