Telangana News Live January 21, 2025: Venu Swamy : నాగచైతన్య-శోభిత వైవాహిక జీవితంపై వివాదాస్పద జోస్యం-క్షమాపణలు చెప్పిన వేణుస్వామి
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 21 Jan 202503:59 PM IST
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మహిళా కమిషన్ కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. హీరో నాగచైతన్య-శోభిత విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పిన వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ కమిషన్ ఎదుట హాజరైన ఆయన క్షమాపణలు చెబుతూ లేఖ అందించారు.
Tue, 21 Jan 202511:55 AM IST
- TG Cyber Crime : సైబర్ మోసాలపై అధికారులు ప్రజలకు అవగాహనా కల్పిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి సైబర్ సెల్ డీఎస్పీ వేణు గోపాల్ రెడ్డి కీలక సూచనలు చేశారు. క్రిప్టో కరెన్సీ, వ్యవసాయం, దుస్తులు, ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తుల విక్రయం మాటున.. పిరమిడ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు పెరుగుతున్నాయన్నారు.
Tue, 21 Jan 202511:26 AM IST
TG Grama Sabhalu : నాలుగు కొత్త పథకాలకు లబ్దిదారుల ఎంపికపై తెలంగాణలో నిర్వహిస్తున్న గ్రామసభలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అధికారులు, నేతలను గ్రామస్థులు నిలదీస్తున్నారు. గ్రామసభలు చూస్తుంటే ఇది ముమ్మాటికీ ప్రజావ్యతిరేక పాలన అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
Tue, 21 Jan 202510:34 AM IST
- TG Panchayat Secretaries : తెలంగాణలో వేలాది మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. ఏ పథకం ప్రజలకు అందాలన్నా వీరి పాత్ర కీలకం. లబ్ధిదారుల ఎంపిక మొదలు.. గ్రామాల అభివృద్ధి వీరిపైనే ఆధారపడి ఉంది. అంతటి బాధ్యత కలిగిన కార్యదర్శులు ఇప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక సెలవులు పెట్టే ఆలోచన చేస్తున్నారు.
Tue, 21 Jan 202509:34 AM IST
- Fake Currency in Hundi : కామారెడ్డి జిల్లాలో దొంగనోట్లు కలకలం సృష్టించాయి. ఏకంగా ఆలయం హుండీలో ఫేక్ కరెన్సీ రావడంతో ప్రజలు, పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనుమానితులను ప్రశ్నించారు. గతంలోనూ కామారెడ్డి ప్రాంతంలో ఫేక్ కరెన్సీ పట్టుబడింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
Tue, 21 Jan 202509:03 AM IST
Etela Rajender : పోచారం మున్సిపాలిటీ పరిధిలో ల్యాండ్ బ్రోకర్ల ఆగడాలు మితిమీరిపోయాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల పేదల ఖాళీ స్థలాలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు... పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండలతో కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.
Tue, 21 Jan 202508:03 AM IST
- BJP Eetala Rajender: భూవివాదాల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెళ్లుమనిపించారు బీజేపీ నేత ఈటల రాజేందర్. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని పోచారం మునిసిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రోకర్లతో కుమ్మక్కైన అధికారులు స్థానికుల్ని వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు.
Tue, 21 Jan 202507:35 AM IST
- Target Maoists : మావోయిస్టులను పూర్తిగా ఏరివేయాలనే లక్ష్యంతో కేంద్రం అండుగులు వేస్తోంది. ముఖ్యంగా అమిత్ షా ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. దీంతో భద్రతా బలగాలు మావోయిస్టుల కోటల్లోకి దూసుకెళ్తున్నాయి. అన్ని దారుల్లో దగ్గరకు చేరుతున్నాయి. దీంతో వారు తమను ఎలా రక్షించుకుంటారనే చర్చ జరుగుతోంది.
Tue, 21 Jan 202505:47 AM IST
- Telangana Police : గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో గన్ కల్చర్ పెరుగుతోంది. ఈ కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయి. అటు పలు సంఘటనల్లో పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పోలీసులకు ఆయుధాలు ఇవ్వనున్నట్టు సమాచారం.
Tue, 21 Jan 202505:45 AM IST
TG New Ration Cards : తెలంగాణలో ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే జాబితాలు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. జాబితాల్లో తమ పేర్లు లేవని పలువులు ఆందోళన చెందుతున్నారు. నేటి నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
Tue, 21 Jan 202504:12 AM IST
- TG Inter Midday Meals : విద్య, వైద్యం, వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. తాజాగా దీనికి సంబంధించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటికి ఆమోదం లభిస్తే పథకం అమలు కానుంది.
Tue, 21 Jan 202502:12 AM IST
- HYD IT Raids: హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. జనవరి 21వ తేదీ మంగళవారం తెల్ల వారుజామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సినీ ప్రముఖులపై ఐటీ బృందాలు దాడులు జరిపాయి. సంక్రాంతికి విడుదలైన సినిమాలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Tue, 21 Jan 202501:34 AM IST
- Hyderabad Brutal Murder: హైదరాబాద్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి దారుణ హత్యకు గురైంది. ఇన్‌స్టాలో పరిచయమైన ఓ జంట మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆపై కుటుంబ పోషణ పట్టించుకోక పోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. భార్యపై అనుమానంతో 7నెలల గర్భిణీని అత్యంత కిరాతకంగా హతమార్చాడు