Traffic Diversion In HYD : భారత్ జోడో యాత్రతో సైబరాబాద్‌లో ట్రాఫిక్ డైవర్షన్‌..-traffic diversion due to rahul gandhi bharath jodo yatra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Traffic Diversion Due To Rahul Gandhi Bharath Jodo Yatra

Traffic Diversion In HYD : భారత్ జోడో యాత్రతో సైబరాబాద్‌లో ట్రాఫిక్ డైవర్షన్‌..

HT Telugu Desk HT Telugu
Oct 30, 2022 11:55 AM IST

Traffic Diversion In HYD : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఏడు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.

రాహుల్ భారత్‌ జోడో యాత్రతో సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
రాహుల్ భారత్‌ జోడో యాత్రతో సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు (twitter)

Traffic Diversion In HYD రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఐదో రోజుకు చేరుకుంది. సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోకి పాదయాత్ర ప్రవేశిస్తుండటంతో పోలీసులు నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. షాద్​నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 30వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

భారత్ జోడో యాత్ర సందర్భంగా నాలుగు రోజుల పాటు వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. కాంగ్రెస్​ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్​ పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

వాహనాల మళ్లింపు ఇలా….

షాద్​నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 30వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 వరకు వాహనాలను మళ్లిస్తారు.

జడ్చర్ల నుంచి హైదరాబాద్‌ వైపు వచ్చే వాహనాల​ను ఒకే లేన్​లో అనుమతిస్తారు. మరో లేన్​లో వచ్చే వెహికల్స్ అమిత్​ కాటన్ మిల్​, బూర్గుల క్రాస్​రోడ్, రాయికల్, సోలిపూర్ మీదుగా షాద్ నగర్​కు వెళ్లాల్సి ఉంటుంది.

బెంగళూరు నుంచి షాద్​నగర్​ వైపు వచ్చే వెహికల్స్ కేశంపేట క్రాస్​ రోడ్, చటాన్​పల్లి రైల్వే గేట్​ మీదుగా వెళ్లాలి.

పరిగి నుంచి జడ్చర్ల వైపు వెళ్లే వెహికల్స్ షాద్​నగర్ క్రాస్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేటు మీదుగా హైవే మీదకు చేరుకోవాల్సి ఉంటుంది.

31వ తేదీన వాహనాల మళ్లింపు ఇలా...

పరిగి నుంచి సిటీ వైపు వచ్చే వెహికల్స్ షాద్​నగర్ క్రాస్​రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేట్​మీదుగా వెళ్లాలి.

సిటీ నుంచి షాద్​నగర్​కు వెళ్లే వెహికల్స్ కొత్తూరు​ వై జంక్షన్​, జేపీ దర్గా క్రాస్ రోడ్, నందిగామ, దస్కల్​ క్రాస్ రోడ్, కేశంపేట క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి.

జడ్చర్ల నుంచి షాద్​నగర్​ మీదుగా సిటీ వైపు వెళ్లే వెహికల్స్​ వన్​వేలో వెళ్లాల్సి ఉంటుంది.

శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో..

31వ తుదీ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు...బెంగళూరు నుంచి శంషాబాద్ వైపు వచ్చే వెహికల్స్ పాలమాకుల గ్రామం మీదుగా జేఐవీఏ ఆశ్రమం, గొల్లూరు క్రాస్ రోడ్, శంకరాపురం, సంగిగూడ జంక్షన్, పెద్ద గోల్కొండ టోల్ గేట్, బహదూర్​గూడ, గొల్లపల్లి, కిషన్​గూడ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

నవంబర్ 1న..ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు ..

బెంగళూరు నుంచి సిటీకి వచ్చే వెహికల్స్ తొండుపల్లి టోల్​గేట్ మీదుగా రాళ్లగూడ సర్వీస్​ రోడ్, జంక్షన్, ఎయిర్ పోర్డు కాలనీ జంక్షన్, రాజీవ్ గృహ కల్ప జంక్షన్, ఓఆర్ఆర్ అండర్​పాస్, గగన్​పహాడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

నవంబర్ 2న బాలానగర్ ట్రాఫిక్‌‌‌‌ పీఎస్ పరిధిలో..

బోయిన్​పల్లి నుంచి బాలానగర్​ వైపు వెళ్లే వెహికల్స్ బోయిన్​పల్లి జంక్షన్​, ఓల్డ్ ఎయిర్ పోర్టు, గౌతంనగర్, శోభన జంక్షన్, ఫతేనగర్, పైప్​లైన్ రోడ్ మీదుగా బాలానగర్ చేరుకోవాల్సి ఉంటుంది. బాలానగర్ నుంచి బోయిన్ పల్లి వైపు వెళ్లే వెహికల్స్ సైతం ఇదే రూట్ లో వెళ్లాలి.

బోయిన్​పల్లి నుంచి కూకట్​పల్లి వైపు వెళ్లే వెహికల్స్ బాలానగర్ టీ–జంక్షన్ నుంచి ఫతేనగర్, జింకలవాడ, సనత్ నగర్ రైల్వే స్టేషన్, భరత్ నగర్ మార్కెట్ మీదుగా కూకట్ పల్లి వై జంక్షన్ కు చేరుకోవాల్సి ఉంటుంది.

బోయిన్​పల్లి, జీడిమెట్ల నుంచి కూకట్​పల్లి వైపు వచ్చే వెహికల్స్​ నర్సాపూర్ జంక్షన్, జింకలవాడ, సనత్ నగర్ రైల్వే స్టేషన్, భరత్ నగర్ మార్కెట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

కూకట్​పల్లి నుంచి బోయిన్​పల్లి వైపు వెళ్లే వెహికల్స్ నర్సాపూర్ జంక్షన్, గుడెన్ మెట్ జంక్షన్, కుత్బుల్లాపూర్ వై జంక్షన్, సుచిత్రా సర్కిల్ మీదుగా వెళ్లాలి.

కూకట్​పల్లి, కేపీహెచ్​బీ, మియాపూర్ ట్రాఫిక్ పీఎస్​ల పరిధిలో..

బాలానగర్ ​నుంచి అంబేద్కర్ వై జంక్షన్ వైపు వచ్చే వెహికల్స్ ఒకే లేన్​లో వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు.

మూసాపేట నుంచి ఇక్రిశాట్ వైపు వెళ్లే వెహికల్స్​ను వై జంక్షన్ నుంచి ఇక్రిశాట్ వరకు రెండు లేన్లలో అనుమతిస్తారు.

కూకట్ పల్లి నుంచి ఇక్రిశాట్ వైపు వెళ్లే వెహికల్స్​ను రెండు లేన్లలో అనుమతిస్తారు.

జేఎన్టీయూ నుంచి ఇక్రిశాట్ వైపు వెహికల్స్ ను ఒకే లేన్​లో అనుమతిస్తారు. మరో 3 లేన్లలో పాదయాత్ర ఉంటుంది.

వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సైబరాబాద్​ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు కోరారు..

WhatsApp channel