Godavari Express Derailed : గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం-train derailed visakhapatnam to hyderabad godavari express derailed near bibi nagar station ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Train Derailed Visakhapatnam To Hyderabad Godavari Express Derailed Near Bibi Nagar Station

Godavari Express Derailed : గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

HT Telugu Desk HT Telugu
Feb 15, 2023 08:30 AM IST

Train Derailed విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు Godavari Express Derailed ఘోర ప్రమాదం తప్పింది. బీబీ నగర్‌ వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్‌ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుబోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు ప్రకటించారు. పట్టాలు తప్పిన బోగీలు మిగిలిన వాటిని హైదరాబాద్‌ పంపారు. పట్టాలు తప్పిన బోగీలను వేగంగా పట్టాలెక్కించేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. .

బీబీ నగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్
బీబీ నగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ (PTI)

Train Derailed విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్నGodavari Express Derailed  గోదావరి ఎక్స్‌ప్రెస్‌ తెల్లవారుజామున బీబీనగర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పినట్టు గుర్తించారు. మరికాసేపట్లో హైదరాబాద్‌ చేరుకుంటుండగా ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఉదయం 6.10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 

ట్రెండింగ్ వార్తలు

గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ నంబర్ 12727 గోదావరి ఎక్స్‌ప్రెస్‌ విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ సమీపంలో ట్రైన్‌ పట్టాలు తప్పింది.

ఈ ప్రమాదంలో మొత్తం ఆరు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. ఊహించని ఘటనతో రైలులోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక హాహాకారాలు చేశారు. రైలు వేగం తక్కువగానే ఉండటంతో లోకో పైలట్‌ వెంటనే ట్రైన్‌ను నిలిపివేశాడు.

ప్రయాణికులంతా రైలులోంచి కిందకు దిగిపోయారు. రైలు పట్టాలు తప్పినట్టు గుర్తించిన లోకో పైలట్లు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బోగీలు పట్టాలు తప్పినప్పటికీ.. కింద పడకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు వెల్లడించారు.మరోవైపు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ లింక్డ్ హాప్ బుష్‌మెన్‌ కోచ్‌లు కావడంతో పట్టాలు తప్పిన వెంటనే ఒకదానితో మరొకటి ఢీ కొట్టకుండా ట్రాక్‌పైనే నిలిచిపోయాయి. రైలు పట్టాలు తప్పిన ప్రాంతంలో ఓ వైపు లోయ మాదిరి ఉండటంతో బోగీలు పల్టీ కొట్టి ఉంటే తీవ్ర నష్టం ఉండేదని భావిస్తున్నారు.

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరినీ గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఎస్‌ 1 నుంచి ఎస్‌ 4 వరకు ఉన్న బోగీలతో పాటు జనరల్ సీటింగ్, ఎస్‌ఎల‌్‌ఆర్‌ బోగీలు పట్టాలు తప్పాయి. బీబీ నగర్‌-ఘట్‌కేసర్‌ మధ్య ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మరోవైపు ప్రమాదంలో పట్టాలు తప్పిన బోగీలు మినహా మిగిలిన వాటిని హైదరాబాద్‌ తరలించారు. హైదరాబాద్‌-కాజీపేట మార్గంలో ప్రధాన లైన్లలో ప్రమాదం జరగడంతో విజయవాడ మీదుగా హైదరాబాద్ వచ్చే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

రైల్వే ట్రాక్‌ను శరవేగంగా పునరుద్ధరించేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రమాదంతో ట్రాక్ తీవ్రంగా దెబ్బతినడంతో బోగీలను పట్టాలెక్కించిన తర్వాత ట్రాక్షన్ మరమ్మతులు కూడా చేయాల్సి ఉండటంతో రైళ్లు ఆలశ్యమవుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఒక్క ట్రాక్ మీదుగానే రైళ్లను క్రమబద్దీకరిస్తుండటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు సమాచారం ఇచ్చేూందుకు Helpline number ఏర్పాటు చేశారు. ప్రయాణికులు మరింత సమాచారం కోసం 040 27786666 నంబరులో సంప్రదించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు ప్రమాద స్థలాన్ని దక్షిణ మధ్య రైల్వే జిఎం పరిశీలించారు. రైలు పట్టాలు తప్పిన సమయంలో ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలిపారు. దాదాపు 400మీటర్ల  పొడవున  ట్రాక్ ధ్వంసం మైంది.  రైల్వే ఓవర్ హెడ్‌  ఎలక్ట్రిక్ పోల్స్ ధ్వంసం అయ్యాయి.  ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి కావడానికి రాత్రి 10 దాటొచ్చని జిఎం స్పష్టం చేశారు.  మరోవైపు గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో రైళ్ల రాకపోకలకు తీవ్రం అంతరాయం కలుగుతోంది. 

IPL_Entry_Point