Telangana News Live January 26, 2025: Hussain Sagar Fire Accident : హుస్సేన్ సాగర్ లో భారీ అగ్నిప్రమాదం- రెండు బోట్లు దగ్ధం, ముగ్గురికి గాయాలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 26 Jan 202505:24 PM IST
Hussain Sagar Fire Accident : హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా పేలి రెండు బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమయంలో బోట్లలో ఏడుగురు ఉన్నారు. వీరిలో ముగ్గురు గాయపడ్డారు. గవర్నర్, కేంద్రమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ఇలా అపశృతి చోటుచేసుకుంది.
Sun, 26 Jan 202503:32 PM IST
CPM Maha Sabhalu : బీజేపీ హిందుత్వ, కార్పొరేట్ అనే రెండు స్థంభాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ అన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలు, సామాజిక అణచివేత, కుల వివక్ష పైన ఒక్కటై పోరాడాలని సూచించారు.
Sun, 26 Jan 202502:59 PM IST
TG Welfare Schemes : తెలంగాణలో ఇవాళ సంక్షేమ జాతర జరిగింది. ఒకేరోజు నాలుగు సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఖమ్మం జిల్లాలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసాపై కీలక విషయాలు ప్రస్తావించారు.
Sun, 26 Jan 202511:46 AM IST
- Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అనగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తారని.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రవంచ గ్రామంలో పర్యటించిన రేవంత్.. 4 కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా కొడంగల్‌కు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Sun, 26 Jan 202510:58 AM IST
- TG Welfare Schemes : తెలంగాణలో పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. అయితే.. కేవలం మండలానికి ఒక్క గ్రామంలోనే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ భగ్గుమంది. కేటీఆర్ దీనిపై సెటైర్లు పేల్చారు.
Sun, 26 Jan 202509:36 AM IST
Ex Mlc Satyanarayana : మాజీ ఎమ్మెల్సీ, సీరియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ ఆదివారం సంగారెడ్డిలో తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.
Sun, 26 Jan 202507:49 AM IST
- Medak : సంగారెడ్డిలో సీపీఎం మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలకు సీపీఎం కీలక నేతలు హాజరయ్యారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లౌకికవాద శక్తులతో కలిసి బీజేపీ విధానాలపై పోరాడాలని పిలుపునిస్తున్నారు. అటు శ్రమ దోపిడీపై బృందాకారత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Sun, 26 Jan 202506:42 AM IST
- Road accident at Mamnoor : వరంగల్ శివారు ప్రాంతమైన మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీలో నుంచి ఐరన్ రాడ్లు తెగి ఆటోపై పడిన ఘటన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Sun, 26 Jan 202506:33 AM IST
- స్కూల్ లో విద్యార్థులతో పని చేయించిన టీచర్లపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు చర్యలు తీసుకున్నారు. ముగ్గురు మహిళా టీచర్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నారాయణఖేడ్ లోని అంగన్వాడీలో పెచ్చులూడిన ఘటనలో మరో ఇద్దరిపై కూడా కలెక్టర్ వేటు వేశారు.
Sun, 26 Jan 202505:32 AM IST
- Hyderabad Murder : హైదరాబాద్‌లో నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేత సంబంధాలు, వ్యాపార లావాదేవీలు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా డబ్బు కోసం ఓ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
Sun, 26 Jan 202504:04 AM IST
- TG Electricity : రాష్ట్రంలో రోజురోజుకూ విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. ఏ చిన్న పని కావాలన్నా కరెంట్ తప్పనిసరి అయ్యింది. కాసేపు కరెంట్ పోతే.. అన్ని పనులు ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ వినూత్న ఆలోచన చేసింది. కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగితే.. వెంటనే పునరుద్ధరించే చర్యలు చేపట్టింది.
Sun, 26 Jan 202501:53 AM IST
- రాష్ట్రంలో నాలుగు ముఖ్యమైన పథకాలు పట్టాలెక్కనున్నాయి. ఇవాళ రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పథకాలను ప్రభుత్వం లాంచనంగా ప్రారంభించబోతుంది. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఈ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.
Sun, 26 Jan 202501:16 AM IST
- Fake currency racket in Warangal : నకిలీ నోట్ల ముఠాను వరంగల్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను విక్రయాలకు పాల్పడతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 21లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.