Telangana News Live October 25, 2024: KTR : ఒరిజినల్ బాంబులకే భయపడలేదు.. ఈ తుస్సు బాంబులకు భయపడుతామా? : కేటీఆర్-today telangana news latest updates october 25 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live October 25, 2024: Ktr : ఒరిజినల్ బాంబులకే భయపడలేదు.. ఈ తుస్సు బాంబులకు భయపడుతామా? : కేటీఆర్

KTR : ఒరిజినల్ బాంబులకే భయపడలేదు.. ఈ తుస్సు బాంబులకు భయపడుతామా? : కేటీఆర్

Telangana News Live October 25, 2024: KTR : ఒరిజినల్ బాంబులకే భయపడలేదు.. ఈ తుస్సు బాంబులకు భయపడుతామా? : కేటీఆర్

04:08 PM ISTOct 25, 2024 09:38 PM HT Telugu Desk
  • Share on Facebook
04:08 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 25 Oct 202404:08 PM IST

తెలంగాణ News Live: KTR : ఒరిజినల్ బాంబులకే భయపడలేదు.. ఈ తుస్సు బాంబులకు భయపడుతామా? : కేటీఆర్

  • KTR : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చావుకైదా తెగించాం.. ఏ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని సవాల్ విసిరారు. ఒరిజినల్ బాంబులకే భయపడలేదు, తుస్సు బాంబులకు భయపడతామా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బావమరిది, పొంగులేటి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ బాగోతం బయట పెడతామని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 25 Oct 202402:50 PM IST

తెలంగాణ News Live: Hyderabad IPhones : చైనా మేడ్ ఫోన్లకు ఐఫోన్ స్టిక్కర్‌లు.. తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడితే.. అంతే సంగతులు!

  • Hyderabad IPhones : ఐఫోన్ వాడాలనేది చాలామంది కల. ఎక్కడ తక్కువ ధరకు వస్తుంది.. ఎప్పుడు ఆఫర్లు ప్రకటిస్తారు అని ఎంతో మంది ఎదురుచూస్తారు. అలాంటి వారిని మోసం చేయడానికి నకిలీ గ్యాంగ్‌లు రంగంలోకి దిగాయి. చైనా మేడ్ ఫోన్లకు ఐఫోన్ స్టిక్కర్లు అంటించి విక్రయిస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 25 Oct 202401:21 PM IST

తెలంగాణ News Live: Jagtial Murder Episode : జీవన్‌రెడ్డి ఆవేదన చూసి బాధ కలిగింది : జగ్గారెడ్డి

  • Jagtial Murder Episode : జగిత్యాలలో జరిగిన మర్డర్.. కాంగ్రెస్ పార్టీలో రచ్చకు కారణమైంది. జీవన్ రెడ్డికి మద్దతుగా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ జగ్గారెడ్డి.. ఈ ఇష్యూపై స్పందించారు. జీవన్‌రెడ్డి ఆవేదన చూసి బాధ కలిగిందన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 25 Oct 202411:49 AM IST

తెలంగాణ News Live: Jani Master Released : చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్‌ విడుదల.. 36 రోజుల తర్వాత మెడలో ఎర్ర కండువాతో..

  • Jani Master Released : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యారు. తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో.. చంచల్‌గూడ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చారు. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌‌ను హైదరాబాద్ పోలీసులు గతనెల 20న అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 25 Oct 202410:13 AM IST

తెలంగాణ News Live: Nalgonda fluorid: ఫ్లోరైడ్ భూతం నల్గొండపై మళ్లీ పంజా విసురుతోందా..? ఉమ్మడి నల్గొండ జిల్లాలో 23 మండలాల్లో ప్రమాద ఘంటికలు

  • Nalgonda fluoride: ఫ్లోరైడ్ విముక్త రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత మళ్లీ నల్గొండపై  ఫ్లోరైడ్ బూతం పడగ విప్పుతోంది. రెండేళ్ల కిందట . ఫ్లోరైడ్ ఫ్రీ స్టేట్ గా  భారత పార్లమెంట్ ప్రకటించింది. తాజాగా నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువగానే నీటిలో ఫ్లోరైడ్ ఉందంటుని  నివేదికలు వెల్లడిస్తున్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 25 Oct 202409:50 AM IST

తెలంగాణ News Live: Revanth Reddy : గుజరాత్‌కు పోటీ ఇవ్వబోతున్నాం.. అందుకే ఫినిష్ చేయాలని చూస్తున్నారు : రేవంత్ రెడ్డి

  • Revanth Reddy : హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌ను రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్రను వివరించారు. కాంగ్రెస్ హయాంలో దక్షిణాదితో పాటు ఉత్తరాదికి మేలు జరిగింది.. ఎన్డీయేలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 25 Oct 202408:58 AM IST

తెలంగాణ News Live: Konda Surekha Vs KTR: కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం, ఆ వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశం..

  • Konda Surekha Vs KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ‌్యలపై  సిటీ సివిల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి కొండా సురేఖ వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 25 Oct 202408:39 AM IST

తెలంగాణ News Live: Medak Medical College : ఎన్నో ఏళ్ల కల సాకారం.. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం

  • Medak Medical College : మెదక్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల కల సాకారమైంది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరునికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 25 Oct 202408:32 AM IST

తెలంగాణ News Live: Medak Medical College: నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్న దామోదర రాజనరసింహ

  • Medak Medical College: మెదక్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల కల సాకారమైంది. ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరునికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 25 Oct 202404:55 AM IST

తెలంగాణ News Live: TG Govt Skills University : స్కిల్స్ యూనివర్శిటీలో చేరాలనుకుంటున్నారా..? దగ్గరపడిన దరఖాస్తుల గడువు, కోర్సుల వివరాలివే

  • TG Skills University Admissions : తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా నాలుగు కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.  అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 29 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 25 Oct 202402:02 AM IST

తెలంగాణ News Live: TG Employees DAs : ఉద్యోగుల పెండింగ్ డీఏలపై నిర్ణయం - సాయంత్రంలోపు ప్రకటన..!

  •  పెండింగ్ డీఏల విడుదల కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇవాళ (శుక్రవారం) ప్రభుత్వం నుంచి తీపి కబురు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రంలోపు నిర్ణయం ప్రకటిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ప్రకటన కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 25 Oct 202401:27 AM IST

తెలంగాణ News Live: Karimnagar News : ఫేస్​బుక్​లో పరిచయం, ఆపై లవ్..! సీన్ కట్ చేస్తే ఇద్దరూ అరెస్ట్, వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

  • కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఫేస్ బుక్ లో పరిచయమయ్యారు. ప్రేమగా మారటంతో కొంతకాలం పాటు బాగానే ఉన్నారు. సీన్ కట్ చేస్తే… ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. జమ్మికుంట పోలీసులు విచారణ చేపట్టగా… వెలుగులోకి షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 25 Oct 202411:48 PM IST

తెలంగాణ News Live: AWES Recruitment 2024 : ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ ఉద్యోగాలు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..! ఇదిగో లింక్

  • AWES Recruitment 2024 : ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల గడవు ఇవాళ్టితో(అక్టోబర్ 25) పూర్తి కానుంది. 
పూర్తి స్టోరీ చదవండి