తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 6, 2024: Jitta Political Journey : 20 ఏళ్ల పోరాటం.. దక్కని ప్రతిఫలం..! విషాదంగా ముగిసిన జిట్టా రాజకీయ జీవితం..!
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 06 Sep 202404:42 PM IST
Telangana News Live: Jitta Political Journey : 20 ఏళ్ల పోరాటం.. దక్కని ప్రతిఫలం..! విషాదంగా ముగిసిన జిట్టా రాజకీయ జీవితం..!
- తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డి శుక్రవారం కన్నుమూశారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్క అధికారిక పదవికి నోచుకోలేదు. అన్ని పార్టీలు కూడా ఆయన్ను వాడుకుని వదిలేశాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. జిట్టా రాజకీయ జీవితం విషాదాంతంగా ముగియటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు.
Fri, 06 Sep 202404:19 PM IST
Telangana News Live: Telangana Floods : 'రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లింది, తక్షణ సాయం అందిచండి' - కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్
- వరద బాధితులకు కేంద్రం తక్షణ సాయం అందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఏపీతో సమానంగా తెలంగాణకు నిధులివ్వాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలన్నారు.
Fri, 06 Sep 202401:55 PM IST
Telangana News Live: TGSPDCL : 'మా విద్యుత్ ఉద్యోగులు లంచం అడిగితే ఫిర్యాదు చేయండి' - TGSPDCL ప్రత్యేక ఫోన్ నెంబర్లు
- దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ కీలక ప్రకటన చేశారు. తమ సంస్థ పరిధిలోని అధికారులు లేదా సిబ్బంది లంచం అడిగితే తమకు తెలియజేయాలని సూచించారు. ఈ మేరకు ప్రత్యేక నెంబర్ల(040 - 2345 4884 లేదా 7680901912)ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించారు.
Fri, 06 Sep 202401:25 PM IST
Telangana News Live: Karimnagar : పోలీస్ వర్సెస్ పొలిటికల్..! సీపీపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ఫైర్ - అసలేం జరుగుతోంది..!
- కరీంనగర్ సీపీపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. దళిత సామాజికవర్గానికి చెందిన సీఐలను సీపీ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సీపీ తీరుపై స్పీకర్ తో పాటు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఎంకు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవతున్నారు.
Fri, 06 Sep 202412:14 PM IST
Telangana News Live: TG DSC Final Key 2024 : తెలంగాణ డీఎస్సీ ఫైనల్ 'కీ' విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- TG DSC Results 2024 Updates : తెలంగాణ డీఎస్సీ -2024 పరీక్షల ఫైనల్ కీ వచ్చేసింది. https://tgdsc.aptonline.in/tgdsc/FinalKey లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Fri, 06 Sep 202411:58 AM IST
Telangana News Live: Hyderabad Rain ALERT : హైదరాబాద్‌కు వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఛాన్స్!
- Hyderabad Rain ALERT : ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఖమ్మం, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. వరదలు బీభత్సం సృష్టించాయి. ఆ బాధ నుంచి తేరుకోకముందే.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
Fri, 06 Sep 202411:26 AM IST
Telangana News Live: TPCC President : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్
- తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశాలను జారీ చేసింది.
Fri, 06 Sep 202411:13 AM IST
Telangana News Live: Sangareddy News : ఈ తాపీ మేస్త్రీ మాములోడు కాదు..! 30 చోరీ కేసుల్లో నిందితుడు, పోలీసులకు ఇలా దొరికిపోయాడు..!
- తాపీ మేస్త్రీ పని చేస్తూ రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 30 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. చోరీల వివరాలను కొండాపూర్ సీఐ చంద్రయ్య వెల్లడించారు.
Fri, 06 Sep 202409:27 AM IST
Telangana News Live: BRAOU Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, PG అడ్మిషన్లు - సింపుల్ గా మీరే అప్లయ్ చేసుకోవచ్చు, ప్రాసెస్ ఇలా
- Ambedkar Open University Admissions 2024: డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చూడండి…!
Fri, 06 Sep 202408:37 AM IST
Telangana News Live: NALSAR Hyderabad : నల్సార్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు - ఖాళీలు, ముఖ్య వివరాలివే
- NALSAR Hyderabad Jobs : హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పలు రకాల ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 33 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. https://nalsar.ac.in/f వెబ్ సైట్ లోకి అప్లయ్ చేసుకోవచ్చు.
Fri, 06 Sep 202408:20 AM IST
Telangana News Live: rythu runa mafi : మేడ్చల్‌లో విషాదం.. రుణమాఫీ కాలేదని అగ్రికల్చరల్ ఆఫీసులో రైతు ఆత్మహత్య
- rythu runa mafi : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం జరిగింది. రైతు రుణమాఫీ కాలేదని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతుడి కుటుంబాన్ని హరీశ్ రావు పరామర్శించారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Fri, 06 Sep 202406:39 AM IST
Telangana News Live: Telangana Floods : ఒకే హెలికాప్టర్లో భట్టి విక్రమార్క, బండి సంజయ్.. కేంద్రమంత్రితో కలిసి ఏరియల్ సర్వే!
- Telangana Floods : ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. వందలాది ఇళ్లను నేలమట్టం చేశాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్లారు బండి సంజయ్, భట్టి విక్రమార్క.
Fri, 06 Sep 202405:51 AM IST
Telangana News Live: Vemulawada : శ్రావణ మాసం సందడి.. వేములవాడ రాజన్న ఆలయం ఆదాయం రూ.6.87 కోట్లు
- Vemulawada : కోరిన కోర్కెలు తీర్చే కోడే మొక్కల వేములవాడ రాజన్న ఆలయంలో.. శ్రావణ మాసం సందడి నెలకొంది. భక్తుల రద్దీతో ఆలయానికి నెల రోజుల్లో రూ: 6.87 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తుల రద్దీ, ఆదాయం సమకూరడంతో.. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులు యోచిస్తున్నారు.
Fri, 06 Sep 202405:35 AM IST
Telangana News Live: Whisky IceCreams: హైదరాబాద్‌లో విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు, అరికో ఐస్‌క్రీమ్స్ నిర్వాకం.. నిందితుల అరెస్ట్
- Whisky IceCreams: హైదరాబాద్‌లో విస్కీ ఐస్ క్రీమ్‌లు కలకలం రేపాయి. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 5లో ఉన్న అరికో ఐస్‌క్రీమ్స్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐస్ క్రీమ్ మెనూలో విస్కీ ఐస్ క్రీమ్ ఉన్నట్టు గుర్తించారు.
Fri, 06 Sep 202405:02 AM IST
Telangana News Live: Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
- Jitta Balakrishna Reddy: మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణా రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా కీలక పాత్ర పోషించారు. 2009లో యువతెలంగాణ పార్టీ స్థాపించారు.
Fri, 06 Sep 202405:00 AM IST
Telangana News Live: Eye donation : వారి కళ్లు ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి.. నేత్రదానంతో అంధులకు చూపునిద్దాం..
- Eye donation : సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. అన్నారు పెద్దలు. అందమైన ప్రపంచాన్ని చూడాలంటే.. చూపు సక్రమంగా ఉండాలి. అంతటి ప్రాముఖ్యత ఉన్న నేత్రాలను సంరక్షించుకోవటం.. అంధత్వాన్ని నియంత్రించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ.. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు.
Fri, 06 Sep 202403:00 AM IST
Telangana News Live: Pharmahub Protest: మాకొద్దు ఫార్మా హబ్ అంటూ అధికారుల్ని ముట్టడించిన సంగారెడ్డి రైతులు
- Pharmahub Protest: తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక-సంగారెడ్డి బోర్డర్లో ఉన్న న్యాల్కల్ మండలంలో సుమారుగా 2,000 ఎకరాలలో,ఫార్మా హబ్ పెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించగా, మాకొద్దు ఈ ఫార్మా హబ్ అని ఈ గ్రామాలకు చెందిన రైతులు పంచాయత్ కార్యదర్శి,ఎంపిడిఓ ల ను పంచాయత్ ఆఫీస్ లో బంధించిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.
Fri, 06 Sep 202402:08 AM IST
Telangana News Live: Sr Citizen Act: పెద్దపల్లి జిల్లాలో సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు.. తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు
- Sr Citizen Act: తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు బిడ్డలకు షాక్ ఇచ్చారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష. వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ ను పట్టించుకోకుంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు చేయక తప్పదని స్పష్టం చేశారు.కొడుకు పేరిట ఉన్న గిఫ్ట్ డీడ్ రద్దుచేసి ఆరు ఎకరాలను తిరిగి తండ్రీ పేరిట మార్చారు.
Fri, 06 Sep 202401:26 AM IST
Telangana News Live: Padi VS Balmuri: డైలాగ్ వార్... ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- Padi VS Balmuri: వర్షం వరదలతో పాటు నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతుంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. వర్షం వరదలతో జనం ఇబ్బందులతో చస్తుంటే అవేమి పట్టనట్లు కొందరు నేతలు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.