Telangana News Live November 11, 2024: TG IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ, స్మితా సబర్వాల్ కు కీలక బాధ్యతలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 11 Nov 202404:49 PM IST
TG IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. స్మితా సబర్వాల్ ను పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా నియమించారు.
Mon, 11 Nov 202404:18 PM IST
Medak Accident : బతుకుదెరువు కోసం జార్ఖండ్ నుంచి తెలంగాణకు వచ్చిన ఇద్దరు వలస కూలీలు ప్రమాదవశాత్తు మరణించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో నిర్మాణంలో ఉన్న పౌల్ట్రీ గోడ కూలి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Mon, 11 Nov 202403:39 PM IST
KTR On Revanth Reddy : అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన బావమరిదికి రూ. 1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను దిల్లీలో కేటీఆర్ కలిసి ఫిర్యాదు చేశారు.
Mon, 11 Nov 202401:23 PM IST
Ponguleti Srinivas Reddy : కేటీఆర్ దిల్లీలో ఎవరి కాళ్లు మొక్కడానికి వెళ్లారో మాకు తెలుసని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం, కేబినెట్ అనుమతి లేకుండా ఫార్ములూ-ఈ రేసింగ్ సంస్థకు రూ.55 కోట్లు కేటీఆర్ ఏ విధంగా మళ్లించారని ప్రశ్నించారు.
Mon, 11 Nov 202410:44 AM IST
- Vikarabad : విరాకాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ ఘటనపై మాజీమంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Mon, 11 Nov 202410:13 AM IST
- TGSRTC Offer : ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ మరో ఆఫర్ ఇచ్చింది. ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ కల్పిస్తోంది. అయితే దానికి మెట్రో బస్ పాస్ ఉండాలని స్పష్టం చేసింది. తెలంగాణ తోపాటు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లోనూ ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.
Mon, 11 Nov 202409:51 AM IST
Vikarabad Collector Car Attacked :వికారాబాద్ జిల్లా లగచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా విలేజ్ భూసేకరణపై చర్చించేందుకు వెళ్లిన కలెక్టర్, ఆధికారులపై గ్రామస్థులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు.
Mon, 11 Nov 202409:18 AM IST
- Revanth Reddy Counter to KCR : గులాబీ బాస్ కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారని.. తెలంగాణ ప్రజలు ఏమీ కోల్పోలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ 10 నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారని స్పష్టం చేశారు.
Mon, 11 Nov 202407:48 AM IST
- Sangareddy Accident : రోడ్డుపై వెళ్తున్న కంటైనర్‌లో హఠాత్తుగా పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ వాహనాన్ని పక్కన నిలిపివేశారు. అప్పటికే కంటైనర్‌లో తరలిస్తున్న కార్లకు మంటలు వ్యాపించాయి. డ్రైవర్ ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. 8 టాటా నెక్సాన్ కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
Mon, 11 Nov 202406:14 AM IST
- IDBI Recruitment 2024 : ఐడీబీఐ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వెయ్యి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏదైనా డిగ్రీతో ఉద్యోగం కల్పిస్తోంది. https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Mon, 11 Nov 202402:20 AM IST
- KTR Challenge: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవడానికి తాను అడ్డంకి అనుకుంటే రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
Mon, 11 Nov 202401:42 AM IST
- Siddipet Tragedy: సిద్ధిపేటలో విషాదకర ఘటన జరిగింది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమన్న అన్నపై తమ్ముడి చెప్పుతో దాడి చేసి దూషించడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా అందరిని విషాదంలో నింపింది.
Mon, 11 Nov 202401:09 AM IST
- Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పైసలివ్వకుండా తప్పించుకోవడానికి వడ్ల కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బ్రోకర్ల నుండి కమీషన్లు దండుకునేందుకు రాష్ట్ర రైతుల ప్రయోజనాలను బలి పెడుతున్నారని ధ్వజమెత్తారు.
Mon, 11 Nov 202412:33 AM IST
- TG Family Survey: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఇంటింటా కుటుంబ సమగ్ర సర్వే సర్కార్ కు సవాల్ గా మారింది. అభ్యంతరకరమైన ప్రశ్నలతో సమాచారం ఇచ్చేందుకు కొందరు ముందుకు రావడం లేదు. సమాచార సేకరించేందుకు వెళ్లిన వారికి జనం ప్రశ్నల వర్షం కురిపించడంతో ఎన్యూమరేటర్ లు ఇక్కట్ల పాలవుతున్నారు.