Hyderabad Traffic Diversion: విగ్రహావిష్కరణ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు-traffic restrictions in hyderabad today in view of ambedkar statue unveiling ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Traffic Restrictions In Hyderabad Today In View Of Ambedkar Statue Unveiling

Hyderabad Traffic Diversion: విగ్రహావిష్కరణ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు

HT Telugu Desk HT Telugu
Apr 14, 2023 08:26 AM IST

Hyderabad Traffic Diversion: అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ప్రజలు ప్రత్యామ్నయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో నేడు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో నేడు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic Diversion: అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ నేపథ్యంలో హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్ష విధించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమలు అవుతాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్‌ నిబంధనలు అమల్లో ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

ఐమాక్స్‌, నెక్లెస్‌ రోడ్‌, ట్యాంక్‌ బండ్‌, సెక్రటేరియట్‌, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ దారి మళ్లిస్తారు. నెక్లెస్‌రోడ్‌, సెక్రటేరియట్‌, ఐమాక్స్‌ ప్రాంతాల్లోని హౌటళ్లు మూసివేయనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచించారు.

అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 14న 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి తరలిరానున్న వేలాది మంది ప్రజల సమక్షంలో హుస్సేన్‌ సాగర్‌ తీరాన ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.

భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో విగ్రహావిష్కరణ సందర్భంగా పూలవర్షం కురిపిస్తారు. విగ్రహావిష్కరణలో భాగంగా భారీ క్రేన్‌తో విగ్రహానికి ఉన్న తెరను తొలగించి గులాబీలు, తెల్లటి పుష్పగుచ్ఛాలు, తమలపాకులతో చేసిన భారీ దండతో మాల వేయనున్నారు.సంప్రదాయ పద్ధతిలో జరిగే వేడుకకు బౌద్ధ సన్యాసులను మాత్రమే ఆహ్వానించారు.

నగరంలో ట్రాఫిక్ మళ్లింపు….

1) VV విగ్రహం - నెక్లెస్ రోటరీ - NTR మార్గ్ మరియు తెలుగు తల్లి జంక్షన్ మధ్య ట్రాఫిక్, వాహనాల రాకపోకల్ని అనుమతించరు.

2) ఖైరతాబాద్/పంజాగుట్ట/సోమాజిగూడ నుండి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డు కూడలి వైపు వెళ్లాలనుకునే ట్రాఫిక్ VV విగ్రహం నుంచి షాదన్ - నిరంకారి వైపు మళ్లిస్తారు.

3) ట్యాంక్‌బండ్ నుండి పీవీ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. వీటిని సోనాబి మసీదు దగ్గర రాణిగంజ్/కర్బాలా వైపు మళ్లిస్తారు.

4) రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుండి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపు వాహనాలు మళ్లిస్తారు.

5) ఇక్బాల్ మినార్ జంక్షన్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను ట్యాంక్‌బండ్ - రాణిగంజ్, లిబర్టీ వైపు వెళ్లే న ట్రాఫిక్‌ను, అంబేద్కర్ విగ్రహం / ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ - కట్ట మైసమ్మ జంక్షన్ - లోయర్ ట్యాంక్‌బండ్‌ వైపు వాహనాలను మళ్లిస్తారు. .

6) ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి విగ్రహాల మీదుగా వచ్చే వాహనాలతో పాటు ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లాలనుకునే ట్రాఫిక్ అనుమతించరు. తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు వాహనాలను అనుమతించరు.

7) బూర్గుల రామకృష్ణారావు భవన్ నుండి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు అనుమతించరు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుండి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు.

9) ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుండి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ లేదా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. వాహనాలను రాజ్‌దూత్ లేన్ వైపు అనుమతించరు.

10) NTR గార్డెన్, NTR ఘాట్, నెక్లెస్ రోడ్ మరియు లుంబినీ పార్క్ ప్రాంతాల్లో శుక్రవారం ఎలాంటి వాహనాలు అనుమతించరు.

అఫ్జల్‌గంజ్ నుండి సికింద్రాబాద్ వైపు వచ్చే RTC బస్సులు ట్యాంక్ బండ్ రోడ్డును మినహాయించి తెలుగు తల్లి ఫ్లై ఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్, DBR మిల్స్ మరియు కవాడిగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా ప్రయాణికులు 1. వివి విగ్రహం (ఖైరతాబాద్) జంక్షన్, 2. పాత సైఫాబాద్ పిఎస్ జంక్షన్, 3. రవీంద్ర భారతి జంక్షన్, 4. మింట్ కాంపౌండ్ రోడ్, 5. తెలుగు తల్లి జంక్షన్, 6. నెక్లెస్ రోటరీ, 7. నల్లగుట్ట జంక్షన్, 8. కట్ట మైసమ్మ (దిగువ ట్యాంక్‌బండ్) 9. ట్యాంక్ బండ్ మరియు 10.లిబర్టీ జంక్షన్ల మీదుగా ప్రయాణించవద్దని పోలీసులు సూచించారు.

WhatsApp channel

సంబంధిత కథనం