తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
TG Grama Sabhalu : గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదు - ఫైనల్ లిస్ట్ పై కీలక ప్రకటన
Telangana News Live January 23, 2025: TG Grama Sabhalu : గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదు - ఫైనల్ లిస్ట్ పై కీలక ప్రకటన
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 23 Jan 202504:29 PM IST
తెలంగాణ News Live: TG Grama Sabhalu : గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదు - ఫైనల్ లిస్ట్ పై కీలక ప్రకటన
- ప్రభుత్వం అమలు చేసే స్కీమ్ ల అర్హుల జాబితాపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదని స్పష్టం చేశారు. జాబితాలో ఉంటే ఉన్నట్లు.... లేకపోతే రానట్లు కాదని చెప్పుకొచ్చారు. అసలైన అర్హులనే గుర్తించి ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
Thu, 23 Jan 202503:22 PM IST
తెలంగాణ News Live: Patancheru Congress : పటాన్‌చెరు కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు - ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరసన గళం
- పటాన్‌చెరు కాంగ్రెస్ లో మరోసారి విబేధాలు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని మరో వర్గం ధర్నాకు దిగింది. అంతేకాదు.. ఓ దశలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించింది. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Thu, 23 Jan 202511:51 AM IST
తెలంగాణ News Live: Investments in Hyderabad : హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్.. బ్లాక్ స్టోన్ భారీ పెట్టుబడులు
- Investments in Hyderabad : తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా బ్లాక్ స్టోన్ కంపెనీ రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఎక్లాట్ హెల్త్ కొత్త ఆఫీస్‌ను తెలంగాణలో ప్రారంభించనుంది.
Thu, 23 Jan 202510:44 AM IST
తెలంగాణ News Live: Armoor Turmeric : ఆర్మూర్ ప్రాంతంలో పండే పసుపునకు జీఐ ట్యాగ్.. లాభాలు ఏంటీ?
- Armoor Turmeric : నిజామాబాద్ జిల్లా.. పసుపు పంటకు మారు పేరు. ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో పసుపు పంట చాలా ఫేమస్. ఇక్కడే సాగుచేసే పసుపునకు భౌగోళిక గుర్తింపు సాధించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తల బృందం క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Thu, 23 Jan 202509:01 AM IST
తెలంగాణ News Live: World Economic Forum : దావోస్‌లో తెలంగాణ దూకుడు.. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు!
- World Economic Forum : దావోస్‌లో తెలంగాణ దూకుడు ప్రదర్శిస్తోంది. రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. కొత్త ఒప్పందాలతో దాదాపు 46 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇదే అతి పెద్ద రికార్డు. 10 ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.
Thu, 23 Jan 202507:29 AM IST
తెలంగాణ News Live: Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్.. జనవరి నెలాఖరు వరకు ఆంక్షలు!
- Shamshabad Airport : గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. సున్నిత ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్ జారీ చేశాయి. ప్రయాణికులు, సందర్శకులకు సూచనలు జారీ అయ్యాయి.
Thu, 23 Jan 202505:49 AM IST
తెలంగాణ News Live: Investments in Telangana : తెలంగాణలో విప్రో విస్తరణ.. 5 వేల మందికి ఉద్యోగాలు.. ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు
- Investments in Telangana : దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. గతేడాది పెట్టుబడులను రేవంత్ సర్కార్ అధిగమించింది. బుధవారం ఒక్క రోజే తెలంగాణకు రూ.56,300 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయి. తాజాగా విప్రో కంపెనీతో కీలక ఒప్పందాలు జరిగాయి.
Thu, 23 Jan 202504:00 AM IST
తెలంగాణ News Live: TG New Ration Cards : రేషన్ కార్డుల జాబితాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పేరు.. అవాక్కైన ప్రజలు!
- TG New Ration Cards : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా రేషన్ కార్డులపైనే చర్చ జరుగుతోంది. అధికారులు గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తూ.. జాబితాను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే పేరు రేషన్ కార్డుల జాబితాలో ప్రత్యక్షమైంది.
Thu, 23 Jan 202511:56 PM IST
తెలంగాణ News Live: Siricilla Sarees: సిరిసిల్ల నేతన్నకు చేయుత... 4.24 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్స్
- Siricilla Sarees: వస్త్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సిరిసిల్ల నేతన్నకు రాష్ట్ర ప్రభుత్వం చేయుతనిచ్చింది. త్వరలో మహిళా గ్రూపులకు అందజేసే చీరల ఆర్డర్స్ సిరిసిల్ల నేతన్నకు సర్కార్ ఇచ్చింది. సాంచల చప్పుడుతో నేతన్నలు బిజీగా మారుతున్నారు.