Telangana News Live November 10, 2024: Hyderabad Koti Deepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవానికి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ఏ డిపో ఎన్నంటే?
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 10 Nov 202404:26 PM IST
Hyderabad Koti Deepotsavam Buses : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం జరిగే కోటి దిపోత్సవం కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ స్టేడియానికి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.
Sun, 10 Nov 202411:57 AM IST
- KTR Latest Comments : బీసీ డిక్లరేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తయిన ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదని.. కేటీఆర్ విమర్శించారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందన్నారు.
Sun, 10 Nov 202409:41 AM IST
- Kurumurthy Brahmotsavam : సీఎం రేవంత్ సొంత జిల్లాలోని ఆలయ అభివృద్ధి కోసం భారీగా నిధులు ప్రకటించారు. కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం.. రూ.110 కోట్లతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Sun, 10 Nov 202409:10 AM IST
Siddipet News : సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రెండో భార్య కాపురానికి రావడంలేదని మనస్థాపంతో భర్త, తన ఇద్దరు పిల్లలతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Sun, 10 Nov 202408:43 AM IST
Warangal : వరంగల్ లో జరిగిన రోడ్డు ప్రమాదం డెలివరీ బాయ్ ప్రాణాలు తీసింది. ఫుడ్ డెలివరీ చేసేందుకు బైక్ మీద వెళ్తుండగా.. వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతిచెందారు. తోటి డెలివరీ బాయ్స్ ఆందోళన చేపట్టారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Sun, 10 Nov 202407:32 AM IST
- Chicken Prices in Telugu State : మొన్నటి వరకు చికెన్ ధరలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్తీక మాసం ఉండటంతో ధరలు క్రమంగా దిగివచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ చికెన్ ధర రూ. 180- 200 మధ్య ఉంది. స్కిన్ తో అయితే 160 -170 మధ్య విక్రయిస్తున్నారు.
Sun, 10 Nov 202406:34 AM IST
- సులభంగా డబ్బులు సంపాదించాలని అతగాడు ప్లాన్ వేశాడు. మహిళా పేరుపై సిమ్ కార్డు తీసుకొని… ఆడ గొంతుతో మాట్లాడి ఓ వ్యక్తిని ట్రాప్ చేశాడు. ఏకంగా పెళ్లి పేరుతో హన్మకొండకు రప్పించి.. దారి దోపిడీకి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు… కేసును చేధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Sun, 10 Nov 202405:43 AM IST
- TGPSC Group 3 Hall Tickets 2024 : తెలంగాణ గ్రూప్ 3 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు టీజీపీఎస్సీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
Sun, 10 Nov 202404:40 AM IST
- Hyderabad to Srisailam : హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో దట్టమైన అడవి ఉంటుంది. దీంతో సాయంత్రం 9 గంటల తర్వాత ఈ మార్గంలో వాహనాలను అనుమతించరు. అటు రోడ్డు కూడా ఇరుకుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్, శ్రీశైలం మధ్య ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు.
Sun, 10 Nov 202403:29 AM IST
- Telangana Cooperative Apex Bank Limited Updates : తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్(TGCAB) నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కో-ఆపరేటివ్ ఇంటెర్న్స్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 10 ఖాళీలున్నాయి. నవంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Sun, 10 Nov 202402:34 AM IST
- సిరిసిల్లలో నెలకొన్న వస్త్ర సంక్షోభం.. నేత కార్మికుల ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా నేత కార్మిక కుటుంబానికి చెందిన దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని స్థానికులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులను కోల్పోవటంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
Sun, 10 Nov 202401:29 AM IST
- వచ్చే ఎన్నికల్లో 100 శాతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఎర్రవెల్లి ఫౌమ్ హౌస్ మాట్లాడిన ఆయన.. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
Sun, 10 Nov 202411:53 PM IST
- TGPSC Group 3 Hall Tickets 2024 : ఇవాళ తెలంగాణ గ్రూప్ 3 హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.