Telangana News Live November 4, 2024: CM Revanth Reddy Padayatra : మూసీ నది వెంట సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర-ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్లాన్-today telangana news latest updates november 4 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 4, 2024: Cm Revanth Reddy Padayatra : మూసీ నది వెంట సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర-ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్లాన్

CM Revanth Reddy Padayatra : మూసీ నది వెంట సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర-ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్లాన్

Telangana News Live November 4, 2024: CM Revanth Reddy Padayatra : మూసీ నది వెంట సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర-ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్లాన్

04:19 PM ISTNov 04, 2024 09:49 PM HT Telugu Desk
  • Share on Facebook
04:19 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 04 Nov 202404:19 PM IST

తెలంగాణ News Live: CM Revanth Reddy Padayatra : మూసీ నది వెంట సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర-ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్లాన్

  • CM Revanth Reddy Padayatra : మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై ముందుకు వెళతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో సీఎం పాదయాత్రకు స్థానిక నేతలు ప్లాన్ చేస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202402:17 PM IST

తెలంగాణ News Live: Teenmar Mallanna Issue : కాంగ్రెస్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకంపనలు, సొంత పార్టీ నేతలపైనే మాటల దాడి

  • Teenmar Mallanna Issue : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నేతలపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న ఆయన...కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం నేతల లక్ష్యంగా తరచూ విమర్శలు చేస్తున్నారు. మిర్యాలగూడ బీసీ గర్జన సభలో రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం కావాలని పిలుపునిచ్చారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202412:01 PM IST

తెలంగాణ News Live: Sangareddy : తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. గంటల వ్యవధిలోనే దొంగతనాలు చేస్తున్న దుండగులు

  • Sangareddy : తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒకేరోజు రెండు చోట్ల తాళాలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. తాళం వేసిన గంటల వ్యవధిలోనే దొంగతనాలు జరగడం విశేషం. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202410:24 AM IST

తెలంగాణ News Live: Congress : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క

  • Congress : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. వారిలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. మహారాష్ట్రకు రేవంత్, జార్ఖండ్‌కు భట్టి వెళ్లనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202409:04 AM IST

తెలంగాణ News Live: TG Rythu Bharosa Update : ఈ నెలాఖరు నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు, రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ క్లారిటీ-ఎకరాకు రూ.7500!

  • TG Rythu Bharosa Update : రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ఈ పథకానికి నిధులు సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202408:48 AM IST

తెలంగాణ News Live: Harish Rao : వారిని విడుదల చేస్తేనే నేను బయటకొస్తా.. పోలీస్ స్టేషన్‌లోనే హరీష్ రావు

  • Harish Rao : పెండిగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా మాజీ సర్పంచులు పోరుబాటకు పిలుపునిచ్చారు. వారందరు హైదరాబాద్‌కు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మాజీ సర్పంచులను అరెస్టు చేయడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202408:09 AM IST

తెలంగాణ News Live: TG TET Notification : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల, ఈ నెల 5 నుంచి దరఖాస్తులు

  • TG TET Notification : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202407:38 AM IST

తెలంగాణ News Live: Medak Attack: మెదక్ లో పట్టపగలే దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో విచక్షణారహితంగా దాడి

  • Medak Attack: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ డిగ్రీ విద్యార్థిపై ప్రేమోన్మాది కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గేటు ముందు సోమవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.  స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202406:50 AM IST

తెలంగాణ News Live: Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రోకు సాంకేతిక సమస్య.. నిలిచిపోయిన రైళ్లు.. 5 ముఖ్యాంశాలు

  • Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో రైలు వ్యవస్థలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ఎక్కడికక్కడ మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. నాగోల్ -రాయదుర్గం, ఎల్బీనగర్‌- మియాపూర్‌ రూట్‌లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202405:52 AM IST

తెలంగాణ News Live: Hyderabad : ఫుడ్ డెలివరీ యాప్‌లో చికెన్ ఫ్రై ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే పురుగు!

  • Hyderabad : ఉరుకుల పరుగుల జీవితంలో నచ్చినవి వండుకునే టైం ఉండటం లేదు. దీంతో చాలామంది ఫుడ్ డెలివరీ యాప్‌లపై ఆధారపడుతున్నారు. ఆఫర్లు ఉండటంతో ఆసక్తి చూపి.. ఆర్డర్ చేస్తున్నారు. అలానే చికెన్ ఫ్రై తినాలనిపించి ఓ వ్యక్తి ఆర్డర్ చేశారు. అందులో అతనికి చికెన్‌తో పాటు పురుగులు బోనస్‌గా వచ్చాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202404:49 AM IST

తెలంగాణ News Live: TG Ex Sarpanches Arrest : పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కిన మాజీ సర్పంచులు.. అరెస్టు చేసిన పోలీసులు

  • TG Ex Sarpanches Arrest : వారంతా మొన్నటి వరకు గ్రామాల ప్రథమ పౌరులు. పదవీకాలం ముగియడంతో మాజీలుగా మారారు. ఆ మాజీ సర్పంచులు.. తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కారు. గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేసి.. బిల్లుల రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202402:22 AM IST

తెలంగాణ News Live: TG TET 2024 Notification: నేడు తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల, ఏటా రెండు సార్లు నిర్వహణ

  • TG TET 2024 Notification: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఈ ఏడాది రెండో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలకు ఏర్పాట్లు చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202411:30 PM IST

తెలంగాణ News Live: Matrimony Fraud : మ్యాట్రిమోని ఫేక్ ప్రొఫైల్ లో అందమైన అమ్మాయిల ఫొటోలు, యువకుల నుంచి లక్షలు కొట్టేస్తున్న జంట

  • Matrimony Fraud : మ్యాట్రిమోని వెబ్ సైట్ లో అందమైన ఫొటోలు పెట్టి యువకులను మోసం చేస్తుందో జంట. అమ్మాయిల ఫొటోలు చూసి ఆకర్షితులైన అబ్బాయిలు పెళ్లి సంబంధం కోసం స్పందించి లక్షలు పోగొట్టుకుంటున్నారు.

పూర్తి స్టోరీ చదవండి