Telangana News Live January 7, 2025: Ramagundem Knife Attacks : రామగుండంలో కత్తిపోట్లు కలకలం-వారంలో రెండు ఘటనలు, ఒకరు మృతి
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 07 Jan 202504:26 PM IST
Ramagundem Knife Attacks : పెద్దపల్లి జిల్లా రామగుండంలో కత్తిపోట్లు కలకలం రేపుతున్నాయి. వారంలో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. కత్తిపోట్లతో ఒకరు మృతి చెందగా...మరొకరు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొంతున్నారు.
Tue, 07 Jan 202504:13 PM IST
CM Revanth Reddy : ఫ్యూచర్ సిటీ, శామీర్ పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు మార్చి నెలాఖరు నాటికి డీపీఆర్ లు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు.
Tue, 07 Jan 202503:42 PM IST
KTR : ఫార్ములా-ఈ రేస్ లో అర పైసా అవినీతి కూడా జరగలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణ లాయర్ల సమక్షంలో జరపాలని హైకోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేతను సుప్రీంకోర్టులో సవాల్ చేశానన్నారు.
Tue, 07 Jan 202503:18 PM IST
TG Rythu Bharosa Scheme : తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 నుంచి రైతు భరోసా నగదు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో ప్రతి ఎకరానికి రూ.6 వేలు చొప్పున అందించనున్నారు. ఇన్ని ఎకరాలకు అని పరిమితి లేకపోవడంతో ప్రభుత్వం భారీగానే నిధులు సమకూర్చాల్సిన పరిస్థితి ఉందని సమాచారం.
Tue, 07 Jan 202501:20 PM IST
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి 16 వరకు 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులుగా నిర్ణయించింది.
Tue, 07 Jan 202511:04 AM IST
- KTR Comments : ఫార్ములా ఈ కార్ రేసు, తెలంగాణ ఏసీబీ కేసు, మరోసారి ఈడీ నోటీసులు.. హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన నేపథ్యంలో.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆలస్యంగానైనా నిజాలు బయటకు వస్తాయన్న కేటీఆర్.. సత్యం కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Tue, 07 Jan 202509:29 AM IST
Formula E Case : ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ఏపీ, తెలంగాణలోని గ్రీన్ కో ఆఫీసుల్లో సోదాలు చేపట్టింది. గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఫార్ములా ఈ రేస్ ప్రమోటర్ గా వ్యవహరించింది.
Tue, 07 Jan 202509:18 AM IST
- Formula E race Case : ఫార్ములా ఈ రేస్ కేసు పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. కేటీఆర్ కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో కేటీఆర్ అరెస్టు తప్పదనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
Tue, 07 Jan 202508:44 AM IST
- KTR ACB Case : కేటీఆర్‌పై ఏసీబీ కేసు, ఆయన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో.. తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వ్యవహారంపై తాజాగా మాజీమంత్రి హరీష్ రావు కీలక కామెంట్స్ చేశారు. బంజారాహిల్స్‌లోని కేటీఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్.. రేవంత్ రెడ్డి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Tue, 07 Jan 202508:33 AM IST
Nampally High Tension : నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్ద హైటెన్షన్ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీసు ముట్టడికి వచ్చింది. దీంతో ఇరు పార్టీల నేతలు పరస్పరదాడికి పాల్పడ్డారు.
Tue, 07 Jan 202507:09 AM IST
- KTR ACB Case : కేటీఆర్ ఏసీబీ కేసు మరో మలుపు తిరిగింది. ఆయన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో కేటీఆర్ అరెస్టు తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ కీలక నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. తదుపరి ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు సమాచారం.
Tue, 07 Jan 202505:32 AM IST
- KTR Petition: ఫార్ములా ఈ కారు రేసు విషయంలో నమోదైన అభియోగాలను కొట్టి వేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేటీఆర్ అభ్యర్థనను తిరస్కరించింది.
Tue, 07 Jan 202505:06 AM IST
- Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను.. హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. బన్నీ రాక నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బాలుడి కుటుంబానికి బన్నీ, చిత్ర దర్శక నిర్మాతలు ఆర్థిక సాయం చేశారు.
Tue, 07 Jan 202504:39 AM IST
- TGSRTC Special Buses : సంక్రాంతి పండగ వస్తోంది. దీంతో వివిధ నగరాలు, పట్టణాల్లో ఉంటున్న వారు సొంతూళ్లకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సహా.. ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
Tue, 07 Jan 202512:40 AM IST
- Karimnagar Tourism: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చారిత్రక వైభవానికి, ప్రాచీన కళా సంపదకు వేదికగా భాసిల్లుతోంది. అరుదైన కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. గోదావరి గలగలలు, మానేర్ సవ్వడులకు తోడు చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. సంక్రాంతి సెలవుల్లో వీటిని చూసి ఎంజాయ్ చేయండి…