తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Gaddar Jayanti : గద్దరన్నను మరోసారి కించపరిస్తే.. మీ పార్టీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది : రేవంత్ రెడ్డి
Telangana News Live January 31, 2025: Gaddar Jayanti : గద్దరన్నను మరోసారి కించపరిస్తే.. మీ పార్టీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది : రేవంత్ రెడ్డి
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 31 Jan 202505:14 PM IST
తెలంగాణ News Live: Gaddar Jayanti : గద్దరన్నను మరోసారి కించపరిస్తే.. మీ పార్టీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది : రేవంత్ రెడ్డి
- Gaddar Jayanti : హైదరాబాద్‌లోని రవింద్రభారతిలో గద్దర్ జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బండి సంజయ్, కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు.
Fri, 31 Jan 202503:09 PM IST
తెలంగాణ News Live: IIT Hyderabad : ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులకు యోగా శిక్షణ.. కారణం ఇదే!
- IIT Hyderabad : ఒత్తిడిని తగ్గించేందుకు ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్ధులకు యోగా శిక్షణ ఏర్పాటు చేశారు. స్వామి రాందేవ్ బాబా శిష్యుడు పరమార్థ దేవ్ ఆధ్వర్యంలో యోగా, ధ్యాన సాధనలపై ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది ఆసక్తిగా పాల్గొన్నారు.
Fri, 31 Jan 202501:11 PM IST
తెలంగాణ News Live: Telangana Education : విద్యతోపాటు సాంకేతిక నైపుణ్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది : సీఎం
- Telangana Education : విద్యతోపాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య కోసం అవసరమైన నిధులను సమకూర్చుతున్నామని వివరించారు.
Fri, 31 Jan 202511:50 AM IST
తెలంగాణ News Live: KCR Comments : నేను కొడితే మామూలుగా ఉండదు.. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఊర మాస్ స్పీచ్
- KCR Comments : ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ ఎట్టకేలకు నోరువిప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు కాలు దువ్వారు. ఫిబ్రవరి నెలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. తాను కొడితే మామూలుగా ఉండబోదని ఆయన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ స్పీచ్‌తో గులాబీ సైన్యంలో జోష్ వచ్చింది.
Fri, 31 Jan 202509:23 AM IST
తెలంగాణ News Live: Hyderabad : రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్లా పని చేస్తున్నారు : కల్వకుంట్ల కవిత
- Hyderabad : నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నీళ్లు-నిజాలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలన్నారు.
Fri, 31 Jan 202507:57 AM IST
తెలంగాణ News Live: Karimnagar Crime : తల్లి దారుణ హత్య, నాలుగేళ్ల కుమారుడు అదృశ్యం..! అసలేం జరిగింది..?
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మమత అనే మహిళ కరీంనగర్ లో హత్యకు గురైంది. అయితే ఆమెతో పాటు ఉన్న నాలుగేళ్ల కుమారుడు అదృశ్యమయ్యాడు. ఈ కేసులో ఓ కారు ఆచూకీ లభింనప్పటికీ నిందితులు దొరకలేదు. ఈ కేసును చేధించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Fri, 31 Jan 202507:16 AM IST
తెలంగాణ News Live: New Osmania Hospital : రూ.2,700 కోట్ల వ్యయంతో నిర్మాణం - కొత్త ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ భూమిపూజ, ప్రత్యేకతలివే
- కొత్త ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారు. గోషామహల్ స్టేడియంలో ఆధునిక హంగులతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2,700 కోట్ల వ్యయంతో 26.30 ఎకరాల్లో కొత్త ఆస్పత్రి నెలకొననుంది. భూమి పూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
Fri, 31 Jan 202501:19 AM IST
తెలంగాణ News Live: Bhadradri Kothagudem : కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత - ఇద్దరు విలేకరుల అరెస్ట్
- భద్రాచలంలో హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం గోదావరి బ్రిడ్జి చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు జరిపారు. ఈ వాహన తనిఖీల్లో బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పండగ రాములు, అతని సోదరుడు పండగ వెంకటేశ్వర్లు, మరో వ్యక్తితో కలిసి కారులో తరలిస్తున్న గంజాయితో పట్టుబడ్డారు.