Telangana News Live November 20, 2024: CM Revanth in Vemulawada : ‘కేసీఆర్... అసెంబ్లీకి రా సామి’...! లెక్కలు తేలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి-today telangana news latest updates november 20 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 20, 2024: Cm Revanth In Vemulawada : ‘కేసీఆర్... అసెంబ్లీకి రా సామి’...! లెక్కలు తేలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth in Vemulawada : ‘కేసీఆర్... అసెంబ్లీకి రా సామి’...! లెక్కలు తేలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana News Live November 20, 2024: CM Revanth in Vemulawada : ‘కేసీఆర్... అసెంబ్లీకి రా సామి’...! లెక్కలు తేలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

03:36 PM ISTNov 20, 2024 09:06 PM HT Telugu Desk
  • Share on Facebook
03:36 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 20 Nov 202403:36 PM IST

తెలంగాణ News Live: CM Revanth in Vemulawada : ‘కేసీఆర్... అసెంబ్లీకి రా సామి’...! లెక్కలు తేలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

  • అసెంబ్లీ కి రా...సామి.. అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.  కొడుకు, అల్లుడి లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ ఎంత ఉరికినా చివరకు ఊసలు లెక్కించక తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ కు నిజం ఒప్పుకునే ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 20 Nov 202401:44 PM IST

తెలంగాణ News Live: మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 86 ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే

  • Ordnance Factory Medak Jobs 2024 : మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జూనియర్ మేనేజర్ సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 20 Nov 202410:53 AM IST

తెలంగాణ News Live: AIBE 19 Exam : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ మరోసారి​ వాయిదా, కొత్త తేదీలివే

  • AIBE 19కి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 1వ తేదీన జరగాల్సిన పరీక్షను వాయిదా వేశారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి అయింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 22వ తేదీలోపు ఎడిట్ చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 20 Nov 202409:38 AM IST

తెలంగాణ News Live: TGPSC Group 4 : గ్రూప్ 4 అభ్యర్థులకు మరో అప్డేట్ - ఈ తేదీలోపే నియామక పత్రాలు అందజేత..!

  • TSPSC Group 4 Appointment Letters : తెలంగాణ గ్రూప్ 4 ఉద్యోగాల తుది ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శాఖల వారీగా ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎంపికైన వారికి నవంబర్ 25 లేదా 26వ తేదీన నియామకపత్రాలను అందజేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 20 Nov 202406:34 AM IST

తెలంగాణ News Live: TG TET 2024 II Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొద్ది గంటలే గడువు..!

  • TG TET 2024 Registration : తెలంగాణ టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు టెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తుల చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 1, 2025 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 20 Nov 202406:06 AM IST

తెలంగాణ News Live: TG Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు సవాలక్ష అడ్డంకులు.. ముందుకు సాగని కొనుగోళ్లు

  • TG Paddy Procurement: రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ముక్తకంఠంతో ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అనుకూలంగా లేదు.  
పూర్తి స్టోరీ చదవండి

Wed, 20 Nov 202405:44 AM IST

తెలంగాణ News Live: Vemulawada CM Tour: నేడు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, రూ.800కోట్లతో అభివృద్ధిపనులు

  • Vemulawada CM Tour: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వేములవాడ విచ్చేసిన రేవంత్‌ రెడ్డికి మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 20 Nov 202405:03 AM IST

తెలంగాణ News Live: Central Bank Recruitment 2024: సెంట్రల్ బ్యాంక్ లో 253 స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఉద్యోగాలు, దరఖాస్తులకు డిసెంబర్ 3 లాస్ట్ తేదీ

  • Central Bank Recruitment 2024 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ ప్రాతిపదికన 253 స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 20 Nov 202404:18 AM IST

తెలంగాణ News Live: Instagram Girl Murder :అద్దె ఇంట్లోనే పెళ్లి, గంటల వ్యవధిలోనే హత్య-ఇన్ స్టాగ్రామ్ బాలిక మర్డర్ కేసులో సంచనాలు వెలుగులోకి

  • Instagram Girl Murder : ఇన్ స్టాగ్రామ్ పరిచయంతో ఇల్లు విడిచి వెళ్లిన బాలిక విగతజీవిగా మారిన ఘటన హైదరాబాద్ లో సంచలనం అయ్యింది. ఈ కేసులో విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ, పెళ్లి పేరుతో బాలిక నమ్మించి అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు దుర్మార్గుడు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 20 Nov 202403:53 AM IST

తెలంగాణ News Live: Warangal Bank Robbery: వరంగల్‌ ఎస్‌బిఐలో భారీ చోరీ, 15కోట్ల విలువైన బంగారం చోరీ, బ్యాంకు నిర్లక్ష్యమే కారణం?

  • Warangal Bank Robbery: వరంగల్‌ ఎస్‌‌బిఐలో భారీ చోరీ జరిగింది.జిల్లాలోని రాయవర్తి మండల కేంద్రంలో  ఎస్‌బిఐలో లాకర్లను గ్యాస్‌ కట్టర్లతో కత్తిరించి ఖాతాదారుల ఆభరణాలను చోరీ చేశారు.ఈ దోపిడీలో రూ.15కోట్ల విలువైన ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.గతంలో చోరీ యత్నం జరిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 20 Nov 202402:47 AM IST

తెలంగాణ News Live: Gachibowli Building : 50 గజాల్లో నాలుగంతస్తులు, పెంట్ హౌస్-అద్దెల కోసం కక్కుర్తి పడితే కూలిపోయే పరిస్థితి

  • Gachibowli Building : హైదరాబాద్ గచ్చిబౌలిలో నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. 50 గజాల్లో ఆరు స్లాబులతో నాలుగంతస్తులు, పెంట్ హౌస్ నిర్మించారు. ఈ భవనం పక్కన నూతన నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో ఈ బిల్డింగ్ పక్కకు ఒరిగింది. భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించి, కూల్చివేతకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 20 Nov 202401:09 AM IST

తెలంగాణ News Live: CM Revanth Reddy Tour : నేడు వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి, రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

  • CM Revanth Reddy Vemulawada Tour : సీఎం రేవంత్ రెడ్డి నేడు వేములవాడలో పర్యటించనున్నారు. ముందుగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని, అనంతరం రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

పూర్తి స్టోరీ చదవండి