తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live November 8, 2024: Food Inspections in Adilabad : కొనసాగుతున్న 'ఆహారపు' తనిఖీలు - అయినా మారని వ్యాపారుల తీరు..!
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 08 Nov 202404:57 PM IST
తెలంగాణ News Live: Food Inspections in Adilabad : కొనసాగుతున్న 'ఆహారపు' తనిఖీలు - అయినా మారని వ్యాపారుల తీరు..!
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆహారపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పలువురు వ్యాపారాలు.. నాణ్యత లేని ఆహారాలను విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవలే జిల్లాల్లో పలువురు అస్వస్థతకు కూడా గురయ్యారు. అయితే వీరిపై పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని వినియోగదారులు కోరుతున్నారు.
Fri, 08 Nov 202404:31 PM IST
తెలంగాణ News Live: ప్రధాని మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రికి శాలువా కప్పి సత్కరించారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా అందించారు.
Fri, 08 Nov 202402:31 PM IST
తెలంగాణ News Live: CM Revanth Musi Yatra : మూసీ ప్రక్షాళన ఆగదు..! అడ్డొస్తే బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తా - సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ సంకల్ప యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డొస్తే జేసీబీతో తొక్కించి తీరుతానంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని స్పష్టం చేశారు.
Fri, 08 Nov 202401:25 PM IST
తెలంగాణ News Live: TG SSC Exams Fee 2025 : తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే
- తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఎలాంటి రుసుం లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించారు. రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 21 వరకు చెల్లించుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
Fri, 08 Nov 202412:24 PM IST
తెలంగాణ News Live: Medak Crime : మహిళా టీచర్‌ను వేధించిన కానిస్టేబుల్.. సస్పెండ్ చేసిన ఎస్పీ.. అసలు వ్యవహారం ఇదీ!
- Medak Crime : తన భర్త ఇబ్బంది పెడుతున్నాడని ఓ మహిళా టీచర్ ఠాణాకు వెళ్లింది. అదే అవకాశంగా తీసుకున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ వేధించాడు. ఆ వేధింపులు తీవ్రం కావటంతో.. కానిస్టేబుల్‌పై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్‌ను మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సస్పెండ్ చేశారు.
Fri, 08 Nov 202411:01 AM IST
తెలంగాణ News Live: South Central Railway : దయచేసి వినండి.. ఇక నుంచి ఆ ట్రైన్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రావు!
- South Central Railway : హైదరాబాద్ నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో నాలుగో స్టేషన్‌గా చర్లపల్లిని అభివృద్ధి చేశారు. త్వరలో ఇక్కడినుంచే పలు రైళ్లను నడపనున్నారు. దీంతో ఆ ట్రైన్స్ సికింద్రాబాద్ వెళ్లవు.
Fri, 08 Nov 202410:56 AM IST
తెలంగాణ News Live: Khammam DSC Teachers : విధుల్లో చేరారు... ఇంతలోనే ఆ టీచర్లను తొలగించారు..! బాధ్యులెవరు..?
- ఖమ్మం జిల్లాకు చెందిన ఏడుగురు డీఎస్సీలో ఉద్యోగం సాధించారు. 24 రోజులుగా విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. సీన్ కట్ చేస్తే మీ ఉద్యోగ అర్హతలు సరిగా లేవని… నియాకాలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పరిణామంతో కొత్త టీచర్లు షాక్ కు గురయ్యారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Fri, 08 Nov 202410:07 AM IST
తెలంగాణ News Live: TG Govt Holiday : తెలంగాణలోని ఈ జిల్లాల విద్యార్థులకు అలర్ట్ - రెండో శనివారం సెలవు రద్దు, రేపు స్కూళ్లకు వెళ్లాల్సిందే!
- తెలంగాణలోని మూడు జిల్లాల్లో రెండో శనివారం సెలవు రద్దు అయింది.సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో యథావిధిగా రేపు (నవంబర్ 09) విద్యా సంస్థలు పని చేయనున్నాయి. మిగతా జిల్లాల్లో మాత్రం సెలవు ఉంటుంది.
Fri, 08 Nov 202409:36 AM IST
తెలంగాణ News Live: Yadadri Temple : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. యాదాద్రి పేరు మార్పు.. ఇక నుంచి..
- Yadadri Temple : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి పేరును మార్చారు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి రికార్డుల్లో యాదగిరిగుట్టగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
Fri, 08 Nov 202409:29 AM IST
తెలంగాణ News Live: TG Medical Recruitment 2024 : మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి ప్రకటన - మంచి జీతం, రేపే చివరి తేదీ..!
- Telangana Medical Recruitment 2024: నిజామాబాద్ జిల్లాలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నవంబర్ 9వ తేదీతో ఈ గడువు పూర్తి అవుతుంది. మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి..
Fri, 08 Nov 202408:55 AM IST
తెలంగాణ News Live: TG TET 2024 II Notification : తెలంగాణ టెట్ 2 ముఖ్య సమాచారం - పరీక్ష తేదీలు, హాల్ టికెట్లు, ఫలితాల ప్రకటన వివరాలివే
- TG TET 2024 II Notification Updates : టీజీ టెట్ వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించటంతో అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ వివరాలను కూడా విద్యాశాఖ ప్రకటించింది. నవంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. జనవరి 1, 2025 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి.
Fri, 08 Nov 202408:42 AM IST
తెలంగాణ News Live: Bandi Sanjay : బీఆర్ఎస్‌లో క్రెడిబులిటి ఉన్న లీడర్ హరీష్ రావు.. బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Bandi Sanjay : తెలంగాణలో పొలిటికల్ పంచ్‌లు పేలుతున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, రేవంత్‌ను విమర్శించిన బండి.. హరీష్ రావును ఆకాశానికెత్తారు.
Fri, 08 Nov 202408:19 AM IST
తెలంగాణ News Live: Bijli Mahadev temple : విచిత్రం.. అక్కడ 12 ఏళ్లకు ఒకసారి శివ లింగంపై పిడుగు పడుతుంది!
- Bijli Mahadev temple : ఎత్తైన మంచు పర్వతాలు, స్వచ్ఛమైన నదీ ప్రవాహాలు, సహజ జలపాతాలు, సూర్య కిరణాలతో ముత్యాల్లా మెరుస్తున్న మంచులో ఉంటుంది బిజిలీ మహాదేవ ఆలయం. సముద్రానికి 2,400 మీటర్ల ఎత్తులో ఏడాదికి 3 నెలలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ఆలయం బియాస్, పార్వతి నదుల సంగమ స్థానం.
Fri, 08 Nov 202406:36 AM IST
తెలంగాణ News Live: KTR vs Revanth Reddy : మీ బర్త్ డే కేక్ కట్ చేయిస్తా.. ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తా: కేటీఆర్
- KTR vs Revanth Reddy : కేటీఆర్ అరెస్టు అవుతారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావొచ్చని ట్వీట్ చేశారు.
Fri, 08 Nov 202405:31 AM IST
తెలంగాణ News Live: TG Samagra kutumba survey : తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే.. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న 6 సమస్యలు
- TG Samagra kutumba survey : తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే మొదటి దశ ఇవాళ్టితో పూర్తవుతుంది. రేపటి నుంచి రెండో దశ సర్వేను ప్రారంభించనున్నారు. అయితే.. సర్వే సమయంలో క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Fri, 08 Nov 202404:38 AM IST
తెలంగాణ News Live: Warangal Development : వరంగల్ భద్రకాళి చెరువుకు గండి.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సందేహాలు.. 8 ప్రధాన అంశాలు
- Warangal Development : దాదాపు 50 ఏళ్లుగా భద్రకాళి చెరువు పూడిక తీయలేదు. ఫలితంగా వ్యర్థాలు, గుర్రపు డెక్క, మట్టి పేరుకుపోయింది. వీటిని తొలగించడానికి ప్రభుత్వం ఉపక్రమించింది. తాజాగా భద్రకాళి చెరువుకు అధికారులు గండి కొట్టారు. అయితే.. దీనిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
Fri, 08 Nov 202404:22 AM IST
తెలంగాణ News Live: TG TET 2024 Registrations: తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం, సైట్‌లో సాంకేతిక సమస్యలతో చిక్కులు
- TG TET Registrations: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష రిజిస్ట్రేషన్లు ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల క్రితమే టెట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావాల్సి ఉన్నా సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. టెట్ ఫీజుల విషయంలో నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో గురువారం రాత్రి పొద్దుపోయాక సైట్ ఓపెన్ అయ్యింది.
Fri, 08 Nov 202402:59 AM IST
తెలంగాణ News Live: Green Card For OSD: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌కు గ్రీన్ కార్డు.. తెలంగాణ పోలీసులకు ప్రభాకర్ రావు ఝలక్
- Green Card For OSD: తెలంగాణ పోలీసులకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఝలక్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు సహకరిస్తానని, శస్త్ర చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నట్టు చెబుతూ వచ్చిన మాజీ నిఘా విభాగాధిపతి స్వదేశానికి ఇప్పట్లో రాకూడదని నిర్ణయించుకున్నారు. ఇందుకు అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు.
Fri, 08 Nov 202402:31 AM IST
తెలంగాణ News Live: Kawal Tigers: ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతాన్ని వణికిస్తున్న పెద్దపులి.. కుంటాల మండలంలో పశువులపై పులి దాడులు
- Kawal Tigers: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలంలోని సూర్యాపూర్, మెదన్పూర్, అంబుగామ అటవీ ప్రాంతాల్లో గత శుక్రవారం నుంచి పెద్దపులి అలజడి సృష్టిస్తోంది. పదిహేను రోజుల క్రితం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ నుంచి బొందిడి, కిన్వట్ అటవీ ప్రాంతాల మీదుగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించింది.
Fri, 08 Nov 202412:09 AM IST
తెలంగాణ News Live: Vemulawada Kidnap: వృద్ధురాలు కిడ్నాప్... ఛేదించిన వేములవాడ పోలీసులు...ఇద్దరు అరెస్టు..మరో నలుగురు పరారీ
- Vemulawada Kidnap: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వృద్ధురాలు కిడ్నాప్ కు గురయ్యింది. కొడుకు మాట తప్పి తప్పించుకోవడంతో కోపంతో తల్లిని కిడ్నాప్ చేసిన వారు కటకటాల పాలయ్యారు. వృద్ధురాలను కిడ్నాప్ చేసిన ఇద్దరిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు వేములవాడ పోలీసులు ప్రకటించారు.