తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 29, 2024: Hyderabad : హోంగార్డు మృతి.. హైడ్రా బలి తీసుకుందనడం సరికాదు : రంగనాథ్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 29 Sep 202405:00 PM IST
Telangana News Live: Hyderabad : హోంగార్డు మృతి.. హైడ్రా బలి తీసుకుందనడం సరికాదు : రంగనాథ్
- Hyderabad : ఇటీవల సంగారెడ్డి జిల్లాలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అప్పుడు అపశ్రుతి జరిగింది. ఓ హోంగార్డుకు గాయాలయ్యాయి. అతను చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై తాజాగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. అతన్ని హైడ్రా బలి తీసుకుందనడం సరికాదన్నారు.
Sun, 29 Sep 202403:38 PM IST
Telangana News Live: Karimnagar : మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- Karimnagar : తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సులను మహిళలకే అప్పగించాలని చూస్తుందా? మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది.
Sun, 29 Sep 202401:40 PM IST
Telangana News Live: TG Revenue Department : రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన.. కలెక్టర్ల అనుమతితోనే తహశీల్దార్లపై కేసులు: పొంగులేటి
- TG Revenue Department : తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి ముఖాముఖిగా మాట్లాడారు. సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తామన్నారు. కలెక్టర్ల అనుమతితోనే తహశీల్దార్లపై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల కోసం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
Sun, 29 Sep 202412:14 PM IST
Telangana News Live: Siddipet : ఏడో తరగతి బాలికపై యువకుడు అత్యాచారం - నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన కుటుంబ సభ్యులు
- ఏడో తరగతి బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని కొమురవెల్లి మండల పరిధిలో జరిగింది. ఆగ్రహించిన కుటుంబ సభ్యుల… నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sun, 29 Sep 202411:03 AM IST
Telangana News Live: Hyderabad : రేవంత్ అంకుల్.. మా ఇల్లు కూల్చొద్దు ప్లీజ్.. రోడ్డెక్కి వేడుకున్న చిన్నారి!
- Hyderabad : హైదరాబాద్ వాసులను కూల్చివేతల భయం వెంటాడుతోంది. ముఖ్యంగా ఇటీవల మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్ వేయడంతో.. భయంతో రోడ్డెక్కారు. తమ ఇళ్లను కూల్చొద్దని అధికారులను వేడుకుంటున్నారు.
Sun, 29 Sep 202409:15 AM IST
Telangana News Live: Bandi Sanjay on Hydra : ఇళ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా.. హైడ్రాపై బండి సంజయ్ ఫైర్
- Bandi Sanjay on Hydra : హైడ్రాపై విమర్శలు రోజురోజూకు పెరుగుతున్నాయి. హైడ్రా విషయంలో ఇన్నాళ్లు సైలెంట్‌గా బీజేపీ.. ఇప్పుడు స్వరం పెంచుతోంది. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ హైడ్రాపై ఫైర్ అయ్యారు. రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. బండి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Sun, 29 Sep 202407:40 AM IST
Telangana News Live: HYDRA Demolitions : హైడ్రా కూల్చివేతలపై ఆలోచించాలి - ఆ విషయం ముందే చెప్పా! ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు
- హైడ్రా కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుడిసెల జోలికి వెళ్లటం మంచిది కాదని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన అవసరమే అన్న ఆయన… పేదల ఇళ్ల కూల్చే విషయంపై ఆలోచించాలన్నారు.
Sun, 29 Sep 202407:14 AM IST
Telangana News Live: Cental Tribal University : సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు - ముఖ్య తేదీలివే
- Sammakka Sarakka Tribal University : సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ నుంచి స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. బీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అక్టోబర్ 3వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. https://ssctu.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
Sun, 29 Sep 202406:25 AM IST
Telangana News Live: HYDRA Musi River : మూసీ, హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్ నేతల బృందం - కాలనీల్లో భారీ ర్యాలీ
- మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ నేతల బృందం పర్యటిస్తోంది. మూసీ, హైడ్రా బాధితులతో మాట్లాడి వివరాలను తెలుసుకుంటోంది. మాజీ మంత్రి హరీశ్ రావ్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నగరానికి చెందిన నేతలు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
Sun, 29 Sep 202404:59 AM IST
Telangana News Live: Flight Services : హైదరాబాద్ టూ అయోధ్య, ప్రయాగరాజ్ - కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 28 నుంచి మొదలు కాగా… హైదరాబాద్-ప్రయాగరాజ్, హైదరాబాద్-ఆగ్రా మధ్య వారానికి 3 రోజుల సర్వీసులు నడవనున్నాయి. కొత్త సర్వీసులపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sun, 29 Sep 202404:48 AM IST
Telangana News Live: Hyderabad Crime : ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం, ఉద్యోగం ఇస్తానని గదికి పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్ పై అత్యాచారం
- Hyderabad Crime : హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగ అవకాశం ఇస్తానని ఇన్ స్టాలో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి గదికి రప్పించి ఆమెపై అత్యాచారం చేశాడో వ్యక్తి. ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Sun, 29 Sep 202404:00 AM IST
Telangana News Live: BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తులకు రేపే ఆఖరు తేదీ, ఇవిగో లింక్స్
- Ambedkar Open University Admissions 2024: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 30వ తేదీతో పూర్తి అవుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవాలి.
Sun, 29 Sep 202402:38 AM IST
Telangana News Live: Hyderabad News : మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ ఆరోపణలు, విద్యార్థి సంఘాల ఆందోళన
- Hyderabad News : మాదాపూర్ అయ్యప్ప సొసైటీ శ్రీ చైతన్య క్యాంపస్ లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుంటే... వైరల్ ఫీవర్స్ అని కాలేజీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఫుడ్ సెఫ్టీ అధికారులు కాలేజీలో తనిఖీలు చేశారు.
Sun, 29 Sep 202401:01 AM IST
Telangana News Live: DISCOM Employees Transfers : తెలంగాణ డిస్కమ్ లలో బదిలీలు- ఉద్యోగుల జాబితా, షెడ్యూల్ విడుదల
- DISCOM Employees Transfers : తెలంగాణ డిస్కమ్ లలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఒకేచోట రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగుల బదిలీలకు డిస్కమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీ జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో పేరున్న ఉద్యోగులు అక్టోబర్ 2 నుంచి 4 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
Sun, 29 Sep 202412:32 AM IST
Telangana News Live: Telangana Temples : ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు, తిరుమల ఘటనతో అప్రమత్తమైన దేవాదాయశాఖ
- Telangana Temples Prasadam : తిరుమల లడ్డూ వ్యవహారం వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యినే వాడాలని ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్ లోని వేములవాడ, కొండగట్టు, ధర్మపరి ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యిని ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నారు.