Telangana News Live November 16, 2024: Group 3 Exams : రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు- హాజరుకానున్న 5.36 లక్షల మంది అభ్యర్థులు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 16 Nov 202404:49 PM IST
Group 3 Exams : తెలంగాణ వ్యాప్తంగా రేపు, ఎల్లుండి గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా1401 కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 1375 పోస్టులకు 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్రీజ పర్యవేక్షించారు.
Sat, 16 Nov 202404:27 PM IST
Gurukula School Student : సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ మహాత్మ జ్యోతిబాపులే బీసీ గురుకల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు గురుకుల పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
Sat, 16 Nov 202403:54 PM IST
Actress Kasturi Arrest : హైదరాబాద్‌లో నటి కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కస్తూరిపై చెన్నైలో కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలిస్తున్నారు.
Sat, 16 Nov 202401:59 PM IST
Kakatiya Mega Textile Park : వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెక్స్ టైల్స్ పార్క్ పక్కనే భూ నిర్వాసితుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటుచేయనున్నారు. తాజాగా 863 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Sat, 16 Nov 202401:35 PM IST
Hyderabad Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దూసుకుపోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు దాటి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. అలాగే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో(జులై-సెప్టెంబర్) నగరంలో 12700 ఇండ్లు అమ్ముడయ్యాయి. వెస్ట్ హైదరాబాద్ లో గృహ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
Sat, 16 Nov 202412:39 PM IST
- TG SET 2024 Results : టీజీసెట్- 2024 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీసెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
Sat, 16 Nov 202412:27 PM IST
- Vemulawada : సీఎం రేవంత్ సిరిసిల్ల జిల్లా పర్యటన ఖరారు అయింది. ఈనెల 20న వేములవాడ రాజన్నను దర్శించుకుని, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ జిల్లా అధికారులతో సమీక్షించారు.
Sat, 16 Nov 202410:47 AM IST
- KTR Comments : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్ గాడ్సే శిష్యుడని సెటైర్లు వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా పనిచేస్తోందని విమర్శించారు. పొంగులేటి బాంబులు ఎప్పుడు పేలతాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఖతం చేస్తా అన్నోళ్లే ఖతం అయ్యారని వ్యాఖ్యానించారు.
Sat, 16 Nov 202409:35 AM IST
Minister Ponnam Prabhakar : గీత కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి గీత కార్మికుడికి కాటమయ్య రక్షక కవచ్ కిట్లను పంపిణీ చేస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత గీత కార్మికులకు మోపెడులు అందిస్తామన్నారు.
Sat, 16 Nov 202409:25 AM IST
- Hyderabad : ప్రేమ పేరుతో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తాను చెప్పినట్టు చేయకపోతే.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్ ఇస్తానని బెదిరించాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. గతంలో కూడా సదరు యువకుడిపై కేసు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన హైదారాబద్‌లో జరిగింది.
Sat, 16 Nov 202408:31 AM IST
- Kurumurthy Swamy Jatara : కురుమూర్తి స్వామి జాతరకు భక్తులు వేలాదిగా తరలి వెళ్తున్నారు. జాతరలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఇదే అదునుగా కొందరు రెచ్చిపోతున్నారు. భక్తులను నిండా ముంచుతున్నారు. కట్టిడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
Sat, 16 Nov 202406:58 AM IST
- పుట్టిన రోజు నాడే ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన స్నిగ్ధ ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదువుతోంది. బర్త్ డే విషెస్ చెప్పడానికి రూమ్ కి వెళ్లి చూడగా.. స్నిగ్థ ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించింది.కుమార్తె మరణవార్త విన్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Sat, 16 Nov 202406:08 AM IST
- Warangal Crime : ఇంట్లో దోషాలు తొలగించి శుభం జరిగేలా చేస్తామంటూ.. పూజల పేరుతో ఓ హిజ్రా ఘరానా మోసానికి పాల్పడింది. ఓ మహిళ నుంచి రెండు విడతలలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసింది. రూ.55 లక్షల వరకు వసూలు చేసింది. మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Sat, 16 Nov 202403:35 AM IST
- వరంగల్ లోని ఎస్ఆర్ యూనివర్శిటీలో గంజాయి గుప్పుమంటోంది. తాజాగా గంజాయి తాగుతూ నలుగురు విద్యార్థులు యాంటీ నార్కోటిక్ టీమ్ పోలీస్ టీమ్ కు చిక్కారు. వారి నుంచి దాదాపు 24 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని హసన్ పర్తి పోలీసులకు అప్పగించారు.
Sat, 16 Nov 202402:50 AM IST
- TG SSC Exams Fee 2025 : తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. పబ్లిక్ పరీక్షల ఫీజు ఆన్ లైన్ లో చెల్లించే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో చలానా ఇబ్బందులకు చెక్ పడినట్లు అయింది. ఎలాంటి ఫైన్ లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంది.
Sat, 16 Nov 202401:50 AM IST
- TGPSC Group 3 Exams: గ్రూప్ 3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. రేపట్నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు. అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది.
Sat, 16 Nov 202401:20 AM IST
- కరీంనగర్ జిల్లాలో కారు భీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పాదచారులపైకి కారు దూసుకెళ్ళడంతో ఇద్దరు కూలీలు తోపాటు కారు నడిపే బీజేపీ నాయకుడు మృతి చెందారు. దీంతో రాజీవ్ రహదారి రక్తసిక్తమైంది.
Sat, 16 Nov 202411:56 PM IST
- IICT Hyderabad Recruitment 2024 : హైదరాబాద్ లోని ఐఐసీటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ పద్ధతిలో 31 సెంటిస్ట్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ. లక్షకు పైగా జీతం చెల్లిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.