Telangana News Live September 4, 2024: Jagtial District News : పెళ్లైన 18 రోజులకే వధువు సూసైడ్ - అరచేతిపై మరణ వాంగ్మూలం!-today telangana news latest updates september 4 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live September 4, 2024: Jagtial District News : పెళ్లైన 18 రోజులకే వధువు సూసైడ్ - అరచేతిపై మరణ వాంగ్మూలం!

Jagtial District News : పెళ్లైన 18 రోజులకే వధువు సూసైడ్ - అరచేతిపై మరణ వాంగ్మూలం!

Telangana News Live September 4, 2024: Jagtial District News : పెళ్లైన 18 రోజులకే వధువు సూసైడ్ - అరచేతిపై మరణ వాంగ్మూలం!

05:10 PM ISTSep 04, 2024 10:40 PM HT Telugu Desk
  • Share on Facebook
05:10 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 04 Sep 202405:10 PM IST

Telangana News Live: Jagtial District News : పెళ్లైన 18 రోజులకే వధువు సూసైడ్ - అరచేతిపై మరణ వాంగ్మూలం!

  • జగిత్యాల జిల్లాలో నవ వధువు సూసైడ్ చేసుకుంది. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని  అరచేతిపై మరణ వాంగూల్మం రాసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202404:45 PM IST

Telangana News Live: Asifabad District : ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం..! జైనూరులో ఉద్రిక్తత పరిస్థితులు, కర్ఫ్యూ విధింపు

  •  ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం ఘటనతో నిరసనలు చెలరేగాయి. దీంతో ఆస్తి నష్టం వాటిల్లింది. మరోవైపు స్థానికంగా కర్ఫ్యూ విధిస్తూ డీజీపీ ఆదేశాలను జారీ చేశారు.  ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202403:19 PM IST

Telangana News Live: TG Best Teacher Awards 2024 : వడ్డాణం శ్రీనివాస్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

  • తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా యూనివర్శిటీల విభాగం నుంచి ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్ రావుకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కింది. ప్రస్తుతం ఆయన బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202402:24 PM IST

Telangana News Live: TG Govt Holidays : ఈ నెలలో ఆ 2 రోజులు సెలవు..! తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

  •  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో జరిగే మిలాద్ ఉన్ నబీ, గణేష్ చతుర్థి పండుగలకు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 7 వినాయక చవితి,  17న మిలాద్ ఉన్ నబీకి హాలీ డే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202412:08 PM IST

Telangana News Live: Godavari : ఉప్పొంగుతున్న గోదావరి..! భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ

  • రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ హెచ్చరించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202411:39 AM IST

Telangana News Live: ONGC Scholarships 2024 : విద్యార్థులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ - నెలకు రూ. 4 వేలు, ఇలా దరఖాస్తు చేసుకోండి..!

  • విద్యార్థులకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీ(ONGC) గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదికి రూ. 48 వేల స్కాలర్ షిప్ అందించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ విభాగాలకు చెందిన విద్యార్థులను వీటి కోసం ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు సెప్టెంబరు 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202410:42 AM IST

Telangana News Live: HYDRA : 'హైడ్రా' పేరుతో బెదిరింపులు, రూ.20 లక్షలు డిమాండ్ - వైద్యుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

  • హైడ్రా పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన ఓ వైద్యుడిని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ రూపేష్ సూచించారు. ఏవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202409:48 AM IST

Telangana News Live: Warangal Train Track : వేగంగా రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ ..! విజయవాడ - హైదరాబాద్‌ మధ్య రాకపోకలు షురూ, ఇదిగో వీడియో

  • మహబూబాబాద్‌ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. డౌన్‌ లైన్‌లో బుధవారం అర్ధరాత్రికి పనులు పూర్తి అవుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202409:18 AM IST

Telangana News Live: Dy CM Pawan Kalyan : తెలంగాణకు పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం - హైడ్రాపై కీలక వ్యాఖ్యలు

  • వరద విపత్కర పరిస్థితుల్లో తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అందజేస్తానని తెలిపారు,
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202408:59 AM IST

Telangana News Live: Hyderabad to Vijayawada : విజయవాడ రూట్ ప్రయాణికులకు అలర్ట్... టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన TGSRTC, వివరాలివే

  • TGSRTC Discount Offer: హైదరాబాద్ - విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రూట్‌లో ప్రయాణించే వారికోసం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202408:26 AM IST

Telangana News Live: AP TG Rain Alert : మరో అల్పపీడనం ముప్పు..! ఏపీకి భారీ నుంచి అతిభారీ వర్ష సూచన - ఈ జిల్లాలకు హెచ్చరికలు

  • తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది.  పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫలితంగా ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202408:20 AM IST

Telangana News Live: Medak Rescue: చేపలు పట్టడానికి వాగులోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు, కాపాడిన పోలీసులు

  • Medak Rescue: చేపలు పట్టడానికని వాగులోకి దిగి ప్రాణాల మీదికి తెచుకున్నాడో యువకుడు, ప్రాణాలకు తెగించి తనను కాపాడరు స్థానికుల యువకులు మెదక్ పోలీసులు. ఈ సంఘటన, మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల పరిధిలో జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202404:10 AM IST

Telangana News Live: Godavari Floods: మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి

  • Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది. నేటి ఉదయానికి అంటే బుధవారం ఉదయం 6 గంటల సమయానికి 42.10 అడుగులకు ఎగబాకింది. 43 అడుగులకు నీటి మట్టం చేరిందంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202403:49 AM IST

Telangana News Live: 200 హెక్టార్లలో 50 వేల చెట్లు నేలమట్టం.. తాడ్వాయి ఫారెస్ట్ పరిస్థితి ఏంటి..?

  • రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వరదలు కాలనీలు ముంచెత్తుతుండగా.. జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని ఫారెస్ట్ ఏరియా దెబ్బతినడం కలకలం రేపుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202403:06 AM IST

Telangana News Live: Medak Cruelty: మంత్రాల నెపంతో మెదక్‌లో దారుణం, కర్రలు, రాళ్ల దాడిలోఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

  • Medak Cruelty: మంత్రాలూ చేస్తున్నారనే అనుమానంతో మెదక్‌లో ముగ్గురి పై కట్టెలు, రాళ్లతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. గ్రామాల్లో ప్రజలు మంత్రాలూ, తంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఒకరి ప్రాణాలు తీయటం అందరిని షాక్ గురి చేసింది. మెదక్ జిల్లాలో ఈ దారుణ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202402:31 AM IST

Telangana News Live: HarishRao: వరద సహాయక చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విఫలమయ్యాయన్న మాజీ మంత్రి హరీష్‌రావు

  • HarishRao: ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. మంగళవారం ఖమ్మం నగరంలో మున్నేరు పరివాహక ప్రాంతాలను సందర్శించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202402:09 AM IST

Telangana News Live: Ellampalli Project: పర్యాటక కేంద్రంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామన్న మంత్రి శ్రీధర్‌బాబు

  • Ellampalli Project: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎల్లంపల్లికి ఇంకా వరద పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు, గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202411:30 PM IST

Telangana News Live: Hyderabad Rains : అర్ధరాత్రి వేళ హైదరాబాద్‌లో కుండపోత వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం..!

  • హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి వేళ పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
పూర్తి స్టోరీ చదవండి