Medak Tomato Farmer : మహిపాల్ రెడ్డి 'పంట పండింది' - నెల రోజుల్లోనే కోటీ 90 లక్షల సంపాదన-tomato farmer from medak district turns millionaire overnight ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Tomato Farmer : మహిపాల్ రెడ్డి 'పంట పండింది' - నెల రోజుల్లోనే కోటీ 90 లక్షల సంపాదన

Medak Tomato Farmer : మహిపాల్ రెడ్డి 'పంట పండింది' - నెల రోజుల్లోనే కోటీ 90 లక్షల సంపాదన

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 07, 2023 02:04 PM IST

Medak District News: టమాటా ధ‌ర‌లు కొండెక్కిపోయాయి. ఆ పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కట్ చేస్తే ఈ టైంలో టమాటా సాగు చేస్తున్న రైతన్నలు మాత్రం కోటేశ్వరులు అయిపోతున్నారు. ఈ జాబితాలో చేరిపోయారు మెదక్ జిల్లాకు చెందిన మహిపాల్ రెడ్డి.

కోటీశ్వ‌రుడైన మెద‌క్ రైతు
కోటీశ్వ‌రుడైన మెద‌క్ రైతు

Tomato Farmer Mahipal Reddy : టమాట రైతన్న పంట పడుతోంది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా భారీగా ధరలు పెరిగిపోవటంతో.. ఆ పంటకు భారీ డిమాండ్ వచ్చేసింది. ఫలితంగా టమాట ధరలు పేదవాడి నడ్డివిరుస్తుంటే... వాటిని పండించిన రైతన్నల పరిస్థితిని ఒక్కరాత్రిలో మారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు కోటీశ్వరులు కాగా... తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన ఓ రైతు కూడా ఈ లిస్ట్ లో చేరిపోయారు.

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మొహమ్మద్ నగర్ కి చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డి అనే రైతు తన ఎనిమిది ఎకరాల్లో టమాటా పంట వేశాడు. సరిగ్గా టమాట ధరలు వంద రూపాయలకు కేజీ దాటే సమయానికి జూన్ 15 కి మహాపాల్ రెడ్డి పంట చేతికి వచ్చింది. ఈ నెలరోజుల సమయములోనే ఈ రైతు సుమారుగా కోటి 90 లక్షల రూపాయలు సంపాందించాడు. జూన్ 15 నుండి మొదలుకొని ఇప్పటివరకు, మహిపాల్ రెడ్డి సుమారుగా 7,000 క్రేట్ల టమాటాలను పఠాన్ చెరువు, బోయిన్ పల్లి, షాపూర్ మార్కెట్ లో కొనుగోలు చేశారు. ఒక్కో క్రెట్ లో 25 కేజీల టమాటాలు ఉంటాయి.

మహిపాల్ రెడ్డి, టమాట రైతు
మహిపాల్ రెడ్డి, టమాట రైతు

సుమారుగా ఒక క్రేట్ కీ ప్రస్తుతం 2,600 ధర పలుకుతుంది అని చెబుతున్నారు రైతు మహిపాల్ రెడ్డి. ఇంకా తన పంటలో సుమారుగా 5,000 క్రేట్ల టమాటాలు పంట వస్తుంది అని అంచనా వేస్తున్నారు. ధర ఇలాగే ఉంటే వచ్చే నెలలో మరో కోటి కోటిన్నిర వరకు ఆదాయం రావొచ్చు అని అంటున్నారు. సుమారుగా 20 సంవత్సరాలుగా కూరగాయలు పండిస్తున్నానని చెప్పిన మహిపాల్ రెడ్డి... తన జీవిత కాలంలో ఒక్క నెలలోనే ఇంత డబ్బుని ఎప్పుడు చూడలేదు అని సంతోషం వ్యక్తం చేశారు.

20 ఏళ్లుగా వ్యవసాయమే..

20 ఏళ్ల కిందట పదో తరగతిలో ఫెయిల్ అయిన మహిపాల్ రెడ్డి వ్యవసాయమే వృత్తిగా ఎంచుకున్నాడు. తనకున్న 20 ఎకరాలా పొలంలో వేరు వేరు కూరగాయలు పండించడంతో పాటు, తన గ్రామంతో పాటు పక్కన కౌడిపల్లి,ముట్రాజుపల్లి లో మరొక 80 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి ఇతర పంటలు పండిస్తున్నాడు. ఈ 20 సంవత్సరాల కాలంలో వ్యవసాయంలో చాలా ఎత్తుపల్లాలు చూసిన మహిపాల్ రెడ్డి... తన పనిని మాత్రం ఆపలేదు. ఓ నాడు ధరలు లేక టమాటాలని రోడ్డు పక్కన పారేసిన రోజులను కూడా చూశాడు మహిపాల్ రెడ్డి.

Whats_app_banner

సంబంధిత కథనం