Telangana News Live January 19, 2025: Dy CM Bhatti Vikramarka : రేషన్ కార్డుల లబ్దిదారుల ఎంపిక గ్రామసభల్లోనే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 19 Jan 202505:02 PM IST
Dy CM Bhatti Vikramarka : ఈ నెల 26న మూడు పథకాలు ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులను జారీ చేస్తామన్నారు. లబ్దిదారులను గ్రామసభల్లో ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు.
Sun, 19 Jan 202504:14 PM IST
Investments In Hyderabad : హైదరాబాద్ లో రూ.450 కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి క్యాపిటల్యాండ్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం కుదిరింది.
Sun, 19 Jan 202511:32 AM IST
Sensor Siren Lock : చోరీలకు చెక్ పెట్టేలా రామగుండం కమిషనరేట్ పోలీసులు సెన్సార్ సైరన్ లాక్ అందుబాటులోకి తెచ్చారు. ఇళ్లకు తాళాలు వేసి బయటికి వెళ్లేవారు చోరీ జరగకుండా ఉండేందుకు సెన్సార్ సైరన్ లాక్ ఏర్పాటు చేస్తే చోరీలకు చెక్ పెట్టవచ్చని రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు.
Sun, 19 Jan 202511:18 AM IST
Khaki Kids : రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సరికొత్త కార్యకర్యక్రమానికి శ్రీకారం చుట్టారు.సైబర్ నేరాలను అరికట్టేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పిల్లల ద్వారా పెద్దలకు అవగాహన కల్పించే ఖాకీ కిడ్స్ కార్యక్రమం చేపట్టారు.
Sun, 19 Jan 202503:36 AM IST
- TG New Ration Card Applications: కొత్త రేషన్ కార్డుల జాబితాతో గందరగోళం నెలకొంది. చాలా మంది తమ పేర్లు లేవని వాపోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ఎలాంటి అపోహాలకు గురికావొద్దని… గ్రామసభల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పింది.
Sun, 19 Jan 202501:19 AM IST
- మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కరెంట్ షాక్ పెట్టి సొంత అన్ననే తమ్ముడు చంపేశాడు. వదినతో అక్రమ సంబంధమే ఇందుకు కారణమని పోలీసుల విచారణలో తేలిపింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా… రిమాండ్ కు తరలించారు.
Sun, 19 Jan 202511:50 PM IST
- రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రేషన్ కార్డుల ఎంపిక గ్రామాల్లో జరగాలన్నారు. కానీ కులగణన సర్వేను బేస్ చేసుకొని, ఆ లిస్టును మాత్రమే ప్రింట్ తీసి పంపడమేంటని ప్రశ్నించారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు రాకుండా కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.