తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 2, 2024: Kadem Project : కడెం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు, సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశాలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 02 Sep 202405:13 PM IST
Telangana News Live: Kadem Project : కడెం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు, సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశాలు
- Kadem Project : నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలకు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేశాయి. కడెం ప్రాజెక్టులో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టును మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Mon, 02 Sep 202404:07 PM IST
Telangana News Live: Salute Real Heroes : సాటి మనిషి కోసం ప్రాణాలు లెక్కచేయని వైనం- రియల్ హీరోలకు సెల్యూట్
- Salute Real Heroes : పోతే ఒక్కడినే, వస్తే పది మందిమి అంటూ ప్రాణాలు లెక్కచేయని జేసీబీ డ్రైవర్, సాటి మనిషి కోసం తమ ప్రాణాలు లెక్క చేయని పోలీసులు, వందల మంది ఆకలి తీర్చిన స్వచ్ఛంద సంస్థలు.... ఇలా ఈ ఆపద సమయంలో ఎంతో మంది రియల్ హీరోలు ఉన్నారు.
Mon, 02 Sep 202402:01 PM IST
Telangana News Live: TG Rains : తెలంగాణలో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన, విద్యా సంస్థలకు సెలవుపై కలెక్టర్లదే నిర్ణయం-సీఎస్ శాంతి కుమారి
- TG Rains : తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రేపు దాదాపు 11 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతి కమారి కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. పునరావాస, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాసంస్థలకు సెలవుపై నిర్ణయం కలెక్టర్లదేనని స్పష్టంచేశారు.
Mon, 02 Sep 202401:40 PM IST
Telangana News Live: Cyber Crime : పెట్టుబడుల పేరుతో మోసం, దేశవ్యాప్తంగా కోట్లు కొల్లగొట్టిన జంట అరెస్ట్
- Cyber Crime : తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ తమిళనాడుకు చెందిన ఓ కిలాడీ జంట అమాయకులను బురిడీ కొట్టిస్తుంది. తెలంగాణలో 15 నేరాలకు పాల్పడి.. మొత్తంగా రూ. 3 కోట్లకు పైగా వసూలు చేశారు. కోట్లు కొల్లగొట్టిన ఈ జంటను వరంగల్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.
Mon, 02 Sep 202401:18 PM IST
Telangana News Live: CM Revanth Reddy : వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.10 వేలు, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
- CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునిగిన వరద బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Mon, 02 Sep 202409:42 AM IST
Telangana News Live: RTC Buses Trains Cancelled : భారీ వర్షాల ఎఫెక్ట్- 432 రైళ్లు ,1400 ఆర్టీసీ బస్సులు రద్దు
- RTC Buses Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకూ 1400 ఆర్టీసీ బస్సులు, 432 రైళ్లు రద్దయ్యాయి.
Mon, 02 Sep 202408:26 AM IST
Telangana News Live: Garikapadu NH Road : గరికపాడు వద్ద కొట్టుకుపోయిన హైవే, హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు బంద్
- Garikapadu NH Road : ఏపీ, తెలంగాణ సరిహద్దులో గరికపాడు వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై సుమారు 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. కోదాడ వైపు వస్తున్న వాహనాలను మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు.
Mon, 02 Sep 202408:13 AM IST
Telangana News Live: Adilabad Rains: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలతో స్తంభించిన జనజీవనం.. ఒకరి మృతి
- Adilabad Rains: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురవడంతో జనం తల్లడిల్లతున్నారు. భారీ వర్షాలతో వాగులు, ఒర్రెలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతీ మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్లు ప్రకటించారు.
Mon, 02 Sep 202407:47 AM IST
Telangana News Live: Telangana Floods : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
- Telangana Floods : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.
Mon, 02 Sep 202407:18 AM IST
Telangana News Live: TG LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు..! మీ అలాట్మెంట్ ఇలా చెక్ చేసుకోండి
- TG LAWCET 2024 Counselling : టీజీ లాసెట్ - 2024 కౌన్సెలింగ్ కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఇవాళ (సెప్టెంబర్ 2) ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు టీజీ లాసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ చేసుకోవచ్చు.
Mon, 02 Sep 202406:32 AM IST
Telangana News Live: పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు మృతి.. వరదల్లో ఇద్దరు, కరెంట్ షాక్‌తో మరొకరు
- భారీ వర్షం, వరదలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అతలాకుతలం చేశాయి. ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కరెంట్ షాక్ తో మహిళ మృతి చెందారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి నీళ్ళు చేరి పంట పొలాలు నీట మునిగి భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
Mon, 02 Sep 202405:40 AM IST
Telangana News Live: TG SET 2024 : తెలంగాణ 'సెట్' అభ్యర్థులకు అలెర్ట్.. నేడు హాల్ టికెట్లు విడుదల.. ఇదిగో లింక్
- TG SET 2024 : తెలంగాణ సెట్ 2024 పరిక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. తెలంగాణ సెట్ వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ సెట్ 2024 కు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవల మార్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
Mon, 02 Sep 202404:58 AM IST
Telangana News Live: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరదలు.. ఒకరు గల్లంతు
- వర్షం, వరదలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Mon, 02 Sep 202404:15 AM IST
Telangana News Live: Crypto Scam: ఆన్‌లైన్ సంపాదన పేరిట మోసం చేస్తున్న ఉద్యగుల అరెస్ట్
- Crypto Scam: డిజిటల్ కరెన్సీతో అధిక లాభాలంటూ ఆశచూపి లక్షలాది రూపాయలను ముంచేసి మోసం చేసిన వారి ఆటలను నిర్మల్ పోలీసులు కట్టించేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో పెట్టుబడి పెట్టించి బురిడీ కొట్టించిన వారిని అరెస్టు చేశారు.
Mon, 02 Sep 202402:13 AM IST
Telangana News Live: Exams Postponed : ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు అలెర్ట్.. ఆ పరీక్షలు వాయిదా
- Exams Postponed : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కనీసం బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశాయి.
Mon, 02 Sep 202401:44 AM IST
Telangana News Live: Telangana Rains : తెలంగాణలో ఇవాళ కూడా భారీ వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. మరింత అప్రమత్తత అవసరం
- Telangana Rains : తెలంగాణ కుంభవృష్టితో విలవిల్లాడుతోంది. ఎక్కడ చూసిన వర్షం సృష్టించిన బీభత్సమే కనిపిస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నుంచి ఇంకా తేరుకోలేదు. అప్పుడే ఐఎండీ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. సోమవారం కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Mon, 02 Sep 202401:06 AM IST
Telangana News Live: Government Hostels : బాబోయ్ ఎలుకలు.. ఆ గురుకులానికి వెళ్లబోమంటున్న విద్యార్థులు!
- Government Hostels : ఆ గురుకుల పాఠశాలలో ఎలుకులు స్వైర విహారం చేస్తున్నాయి. అడుగడుగునా పేరుకుపోయిన అపరిశుభ్రత వీటిని పెంచి పోషిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి గురుకుల పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్న ఏడోతరగతి విద్యార్థులు.. ఎలుకల భారిన పడ్డారు. ఏకంగా 14 మంది విద్యార్థులను ఎలుకలు కొరికేశాయి.
Mon, 02 Sep 202412:24 AM IST
Telangana News Live: Khammam Floods : భారీ వరదలతో ఖమ్మం ఉక్కిరిబిక్కిరి.. ప్రధానమైన 10 సంఘటనలు ఇవీ..!
- Khammam Floods : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు మున్నేరు వాగు మహోగ్రరూపం దాల్చింది. దీంతో ఖమ్మం వాసులు భయాందోళనలో ఉన్నారు.