తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live January 3, 2025: Formula E Race Case : 'విచారణకు రండి' - మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 03 Jan 202512:30 PM IST
తెలంగాణ News Live: Formula E Race Case : 'విచారణకు రండి' - మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
- Telangana ACB Summons to KTR : ఫార్ములా -ఈ రేసింగ్ కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగా… మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. జనవరి 6వ తేదీన ఉదయం 10గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
Fri, 03 Jan 202512:21 PM IST
తెలంగాణ News Live: Warangal : ప్రాణాలు తీస్తున్న మాంజాపై టాస్క్‌ఫోర్స్ కొరడా.. వరంగల్‌లోని దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు
- Warangal : నిషేధిత మాంజా దారం విక్రయిస్తున్న వ్యాపారులపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. చైనా మాంజాను విక్రయిస్తుండటం వల్ల పక్షులకే కాకుండా మనుషులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయినా నిబంధనలకు విరుద్ధంగా మాంజా అమ్ముతున్న వ్యాపారులపై పోలీసులు నిఘా పెట్టారు.
Fri, 03 Jan 202512:02 PM IST
తెలంగాణ News Live: Sandhya Theatre Stampede Case : అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు - నాంపల్లి కోర్టు ఉత్తర్వులు
- Sandhya theatre stampede case : హీరో అల్లు అర్జున్‌కు ఊరట దక్కింది. సంథ్య థియేటర్ ఘటనలో రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఈ మేరకు నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రూ.50 వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది.
Fri, 03 Jan 202511:37 AM IST
తెలంగాణ News Live: Aramghar Flyover : హైదరాబాద్ ఆరాంఘర్ ఫ్లైఓవర్‌కు ఎన్నో ప్రత్యేకతలు.. ప్రారంభం ఎప్పుడు?
- Aramghar Flyover : హైదరాబాద్‌లోని ఆరాంఘర్ ఫ్లైఓవర్.. నగరంలోని రవాణా వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అలాగే దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు.
Fri, 03 Jan 202511:18 AM IST
తెలంగాణ News Live: Hyderabad Water Supply : మల్లన్నసాగర్ నుంచే హైదరాబాద్‌కు నీటి తరలింపు - గోదావరి ఫేజ్2కు గ్రీన్ సిగ్నల్, కీలక నిర్ణయాలివే
- మల్లన్నసాగర్ నుంచే గోదావరి ఫేజ్-2 తాగునీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ జలమండలి బోర్డు సమావేశంలో మాట్లాడిన ఆయన.. 2050 నాటికి పెరిగే జనాభా అవసరాలకు తగినట్టుగా హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరాకు మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు.
Fri, 03 Jan 202509:59 AM IST
తెలంగాణ News Live: TG Rythu Bharosa : ఈ ప్రభుత్వం రైతు భరోసాను ఎత్తగొట్టే కుట్ర చేస్తున్నది : కేటీఆర్
- TG Rythu Bharosa : రైతు భరోసాను ఎత్తగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని.. కేటీఆర్ ఆరోపించారు. ప్రమాణ పత్రాల పేరుతో రైతులపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. రైతన్నలను దొంగలుగా చిత్రీకరించి ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Fri, 03 Jan 202509:15 AM IST
తెలంగాణ News Live: SCR Mahakumbh Mela Special Trains 2025 : ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా... ఏపీ, తెలంగాణ నుంచి 26 ప్రత్యేక రైళ్లు, వివరాలివే
- SCR Maha Kumbh Mela Trains 2025: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణ నుంచి మరో 26 స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ రైళ్లు… పలు స్టేషన్లలో ఆగుతాయి.
Fri, 03 Jan 202508:34 AM IST
తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్స్ - సంక్రాంతి తర్వాత లబ్ధిదారుల జాబితాలు, ఎంపిక విధానం ఇలా…!
- TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఇప్పటి వరకు 74 శాతం సర్వే పూర్తయిందని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అయితే లబ్ధిదారుల ప్రకటన సంక్రాంతి తర్వాత ఉంటుందని పేర్కొన్నారు.
Fri, 03 Jan 202507:21 AM IST
తెలంగాణ News Live: Moinabad Crime : మొయినాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై కామాంధుడి అత్యాచారయత్నం
- Moinabad Crime : అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి.. తన ఇంటి ముందు ఆడుకుంటోంది. అప్పుడే అటుగా వచ్చిన ఓ తాగుబోతు కన్ను ఆ పసిపాపపై పడింది. ఆ చిన్నారిని పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెల్లిన కామాంధుడు.. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పట్టుకొని స్థానికులు చితకబాదారు.
Fri, 03 Jan 202506:21 AM IST
తెలంగాణ News Live: Hyderabad police : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. అవాక్కైన హైదరాబాద్ పోలీసులు.. మరీ ఇంత తాగావేంటి బ్రో!
- Hyderabad police : న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తికి వచ్చిన శ్వాస పరీక్ష ఫలితాలను చూసి.. పోలీసులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Fri, 03 Jan 202503:59 AM IST
తెలంగాణ News Live: Rajanna Sircilla : సిరిసిల్ల జిల్లాలో బాలుడి ఆత్మహత్య.. బాలికకు న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని..
- Rajanna Sircilla : కొత్త సంవత్సరం ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. క్లాస్‌మేట్‌కు న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని.. బాలిక కుటుంబ సభ్యులు బాలుడిని బెదిరించారు. దీంతో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.
Fri, 03 Jan 202502:23 AM IST
తెలంగాణ News Live: Sabarimala Bus Accident: శబరిమలలో ట్రావెల్స్ బస్సు ప్రమాదం, హైదరాబాద్ భక్తులకు తీవ్ర గాయాలు, డ్రైవర్ దుర్మరణం
- Sabarimala Bus Accident: శబరిమలలో ఇరుముడులు సమర్పించుకునేందుకు వెళుతున్న అయ్యప్ప భక్తుల ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి శబరిమల వెళుతున్న ట్రావెల్స్ బస్సు లోయలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. గాయపడిన వారిని కొట్టాయం ఆస్పత్రికి తరలించారు.