Telangana News Live November 17, 2024: Khammam Ragging : ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం, ఎంబీబీఎస్ విద్యార్థికి గుండు కొట్టించిన ప్రొఫెసర్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 17 Nov 202401:59 PM IST
Khammam Ragging : ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sun, 17 Nov 202412:35 PM IST
- Sangareddy Crime : ఓ మహిళ తెల్లవారుజామున ఇంటి ఆవరణలోని తులసి చెట్టుకు పూజ చేస్తుంది. ఆ మహిళ మెడలో నుండి నాలుగు తులాల పుస్తెలతాడును దుండగులు తెంపుకొని పారిపోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం పటాన్‌చెరు పట్టణంలో కలకలం సృష్టించింది. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
Sun, 17 Nov 202412:16 PM IST
- TG Farmers : తెలంగాణ రైతులు మరో ఘనత సాధించారు. వరి దిగుబడిలో రికార్డ్ సృష్టించారు. 66.77 లక్షల ఎకరాల్లో ఏకంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి పొందారు. యావత్ భారతదేశంలొనే ఇంతటి వరి దిగుబడిని పొంది.. అరుదైన రికార్డ్ నమోదు చేశారు. దీనిపై మంత్రి ఉత్తమ్ హర్షం వ్యక్తం చేశారు.
Sun, 17 Nov 202411:22 AM IST
Telangana EV Policy : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో నెం.41 ద్వారా రెండేళ్ల పాటు ఈవీ పాలసీ అమల్లో ఉంటుందన్నారు. ఈవీ వాహనాలకు వందశాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Sun, 17 Nov 202410:36 AM IST
- Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి తొక్కేస్తున్నారని.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను నిరూపిస్తానని, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.
Sun, 17 Nov 202409:34 AM IST
TG Ration Card Update : తెలంగాణ సర్కార్ రేషన్ కార్డు వివరాల మార్పు చేర్పులపై కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల్లో కొత్త వారి పేర్లు జోడించడం, మరణించిన వృద్ధుల పేర్లు తొలగించడం... మార్పులకు మీ-సేవా కేంద్రాల్లో అవకాశం కల్పించారు.
Sun, 17 Nov 202409:18 AM IST
- TGSRTC : ఆర్టీసీ బస్సుల్లో రోజుకు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వారిలో చాలామందికి బస్సు ప్రయాణం పడదు. దీంతో అస్వస్థతకు గురవుతారు. అలాంటి సాధారణంగా సిబ్బంది పట్టించుకోరు. కానీ.. తాజా ఓ మహిళ బస్సులో అస్వస్థతకు గురైతే.. బస్ డ్రైవర్, కండక్టర్ వెంటనే స్పందించారు. మహిళను ఆస్పత్రికి తరలించారు.
Sun, 17 Nov 202407:54 AM IST
- Hyderabad Musi Row : మూసీ పరివాహక బస్తీల్లో బీజేపీ నేతలు బస్తీ నిద్ర చేశారు. సీఎం రేవంత్ చేసిన సవాల్‌ను స్వీకరించి ఒకరోజు బస్తీ నిద్ర చేశారు. అయితే.. బీజేపీ నేతల బస్తీ నిద్రపై ముఖ్యమంత్రి స్పందించారు. కిషన్ రెడ్డి, బీజేపీపై సెటైర్లు వేశారు. మూసీ ప్రాజెక్టుకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.
Sun, 17 Nov 202406:58 AM IST
- Devil in Mulugu : అది ప్రశాంతమైన గ్రామం. చుట్టూ పచ్చని చెట్లు, పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏం జరిగిందో ఏమో.. అలాంటి గ్రామంలో కేవలం 2 నెలల్లోనే 20 మంది చనిపోయారు. దీంతో ఆ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sun, 17 Nov 202405:18 AM IST
- TG SSC Exams Fee 2025 : తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. ఎలాంటి ఫైన్ లేకుండా నవంబర్ 28 తేదీ వరకు వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్ష విభాగం ప్రకటన విడుదల చేసింది.
Sun, 17 Nov 202405:15 AM IST
- BRS vs Congress : కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మరోసారి సెటైర్లు వేశారు. తెలంగాణకు తరతరాల దరిద్రం కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందని మహేశ్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్‌ను కేటీఆర్ తప్పుబట్టారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉంటే కదా అని ఎద్దేవా చేశారు.
Sun, 17 Nov 202404:25 AM IST
- Vikarabad : లగచర్లలో అధికారులపై దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం గ్రామాల్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అటు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటు లగచర్ల గ్రామస్తులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
Sun, 17 Nov 202403:30 AM IST
- Nuclear Fuel Complex Hyderabad : హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 300 అప్రెంటిస్‌షిప్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 25వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. వివరాలను పూర్తి కథనంలో చూడండి
Sun, 17 Nov 202402:44 AM IST
- MHSRB Staff Nurse Hall Tickets 2024: స్టాఫ్ నర్స్ రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ 23వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్నఅభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Sun, 17 Nov 202402:14 AM IST
- TG TET 2024 II Applications Updates : తెలంగాణ టెట్ -2 దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 20వ తేదీతో అప్లికేషన్ల గడువు పూర్తి కానుంది.
Sun, 17 Nov 202401:58 AM IST
- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించునున్నారు . ఈనెల 19 నుంచి వచ్చే నెల 9వ తారీఖు వరకు పలు జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
Sun, 17 Nov 202412:39 AM IST
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నూతన భవన నిర్మాణదారులకు జలమండలి గుడ్ న్యూస్ చెప్పింది. వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రం జారీ ప్రక్రియను సులభతరం చేసింది. వాటర్ ఫీజబిలిటి ధ్రువపత్రాలు జారీ చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. త్వరితగతిన పత్రాన్ని జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.