Telangana News Live January 29, 2025: ACB Raids : ఏసీబీ వలలో చిక్కిన వెటర్నరీ డాక్టర్, రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 29 Jan 202505:18 PM IST
- ACB Raids : తెలంగాణ ఏసీబీ అవినీతి అధికారులపై కొరడా ఝుళిపిస్తుంది. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ శ్యాంపూర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రమేష్ రాథోడ్ లంచం తీసుకంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
Wed, 29 Jan 202504:54 PM IST
TG Mlc Elections : ఫిబ్రవరి 27న జరిగే కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా వై.అశోక్ కుమార్ పోటీ చేయనున్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అశోక్ కుమార్ ను టీపీటీఎఫ్ రంగంలోకి దింపింది.
Wed, 29 Jan 202511:51 AM IST
- రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్దమయిందనైట్లు అధికారులు వివరించారు.
Wed, 29 Jan 202511:10 AM IST
- డిజిటల్ మీడియాకూ ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజ్ఞప్తి లేఖను అందజేసింది. సంఘ ప్రతినిధులు స్వామి ముద్దం, పోతు అశోక్ మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తికి కమిషనర్ నుంచి సానుకూలమైన స్పందన వచ్చినట్లు తెలిపారు.
Wed, 29 Jan 202510:09 AM IST
సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన దళిత యువకుడి హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇష్టంలేని వివాహం చేసుకోవటంతో అమ్మాయి తరపు వాళ్లే ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది. హత్య చేసింది అమ్మాయి సోదరుడే అని గుర్తించారు. మరో వ్యక్తి పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది.
Wed, 29 Jan 202507:01 AM IST
- Maha Kumbh Mela Special Trains 2025 : కుంభమేళా వెళ్లే యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఫిబ్రవరి 5 - 9 తేదీల్లో రాకపోకలు సాగిస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
Wed, 29 Jan 202506:16 AM IST
- కరీంనగర్ జైలులో వాడిన పూలతో అగరు బత్తులు తయారీ చేస్తున్నారు. రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా తయారు చేస్తుండడంతో చాలా మంది విక్రయిస్తున్నారు. దీంతో పని చేస్తున్న ఖైదీలకు ఉపాధి ఉండటంతో పాటు జైలుకు ఆదాయం కూడా సమకూరుతోంది.
Wed, 29 Jan 202505:52 AM IST
- Gachibowli Prostitution Racket Busted : గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపుదాడి చేయగా… ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తొమ్మిది మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Wed, 29 Jan 202504:30 AM IST
- Hyd Metro Signal Issues: హైదర్‌బాద్ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్లే బ్లూ లైన్ లో సిగ్నలింగ్ సమస్యలు తలెత్తడంతో బుధవారం ఉదయం నుంచి రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలిగింది. దీంతో మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగిపోయింది.
Wed, 29 Jan 202501:32 AM IST
- Teenage love: టీనేజీ ప్రేమ వరంగల్‌లో విషాదంతంగా మారింది. కూతురితో ఓ యువకుడు సన్నిహితంగా ఉండటం చూసి చేయి చేసుకున్న తండ్రి అంతటితో ఆగకుండా అతని గొంతు కోశాడు. అది చూసి ఆందోళనకు గురైన బాలిక ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హన్మకొండలో కలకలం రేపింది.
Wed, 29 Jan 202512:36 AM IST
- KMC Politics: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు రక్తీకట్టిస్తున్నాయి. పాలకవర్గం ఐదేళ్ళ పదవి కాలం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్పొరేటర్ల సన్మాన సమావేశం నిరసనలు ఆందోళనలకు వేదికగా మారింది. సరికొత్త సాంప్రదాయానికి తెరలేపి రాజకీయంగా దుమారం సృష్టించారు.