తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Karimnagar : “వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్” - కరీంనగర్ కలెక్టర్ పై మంత్రి పొంగులేటి అసహనం
Telangana News Live January 24, 2025: Karimnagar : “వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్” - కరీంనగర్ కలెక్టర్ పై మంత్రి పొంగులేటి అసహనం
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 24 Jan 202505:02 PM IST
తెలంగాణ News Live: Karimnagar : “వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్” - కరీంనగర్ కలెక్టర్ పై మంత్రి పొంగులేటి అసహనం
- కరీంనగర్ జిల్లా కలెక్టర్ పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పదే పదే తోపులాట జరగటం, ఉన్నతాధికారుల లేకపోవటంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Fri, 24 Jan 202503:59 PM IST
తెలంగాణ News Live: Ex IAS BP Acharya Obtuse Angle : వ్యంగ్య రేఖల్లో 'బ్యూరోక్రాట్' జీవన చిత్రం - ఘనంగా 'అబ్ట్యుస్ యాంగిల్' పుస్తకావిష్కరణ
- రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య రచించిన 'అబ్ట్యుస్ యాంగిల్' (Obtuse Angle) అనే కార్టూన్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. సాహిత్య మహోత్సవంలో భాగంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ సివిల్ సర్వెంట్లతో పాటు పుస్తక ప్రియులు హాజరయ్యారు.
Fri, 24 Jan 202503:33 PM IST
తెలంగాణ News Live: Sangareddy District : అంగన్వాడీ భవనంలో ఊడిపడిన స్లాబ్ పెచ్చులు - ఐదుగురు పిల్లలకు తీవ్ర గాయాలు
- సంగారెడ్డి జిల్లాలోని వెంకటాపూర్ అంగన్వాడి కేంద్రంలో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో ఐదు మంది విద్యార్థులు గాయపడ్డారు. 108 సాయంతో చేయడంతో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిని స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డి పరామర్శించారు.
Fri, 24 Jan 202512:20 PM IST
తెలంగాణ News Live: Greater Hyderabad Congress : స్వరం మారుతోంది....! గ్రేటర్ లో చర్చనీయాంశంగా 'దానం' తీరు - ఎందుకిలా...?
- గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే దానం తీరు చర్చనీయాంశంగా మారింది. నేతలంతా ఓ దారిలో ఉంటే… దానం రూట్ మాత్రం సెపరేట్ అన్నట్లుగా ఉంది. ప్రధానంగా కూల్చివేతల విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. బతుకొచ్చిన వాళ్లపై దౌర్జన్యం చేస్తారా..? అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
Fri, 24 Jan 202510:50 AM IST
తెలంగాణ News Live: TG MLC elections : యుద్ధం చేస్తారా.. ఊరుకుంటారా.. ఎమ్మెల్సీ ఎన్నికపై కేసీఆర్ మౌనం ఎందుకు?
- TG MLC elections : కేసీఆర్.. రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట. కానీ ఇటీవల సైలెంట్‌గా ఉంటున్నారు. కారణాలు ఏంటో ఎవరికీ తెలియదు. కానీ.. నాయకులు మాత్రం అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది. బాస్ ఏం చెప్పడం లేదు.. ఏం చేద్దామని చర్చించుకుంటున్నారు.
Fri, 24 Jan 202509:26 AM IST
తెలంగాణ News Live: TTA New President : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది
- TTA New President Naveen Reddy : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు మరికొందరు సభ్యులుగా ప్రమాణం చేశారు. అధ్యక్షుడితో పాటు బోర్డు సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు అందుతున్నాయి.
Fri, 24 Jan 202508:10 AM IST
తెలంగాణ News Live: TG Cyber Crime : ప్రభుత్వ పథకాల పేరిట సైబర్ నేరగాళ్ల వల.. తస్మాత్ జాగ్రత్త!
- TG Cyber Crime : అమాయకులను మోసం చేసేందుకు.. సైబర్ నేరగాళ్లు ప్రతీ సందర్భాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ పథకాలను వాడుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పథకాల గురించి అధికారులకు తప్ప ఎవరికీ వివరాలు చెప్పొద్దని స్పష్టం చేస్తున్నారు.
Fri, 24 Jan 202507:13 AM IST
తెలంగాణ News Live: Suryapet : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం.. పాక్షికంగా దెబ్బతిన్న 8 కార్లు
- Suryapet : సూర్యాపేట జిల్లాలో ప్రమాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం జరగ్గా.. 8 కార్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వచ్చి.. మంత్రి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
Fri, 24 Jan 202506:36 AM IST
తెలంగాణ News Live: Kothagudem Airport : కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మరో ముందడుగు.. స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
- Kothagudem Airport : కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. విమానాశ్రయం నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. దక్షిణ అయోధ్యలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని చాలా కాలంగా ఖమ్మం ప్రజలు కోరుతున్నారని.. ప్రజాప్రతినిధులు కేంద్ర బృందానికి వివరించారు.
Fri, 24 Jan 202505:29 AM IST
తెలంగాణ News Live: TG Welfare Schemes : ప్రజల ఖాతాల్లోకి డబ్బులే డబ్బులు.. నిధులను సిద్ధం చేసిన ఆర్థిక శాఖ!
- TG Welfare Schemes : జనవరి 26న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చెల్లింపులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటు చివరి త్రైమాసికం రుణాలకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతి వస్తుందని భావిస్తున్నారు.
Fri, 24 Jan 202504:17 AM IST
తెలంగాణ News Live: TG Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితా విడుదల ఆలస్యమయ్యే అవకాశం, 26న పథకం ప్రారంభం
- TG Indiramma Illu: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితా విడుదల ఆలస్యం కానుంది. జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత లబ్దిదారుల జాబితా విడుదల చేస్తారని ప్రకటించినా ఆ రోజు జాబితాలు విడుదల కాకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. పథకాన్ని ప్రారంభించి తేదీలో జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
Fri, 24 Jan 202504:13 AM IST
తెలంగాణ News Live: Telangana Farmers : సన్నాల సాగుకు సై.. ఫలించిన బోనస్ ప్రయత్నం.. యాసంగిలో భారీగా పెరిగే అవకాశం!
- Telangana Farmers : గతంలో తెలంగాణలో చాలా వరకు సన్న వడ్లను పండించేవారు కాదు. దిగుబడి తక్కువ వస్తుందని, పెట్టుబడి ఎక్కువ అవుతుందని దొడ్డు రకం వడ్లను పండించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో.. ఎక్కువమంది సన్నాల సాగుకు సై అంటున్నారు.
Fri, 24 Jan 202501:35 AM IST
తెలంగాణ News Live: Koushik Reddy: గులాబీ పూలు ఇచ్చి... దండం పెట్టి... నిరసన తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
- Koushik Reddy: బిఆర్ఎస్ కు చెందిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసినా హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రజాపాలన గ్రామసభల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెరైటీగా నిరసన తెలిపారు. రొటీన్ కు భిన్నంగా గ్రామస్తులతో కలిసి నేలపై కూర్చుని గులాబీలు ఇచ్చి నిరసన తెలిపారు.
Fri, 24 Jan 202501:17 AM IST
తెలంగాణ News Live: Karimnagar Politics: విభేదాలు విడిచి, విమర్శలు లేకుండా... కరీంనగర్ లో రాజకీయ ప్రత్యర్ధుల అభివృద్ధి మంత్రం
- Karimnagar Politics: కరీంనగర్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ ప్రత్యర్థులు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. ఉప్పు నిప్పులా ఉండే మూడు ప్రధాన పార్టీల ప్రజాప్రతినిధులు ఐక్యంగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు.
Fri, 24 Jan 202512:28 AM IST
తెలంగాణ News Live: Peddapalli ACB Trap: పెద్దపల్లిలో ఏసీబీకి చిక్కిన రామగుండం ఎస్టీవో మహేశ్వర్, సబార్డినేట్ పవన్...
- Peddapalli ACB Trap: పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. రిటైర్డ్ టీచర్ నుంచి పది వేలు లంచంగా తీసుకుంటుండగా రామగుండం STO ఏకుల మహేశ్వర్, ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేణీ పవన్ ను ఏసిబి అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు.