Telangana News Live January 25, 2025: Osmania Hospital : వందేళ్ల అవసరాలకు తగినట్లు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, ఈ నెల 31న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 25 Jan 202504:27 PM IST
Osmania Hospital : జనవరి 31న ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు పూర్తి ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.
Sat, 25 Jan 202502:18 PM IST
Karimnagar News : కరీంనగర్ లో బీఆర్ఎస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ లో కొందరి నేతల వైఖరి నచ్చక బీజేపీలో చేరుతున్నట్లు సునీల్ రావు ప్రకటించారు.
Sat, 25 Jan 202512:46 PM IST
- Hyderabad : ఆదివారం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో మాంసం షాపులు రద్దీగా ఉంటాయి. వైన్స్ కిటకిటలాడతాయి. కానీ.. ఈ ఆదివారం ఆ ఛాన్స్ లేదు. రిపబ్లిక్ డే సందర్భంగా మాంసం షాపులు, వైన్స్, బార్లను క్లోజ్ చేయనున్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం నుంచే వైన్స్ దగ్గర రద్దీ నెలకొంది.
Sat, 25 Jan 202511:19 AM IST
TG Four Welfare Scheme : మండలంలోని ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని రేపు నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తెలిపారు. ఇవాళ అప్లికేషన్ ఇచ్చినా అర్హులైతే రేపటి జాబితాలో పేరు ఉంటుందన్నారు. అనర్హులకు ఇల్లు వస్తే క్యాన్సిల్ చేస్తామన్నారు.
Sat, 25 Jan 202510:12 AM IST
Bandi Sanjay : ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు విడుదల చేయమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం డబ్బులు ఇస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ఫొటోలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. రేషన్ కార్డులపై మోదీ ఫొటో లేకపోతే రేషన్ కూడా ఇవ్వమన్నారు.
Sat, 25 Jan 202509:13 AM IST
TGPSC AE Provisional List : తెలంగాణ ఏఈ ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఏఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మొత్తం 650 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
Sat, 25 Jan 202507:16 AM IST
- Hyderabad Metro : ప్రయాణికులకు మెట్రో మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికులు స్టేషన్ నుంచి గమ్యస్థానానికి చేరుకోవడాన్ని సులభతరం చేసింది. కాలుష్య రహిత వాహనాలను.. మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేసింది. దీంతో మెట్రో నుంచి ఇళ్లు, కార్యాలయం, కళాశాలలకు వెళ్లే వారు సొంత వాహనాలను వాడాల్సిన అవసరం లేదు.
Sat, 25 Jan 202506:43 AM IST
- HYDRA Demolitions in Pocharam : గ్రేటర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శనివారం రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూల్చివేతలు జరిగాయి. దివ్యనగర్ లే ఔట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను పూర్తిగా తొలగించారు.
Sat, 25 Jan 202505:52 AM IST
- Etela Rajender : సౌత్‌పై పట్టుకోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ సమయంలోనే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక తెరపైకి వచ్చింది. చాలామంది నేతలు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. కాషాయ పార్టీ అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
Sat, 25 Jan 202504:31 AM IST
- TG Grama Sabhalu : జనవరి 26 నుంచి 4 ప్రతిష్టాత్మక పథకాలు ప్రారంభించాలని రేవంత్ సర్కారు సంకల్పించింది. ఈ పథకాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించింది. ఈ సభల్లో చాలాచోట్ల ప్రజలు అధికారులపై తిరగబడ్డారు. తమపేర్లు అర్హుల జాబితాలో లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sat, 25 Jan 202503:57 AM IST
- Huzurabad : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాల దాడి జరిగింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలో పాల్గొన్న ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనపై కోడిగుడ్లు, టమాటాలతో దాడికి దిగారు. దీంతో గ్రామసభ కాస్త గందరగోళంగా మారింది.
Sat, 25 Jan 202511:46 PM IST
- గృహ నిర్మాణం, పట్టణ ప్రణాళికలపై కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఇందులో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… పీఎం ఆవాస్ యోజన (అర్బన్) కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు కేంద్రం చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.