Telangana News Live November 5, 2024: Peddapalli Dog Stolen : పెద్దపల్లి జిల్లాలో వింత దొంగతనం-బైక్ పై వచ్చి కుక్క చోరీ, సీసీ కెమెరాలో రికార్డు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 05 Nov 202404:10 PM IST
Peddapalli Dog Stolen : పెద్దపల్లి జిల్లా వింత దొంగతనం జరిగింది. బైక్ పై వచ్చిన ముగ్గురు ఓ కుక్కను ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యారు. కుక్కను పెంచుకున్న పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. కుక్కను అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tue, 05 Nov 202402:22 PM IST
Rahul Gandhi : దేశంలో కులవివక్ష అనుభవించే వాళ్లకే ఆ బాధ తెలుస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ కుల గణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కులగణనన ద్వారా వ్యవస్థలను సరిచేయొచ్చన్నారు.
Tue, 05 Nov 202412:58 PM IST
TG Inter Fee Schedule : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. నవంబర్ 6 నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చు. రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 04 వరకు ఫీజులు చెల్లించవచ్చు.
Tue, 05 Nov 202409:25 AM IST
- Hyderabad Book Fair : హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 19వ తేదీ నుంచి బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈసారి ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేయిర్ ఉంటుందని సొసైటీ సభ్యులు వివరించారు. ఈసారి బుక్ ఫేయిర్‌కు చాలా ప్రత్యేకలు ఉన్నాయి.
Tue, 05 Nov 202408:41 AM IST
Narayana College Student : హైదరాబాద్ బొల్లారం పరిధిలోని నారాయణ కాలేజీ హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం సాయంత్రం హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.
Tue, 05 Nov 202408:00 AM IST
- Congress Vs BRS: రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే బుధవారం (6వ తేదీన ) మొదలు కానుంది. దీనికి ముందే తమ పార్టీ కార్యకర్తల్లో అవగాహన కల్పించి గ్రామాల్లో ప్రజలకు వివరించేందుకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో నిరసన గళాలు వినిపిస్తున్నాయి.
Tue, 05 Nov 202406:12 AM IST
- Hyderabad Police : హైదరాబాద్ నగరంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల ఇకపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఈ రూల్స్ నవంబర్ 5 నుంచే అమలు కానున్నాయి.
Tue, 05 Nov 202404:16 AM IST
- CM Relief Fraud: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా అలాంటి ఘటనే వరంగల్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
Tue, 05 Nov 202404:06 AM IST
- TG Samagra Kutumba Survey 2024 : తెలంగాణలో రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ సర్వేలో భాగంగా మొత్తం 56 ప్రధాన ప్రశ్నలు అడుగుతారు. ప్రతి కుటుంబం నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి.. ప్రభుత్వానికి నివేదిస్తారు.
Tue, 05 Nov 202404:06 AM IST
- TG TET Applications: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తారు. టెట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
Tue, 05 Nov 202401:44 AM IST
- Warangal Police: వరంగల్ కమిషనరేట్ లో పోలీస్ అధికారులు, సిబ్బంది తీరు తరచూ వివాదాస్పదం అవుతోంది. కొంతమంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా, మరికొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ చర్చల్లో నిలుస్తున్నారు. ఇంకొందరు ఇతర మహిళల విషయాల్లో జోక్యం చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.
Tue, 05 Nov 202412:28 AM IST
- Karimnagar Boy: కరీంనగర్‌లో రెండున్నర ఏళ్ళ బాలుడు కిడ్నాప్ అయ్యాడు.బాబును ఎత్తుకెళ్లిన మహిళ మధ్యవర్తి ద్వారా 50 వేలకు విక్రయించింది. బాబు అదృశ్యంతో తల్లడిల్లిన తల్లి పోలీసులను ఆశ్రయించడంతో రహస్యంగా విచారణ జరిపి బాబు కిడ్నాప్, విక్రయాన్ని ఛేదించి ముగ్గురిని అరెస్టు చేశారు.
Tue, 05 Nov 202411:55 PM IST
- Graduate Mlc: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ల నమోదు గడువు దగ్గరపడింది. ఇక రెండు రోజులే మిగిలింది. పట్టభద్రులు ఓటర్ లుగా నమోదు కావడానికి ఆసక్తి చూపడం లేదు. నత్తనడకన ఓటర్ నమోదు ప్రక్రియ జరగడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.