Revanth reddy: అలా చేస్తే బీ ఫామ్ ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తాం-tpcc chief revanth reddy slams trs bjp over munugodu bypoll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tpcc Chief Revanth Reddy Slams Trs Bjp Over Munugodu Bypoll

Revanth reddy: అలా చేస్తే బీ ఫామ్ ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తాం

Mahendra Maheshwaram HT Telugu
Aug 20, 2022 04:02 PM IST

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం కేసీఆర్ చేశారని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. చౌటుప్పల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... బీజేపీ కూడా కేసీఆర్ ఫార్ములాని అవలంభిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి పాదాభివందనం అనే అంశంతో మునుగోడులో ప్రచారంలోకి వెళ్తామని తెలిపారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి (twitter)

Revanth reddy slams trs bjp: రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు లోని అన్ని గ్రామాల్లో జయంతి కార్యక్రమాలు నిర్వహించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు గడ్డకు ఒక చరిత్ర ఉందని... సాయుధ రైతాంగ పోరాటానికి ఇక్కడి నాయకులు నేతృత్వం వహించారని గుర్తు చేశారు. చౌటుప్పల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నల్లగొండను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య రాష్ట్ర విభజనతో పరిష్కారం అవుతుందని నమ్మామని... కానీ కేసీఆర్ పాలనలో నల్లగొండను పట్టి పీడిస్తున్న సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదని దుయ్యబట్టారు.

ట్రెండింగ్ వార్తలు

'పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు ..రుణమాఫీ జరగలేదు. జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. జిల్లాలో గౌడ సోదరులకు, యాదవులకు, పద్మశాలి సామాజిక వర్గానికి న్యాయం జరగలేదు. జిల్లాలో లిక్కర్ వ్యాపారాన్ని ప్రోత్సహించి .. కల్లు వ్యాపారాన్ని నిర్వీర్యం చేశారు. చీప్ లిక్కర్ దుకాణాలు గల్లీగల్లీకి ఉన్నాయి. కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను .. ప్రజా సంఘాలను చంపే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచే ప్రయత్నం కేసీఆర్ చేశారు. బీజేపీ కూడా కేసీఆర్ ఫార్ములాని అవలంభిస్తున్నారు. పక్క పార్టీ నేతలను కొనేందుకు బీజేపీ ప్రత్యేక కమిటీ వేసుకుంది. బీజేపీ ఫిరాయింపులకు కేసీఆర్ ఆదర్శం గా కనిపిస్తుంది. బీజేపీలో చేరినప్పుడే పండగ .. తరువాత తలుపులు మూసుకొని ఏడుస్తారు. రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి కోసమే ఉప ఎన్నికలు అంటే .. కాంగ్రెస్ నుంచి పోటీ చేయవచ్చు కదా' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా అంటే తాము బీ ఫామ్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతామని చెప్పారు. అభివృద్ధి కోసమే రాజీనామా అని చెబుతున్నారని.. అలాంటప్పుడు బీజేపీ నలుగురు ఎంపీలు రాజీనామా చేయవచ్చు కదా అని నిలదీశారు. స్థానిక ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్న బీజేపీ .. వారితో కూడా రాజీనామా చేయిస్తుందా..? అమ్ముడు పోయిన స్థానిక ప్రజా ప్రతినిధులను రాజీనామా చేయాలని గ్రామాల్లో ప్రజలు డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. అమ్ముడుపోయిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఆ .. డబ్బును గ్రామ అకౌంట్ లో వేసి అభివృద్ధి చేస్తారా..? అని రేవంత్ నిలదీశారు. టిఆర్ఎస్ బిజెపి రెండూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆక్షేపించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదాతో పాటు డిండి ఎత్తిపోతల పథకం కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. డిండి ఎత్తిపోతల పథకం కు ఐదు వేల కోట్ల తో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి పుర్తి చేస్తే మునుగోడు లో ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి. మునుగోడు వస్తున్న అమిత్ షా డిండి ఎత్తిపోతల పథకం కు ప్రత్యేక ప్యాకేజీ పై ప్రకటన చేయాలి. డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేయకుండా కేసీఆర్ మునుగోడు అన్యాయం చేశారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మునుగోడు పరిధిలో అమలు చేయాలి. నియోజకవర్గంలో భూనిర్వాసితులకు మల్లన్న సాగర్ లా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను.నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ లేదు .. కొన్ని మండలాల్లో జూనియర్ కాలేజీ లేదు. కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేయడం ద్వారా బీజేపీ టిఆర్ఎస్ తోడు దొంగలకు బుద్ది చెప్పాలి. మునుగోడు లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎంతో సేవలు అందించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇప్పటికీ మునుగోడు ప్రజల గుండెల్లో ఉన్నారు. కాంగ్రెస్ డబ్బులు పంచదు .. కొనుగోలు చేయదు - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ కు ప్రజలు మద్దతుగా నిలవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ టీఆర్ఎస్ రెండూ వెయ్యి కోట్లు ఖర్చు చేస్తాయని... కానీ కాంగ్రెస్ వెయ్యి మందితో నియోజకవర్గంలో లక్ష మందికి దండం పెట్టి ఓట్లు అడుగుతామని చెప్పారు. మునుగోడులో ఎగిరితే కాంగ్రెస్ జెండా ఎగిరింది .. లేకుంటే కమ్యునిస్ట్ జెండా ఎగిరిందని.. ఇతర పార్టీల జెండా ఎగిరే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ లు మద్దతు ఇవ్వాలని .. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారం చేస్తారని స్పష్టం చేశారు.

పార్టీ మారే వారు నాపై విమర్శలు చేయడంలో పెద్ద విశేషం ఏమీ లేదన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సొత్తు కాదని.. ఇక్కడ ఎంతో మంది సీనియర్లు ఉన్నారని స్పష్టం చేశారు.అందరికీ సమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. నేను చేసిన రెడ్డి కామెంట్స్ లో ఎలాంటి వివాదం లేదని... స్పీచ్ అంతా వింటే అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు. మునుగోడులో మన మునుగోడు మన కాంగ్రెస్ అనే నినాదంతో.. ప్రజాస్వామ్యానికి పాదాభివందనం అనే అంశంతో ప్రచారంలో కి వెళ్తామని తెలిపారు.

IPL_Entry_Point