Telangana News Live November 9, 2024: Padi Kaushik Reddy : హుజురాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్ చల్, దళిత బంధు ఆందోళనలో ఉద్రిక్తత
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 09 Nov 202401:01 PM IST
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో హల్ చల్ చేశారు. దళిత బంధు రెండో విడత నిధులు వెంటనే విడుదల చేయాలని లబ్దిదారులతో కలిసి ఆందోళన చేశారు. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
Sat, 09 Nov 202412:30 PM IST
TG Group 4 Update : తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు నిర్వహించే ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.
Sat, 09 Nov 202409:48 AM IST
TG Public Holidays 2025 : తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది 2025కి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. 2025లో మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Sat, 09 Nov 202404:27 AM IST
- Adilabad Beauty : ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాకు నిలయం. పచ్చని చెట్లు, జలపాతాలు, దట్టమైన అడవులు, పక్షుల కిలాకిలా రావాలతో అలరారుతూ ఉంటుంది. శీతాకాలంలో కశ్మీర్‌ను తలపించే అందాలు ఆదిలాబాద్ సొంతం. ఈ అందాలకు ఇప్పుడు మంచు తోడయింది. పొగమంచు కనువిందు చేస్తోంది.
Sat, 09 Nov 202402:38 AM IST
- TG Samagra Kutumba Survey Updates: తెలంగాణలో ఇవాళ్టి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు రోజుల పాటు స్టిక్కరింగ్ ప్రాసెస్ పూర్తి అయింది. నేటి నుంచి కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. తాజాగా ఈ సర్వేకు సంబంధించి ప్రణాళిక శాఖ కీలక వివరాలను పేర్కొంది.
Sat, 09 Nov 202401:35 AM IST
- NMDC Hyderabad Recruitment 2024: 153 జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ గడువు కూడా దగ్గరపడింది. అర్హులైన వారు నవంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.nmdc.co.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.
Sat, 09 Nov 202411:51 PM IST
- TG TET 2024 II Exam Pattern Syllabus: తెలంగాణ టెట్ - II కు ఆన్ లైన్ దరఖాస్తులు కొనసాగుతున్నాయి. నవంబర్ 20వ తేదీతో ఈ గడువు ముగియనుంది. ఈ ఏడాదిలో ఇది రెండో టెట్ నోటిఫికేషన్. అయితే పరీక్షా విధానం, సిలబస్ తో పాటు మరిన్ని ముఖ్య వివరాలను పూర్తి కథనంలో తెలుసుకోండి…