తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
TG Professors : ప్రొఫెసర్లకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana News Live January 30, 2025: TG Professors : ప్రొఫెసర్లకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 30 Jan 202504:30 PM IST
తెలంగాణ News Live: TG Professors : ప్రొఫెసర్లకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG Professors : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి పదవీ విరమణ వయస్సును పెంచింది. ఈ మేరకు జీవో జారీ చేసింది రేవంత్ ప్రభుత్వం. దీనిపై ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Thu, 30 Jan 202501:53 PM IST
తెలంగాణ News Live: Hyderabad : తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్చల్.. అనుమానాలు ఎన్నో?
- Hyderabad : తెలంగాణ సచివాలయం.. ఎందరో వీఐపీలు ఉండే ప్రాంతం. ముఖ్యమంత్రి మొదలు.. కీలక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు అక్కడే ఉంటారు. అందుకే భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. అలాంటి చోట ఓ నకిలీ ఉద్యోగి ఇన్నాళ్లు తిరిగాడు. కానీ.. భద్రతా అధికారులు గుర్తించలేకపోయారు. తాజాగా అతన్ని అరెస్టు చేశారు.
Thu, 30 Jan 202512:37 PM IST
తెలంగాణ News Live: London BRS: లండన్ టవర్ బ్రిడ్జి దగ్గర ఎన్నారై బీఆర్ఎస్-యూకే నిరసన, కాంగ్రెస్ వైఫల్యాలపై ఆందోళన
- London BRS: కాంగ్రెస్ వైఫల్యాలపై ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులవుతున్నా ఇచ్చిన 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపిస్తూ ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లండన్ లో నిరసన తెలిపారు.
Thu, 30 Jan 202512:04 PM IST
తెలంగాణ News Live: Warangal Suicide: స్నాప్‌చాట్ పరిచయమే కొంప ముంచిందా! ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో ఆసక్తికర విషయాలు
- Warangal Suicide: వరంగల్ నగరంలో రెండు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్ కు చెందిన ఓ యువకుడితో హనుమకొండ గోపాలపూర్ కు చెందిన బాలిక ప్రేమలో పడగా, ఇద్దరూ చనువుగా ఉండటం చూసిన బాలిక తండ్రి యువకుడి గొంతు కోశాడు.
Thu, 30 Jan 202511:56 AM IST
తెలంగాణ News Live: Hyderabad Traffic : హైదరాబాద్‌లో రెండు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఇదే!
- Hyderabad Traffic : రోడ్ల కనెక్టివిటీ, ఫ్లైఓవర్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. కీలక జంక్షన్లలో ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ప్రత్యామ్నాయ మార్గలు ఇలా ఉన్నాయి.
Thu, 30 Jan 202510:24 AM IST
తెలంగాణ News Live: Union Budget 2025 : కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ఆశలు.. కీలక ప్రాజెక్టులకు సాయం కోసం ఎదురుచూపులు!
- Union Budget 2025 : ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. కీలక పథకాలు, ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశిస్తోంది. ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
Thu, 30 Jan 202508:55 AM IST
తెలంగాణ News Live: TG Road Construction : తెలంగాణలో రోడ్లకు మహర్దశ.. జిల్లాల వారీగా ప్రణాళికలు.. 9 ముఖ్యమైన అంశాలు
- TG Road Construction : తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Thu, 30 Jan 202507:48 AM IST
తెలంగాణ News Live: Siddipet Accident: సిద్దిపేట జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అపశృతి..బండరాళ్లు దొర్లి తల్లి కూతుళ్లు మృతి,5 గురికి గాయాలు
- Siddipet Accident: ఉపాధి హామీ పథకం పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట్ మండలంలో గోవెర్ధనగిరి గ్రామం శివారులో పనిచేస్తున్న, ఉపాధి హామీ కార్మికుల పైన బండరాళ్లు దొర్లి పడటంతో, తల్లి కూతుర్లు ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరొక ఐదుగురు కార్మికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
Thu, 30 Jan 202507:10 AM IST
తెలంగాణ News Live: GHMC Council Meeting : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస - బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్
- GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కాంగ్రెస్ హామీలు నెరవేర్చడంలేదంటూ ఫ్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యుల నిరసనకి దిగారు. మేయర్ పోడియం వద్దకు వెళ్లేందుకు యత్నించారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు కూడా నిరసన చేపట్టారు. జీహెచ్‌ఎంసీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Thu, 30 Jan 202506:37 AM IST
తెలంగాణ News Live: TGPSC Groups Results : ముగిసిన గ్రూప్ 1 మూల్యాంకనం..! 2, 3 ఫలితాలపై కూడా కసరత్తు
- గ్రూప్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. అయితే ముందుగా కీలకమైన గ్రూప్ 1 ఫలితాలను ప్రకటించిన తర్వాతే… గ్రూప్ 2, 3 ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
Thu, 30 Jan 202505:17 AM IST
తెలంగాణ News Live: Kodakanchi Brahmotsavam: ఫిబ్రవరి 1 నుంచి కొడకంచి ఆలయ బ్రహ్మోత్సవాలు, 4న కళ్యాణం
- Kodakanchi Brahmotsavam: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునున్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ప్రసిద్ధ క్షేత్రంగా పేరుపొందిన కొడకంచి ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్స వాలకు ముస్తాబయ్యాడు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోవంగా జరగనున్నాయి
Thu, 30 Jan 202504:02 AM IST
తెలంగాణ News Live: Hyderabad Water Supply : హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
- హైదరాబాద్ నగర వాసులకు జలమండలి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీన పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని ప్రకటించారు. మరమ్మతుల పనుల కారణంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Thu, 30 Jan 202503:00 AM IST
తెలంగాణ News Live: TG SSC Exams 2025 : మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు - విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
- తెలంగాణ టెన్త్ విద్యార్థులకు విద్యాశాఖ తీపి కబురు చెప్పింది. వార్షిక పరీక్షల వేళ ప్రస్తుతం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరగతుల్లో విద్యార్థులకు అల్పాహారం (స్నాక్స్) అందజేయనుంది. ఈ మేరకు తాజాగా వివరాలను పేర్కొంది.
Thu, 30 Jan 202501:10 AM IST
తెలంగాణ News Live: TG MLC Elections 2025 : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా - పావులు కదుపుతున్న పార్టీలు, అభ్యర్థులు..!
- Telangana MLC elections 2025: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఉత్తర తెలంగాణలో ఫిబ్రవరి 27న కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి3న ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Thu, 30 Jan 202511:48 PM IST
తెలంగాణ News Live: TG Tourism Policy 2025 : ‘ఫిబ్రవరి 10లోపు పర్యాటక విధానం సిద్ధం కావాలి’ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Telangana Tourism Policy : దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టూరిజం పాలసీపై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. ఫిబ్రవరి 10 వ తేదీలోగా అత్యుత్తమ పర్యాటక విధానం సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.