తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 1, 2024: Sangareddy Crime : సంగారెడ్డిలో తీవ్ర విషాదం- ఆర్థిక కష్టాలతో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తల్లి ఆత్మహత్య
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 01 Sep 202404:41 PM IST
Telangana News Live: Sangareddy Crime : సంగారెడ్డిలో తీవ్ర విషాదం- ఆర్థిక కష్టాలతో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తల్లి ఆత్మహత్య
- Sangareddy Crime : అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి, ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. మద్యానికి బానిసైన భర్తకు రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, ఆసుపత్రి ఖర్చులు, పిల్లలకు తింటి పెట్టలేని పరిస్థితి. ఈ కష్టాలతో తీవ్ర మనోదనకు గురై దారుణానికి పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డిలో జరిగింది.
Sun, 01 Sep 202404:01 PM IST
Telangana News Live: Munneru Floods : మున్నేరు వాగు మహోగ్రరూపం, 15 కాలనీలు జలమయం-ఇండ్లపైకి చేరి సాయం కోసం బాధితుల ఎదురుచూపులు
- Munneru Floods : ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో మున్నేరు పరివాహకంలోని 15 కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. బాధితులు ఇండ్లపైకి చేరి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. తమను రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు.
Sun, 01 Sep 202401:24 PM IST
Telangana News Live: Young Scientist Died : ఆకేరువాగులో కొట్టుకుపోయిన కారు- యువశాస్త్రవేత్త మృతి
- Young Scientist Died : ఖమ్మం జిల్లాకు చెందిన యువ శాస్త్రవేత్త డా.అశ్విని... కారు వాగులో కొట్టుకుపోయిన ఘటనలో మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయ్యగూడెం వద్ద ఆకేరువాగులో అశ్విని, ఆమె తండ్రి ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. ఇవాళ ఆమె మృతదేహం లభ్యమైంది
Sun, 01 Sep 202412:48 PM IST
Telangana News Live: AP TG Transport Stall : జలమయమైన జాతీయ రహదారులు-ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్
- AP TG Transport Stall : భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు, చిమిర్యాల వాగులు పొంగడంతో జాతీయ రహదారులు జలమయం అయ్యాయి. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు వాహనరాకపోకలను నిలిపివేశారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి.
Sun, 01 Sep 202412:33 PM IST
Telangana News Live: IMD Alerts : గ్రీన్.. ఎల్లో.. ఆరెంజ్.. రెడ్ అలెర్ట్.. అసలు వీటి అర్థం ఏంటీ.. ఐఎండీ ఎందుకు వీటిని జారీ చేస్తుంది?
- IMD Alerts : ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఐఎండీ ఒక్కో ఏరియాకు ఒక్కో రంగుతో హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో అసలు ఏ రంగు హెచ్చరిక ఎప్పుడు ఇస్తారు.. ఎందుకు ఇస్తారనే చర్చ జరుగుతోంది. వాటి వివరాలు క్లుప్తంగా మీ కోసం..
Sun, 01 Sep 202410:03 AM IST
Telangana News Live: Adilabad : జియో ట్యాగింగ్ ద్వారా 'పశువుల గణన'.. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్న అధికారులు
- Adilabad : జియో ట్యాగింగ్ ద్వారా పశు గణన కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ఇందు కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పశువైద్యశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనాభా గణన లాగే పశువుల గణన కూడా చేపట్టి గణాంకాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు.
Sun, 01 Sep 202409:42 AM IST
Telangana News Live: Srisailam : శ్రీశైలం వైపు వెళ్లొద్దు.. నాగర్ కర్నూల్ పోలీసుల హెచ్చరిక
- Srisailam : తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా.. రోడ్లన్నీ జల దిగ్భంధంలోనే ఉన్నాయి. ఇక ఘాట్ రోడ్డుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నాగర్ కర్నూల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Sun, 01 Sep 202407:55 AM IST
Telangana News Live: TG School Holidays : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు
- తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
Sun, 01 Sep 202407:46 AM IST
Telangana News Live: Hyderabad Accident: రాష్ డ్రైవింగ్.. గాల్లోకి ఎగిరి పడిపోయిన మహిళ.. షాకింగ్ విజువల్స్
- Hyderabad Accident: హైదరాబాద్ నగరంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల హబ్సీగూడలో జరిగిన ప్రమాదాన్ని మర్చిపోకముందే.. మరో ఘటన జరిగింది. రాష్ డ్రైవింగ్ ఓ మహిళను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. ఈ ప్రమాదం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.
Sun, 01 Sep 202407:28 AM IST
Telangana News Live: Adilabad Sadarmat Barrage : సదర్ మాట్ బ్యారేజీ పూర్తి...! ఆనందంలో ఆయకట్టు రైతులు
- సదర్ మాట్ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నారు. దీంతో ఆయకట్ట రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తితో ప్రతి ఏటా రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Sun, 01 Sep 202407:17 AM IST
Telangana News Live: Warangal Police: శభాష్ పోలీస్.. భారీ వర్షంలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న వరంగల్ సీపీ
- Warangal Police: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాగులు ఉధృతంగా ప్రవహించే ప్రాంతాల్లోనే ఉండి ప్రజలకు సూచనలు చేస్తున్నారు. వరంగల్ సీపీ రంగంలోకి దిగి పలు ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
Sun, 01 Sep 202406:47 AM IST
Telangana News Live: BRAOU Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, PG అడ్మిషన్లు - మరోసారి అప్లికేషన్ల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..
- Ambedkar Open University Admissions 2024: డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలకు సంబంధించి డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ మరోసారి అప్డేట్ ఇచ్చింది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30వ తేదీకి పొడిగించింది. అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
Sun, 01 Sep 202406:31 AM IST
Telangana News Live: Hyderabad September Rains: హైదరాబాద్‌ను వెంటాడుతున్న వర్షాలు.. నగరవాసులకు సెప్టెంబర్ భయం.. చరిత్రలో ఎన్నో చేదు అనుభవాలు!
- Hyderabad September Weather: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ నెల అంటేనే భాగ్యనగర వాసులు భయపడుతున్నారు. దానికి కారణం.. హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ మాసంలో కురిసిన వర్షాలు ఎన్నో చెదు అనుభవాలను మిగిల్చాయి.
Sun, 01 Sep 202406:09 AM IST
Telangana News Live: Telangana Rains : అధికారులు సెలవులు పెట్టొద్దు... 24 గంటలు అలర్ట్ గా ఉండండి - వర్షాలపై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
- రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని… సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలన్నారు.
Sun, 01 Sep 202405:20 AM IST
Telangana News Live: Hyderabad Rain Alert: హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు.. ప్రధానమైన 10 ముఖ్యాంశాలు
- Hyderabad Rain Alert: హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు మూడు గంటల్లో మళ్లీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలపై 10 కీలక అంశాలు ఇవి.
Sun, 01 Sep 202404:45 AM IST
Telangana News Live: TG ICET Counseling 2024 : ఇవాళ్టి నుంచి 'ఐసెట్' కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలివే
- ఇవాళ్టి నుంచి టీజీ ఐసెట్ - 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఆదివారం నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి నుంచి 11వరకు వెబ్‌ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు.
Sun, 01 Sep 202403:22 AM IST
Telangana News Live: Warangal Rains : ధ్వంసమైన రైల్వే ట్రాక్.. తప్పిన పెనుప్రమాదం! నిలిచిపోయిన పలు రైళ్లు
- తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెరువు కట్ట తెగడంతో మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి.
Sun, 01 Sep 202401:21 AM IST
Telangana News Live: TGPSC Group 3 Updates : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - మరోసారి 'ఎడిట్ ఆప్షన్', పూర్తి వివరాలివే
- TGPSC Group 3 Updates : గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తుల ఎడిట్ కు మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
Sun, 01 Sep 202412:53 AM IST
Telangana News Live: CM Revanth Reddy : బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం..! హైదరాబాద్ - సాగర్ హైవే విస్తరణపై కీలక ఆదేశాలు
- రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం ఏర్పాటుతో పాటు నాగార్జునసాగర్ టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్-నాగార్జునసాగర్ ఫోర్ లేన్ రహదారికి నిర్ణయం తీసుకున్నారు.
Sun, 01 Sep 202412:39 AM IST
Telangana News Live: AP TG Rains : ఇవాళ అత్యంత భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు ఐఎండీ ‘రెడ్ అలర్ట్’
- వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.