Telangana News Live January 17, 2025: TG Nominated Posts : ఆశల పల్లకిలో 'హస్తం' నేతలు..! నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎప్పుడు..?-today telangana news latest updates january 17 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live January 17, 2025: Tg Nominated Posts : ఆశల పల్లకిలో 'హస్తం' నేతలు..! నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎప్పుడు..?

TG Nominated Posts : ఆశల పల్లకిలో 'హస్తం' నేతలు..! నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎప్పుడు..?

Telangana News Live January 17, 2025: TG Nominated Posts : ఆశల పల్లకిలో 'హస్తం' నేతలు..! నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎప్పుడు..?

03:36 PM ISTJan 17, 2025 09:06 PM HT Telugu Desk
  • Share on Facebook
03:36 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 17 Jan 202503:36 PM IST

తెలంగాణ News Live: TG Nominated Posts : ఆశల పల్లకిలో 'హస్తం' నేతలు..! నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎప్పుడు..?

  • TG Govt Nominated Posts : తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకుంది. అయితే క్షేత్రస్థాయిలోని చాలా మంది ముఖ్య నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమందికే అవకాశాలు దక్కగా… మరికొంత మంది నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కోరుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202503:24 PM IST

తెలంగాణ News Live: Fine On Kolors Health Care : బరువు తగ్గిస్తామని మోసం చేశారని యువతి ఫిర్యాదు, కలర్స్ సంస్థకు వినియోగదారుల కోర్టు జరిమానా

  • Fine On Kolors Health Care : కలర్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు జరిమానా విధించింది. బరువు, కొవ్వు తగ్గిస్తామంటూ కలర్స్ సంస్థ తనను మోసం చేసిందని ఓ యువతి ఫిర్యాదుతో కోర్టు ఈ సంస్థకు జరిమానా విధించింది.  

పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202502:50 PM IST

తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : గ్రామ‌సభ‌ల్లో ఇందిర‌మ్మ ల‌బ్దిదారుల జాబితాలు - వారికే తొలి ప్రాధాన్యం..!

  • అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు అందిస్తామని రాష్ట్ర గృహా నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ‌సభ‌ల్లో ఇందిర‌మ్మ ల‌బ్దిదారుల జాబితాలను ప్రకటిస్తామని తెలిపారు. సెక్రటేరియట్ లో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. పలు అంశాలపై ఆరా తీశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202511:18 AM IST

తెలంగాణ News Live: KTR Comments : రాజీనామా కాదు రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా.. కేటీఆర్ మాస్ కామెంట్స్

  • KTR Comments : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. చేవేళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202509:57 AM IST

తెలంగాణ News Live: Nalgonda Collector Tripathi : 100 మంది పంచాయతీ కార్యదర్శులకు షాక్..! నల్గొండ కలెక్టర్ సంచలన నిర్ణయం

  • నల్గొండ జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి పరుగులు పెట్టిస్తున్నారు. విధుల్లో ఆలసత్వాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలకు దిగుతున్నారు. తాజాగా పంచాయతీ కార్యదర్శల విధుల విషయంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. 100 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ ను బ్రేక్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202509:03 AM IST

తెలంగాణ News Live: TG Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీ ఆ రోజు నుంచే, అర్హులను గుర్తించే ప్రక్రియ వేగవంతం-బల్దియాలో దరఖాస్తులెన్నంటే?

  • TG New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చిన రేషన్ కార్డుల దరఖాస్తులను బల్దియా కమిషనర్ ఆధ్వర్యంలో 150 డివిజన్ల వారీగా అధికారులు పరిశీలించారు.  

పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202506:59 AM IST

తెలంగాణ News Live: TG Ration Cards : పాత రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఇబ్బంది లేదు!

  • TG Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీకి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత రేషన్ కార్డులను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పాత రేషన్ కార్డులను తొలగించబోమని స్పష్టం చేశారు. పదేళ్లుగా కొత్త కార్డులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202506:04 AM IST

తెలంగాణ News Live: Hyderabad Double Murder Case : జంట హత్య కేసులో సంచలన విషయాలు.. వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని..

  • Hyderabad Double Murder Case : హైదరాబాద్ నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగిందని అంతా భావించారు. కానీ.. పోలీసుల విచారణలో మరో కీలక విషయం తెలిసినట్టు సమాచారం. వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య చేసినట్టు తెలిసింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202505:39 AM IST

తెలంగాణ News Live: Vemulawada SivaDeeksha: వేములవాడలో శివదీక్షలు ప్రారంభం... శివమాల ధరించిన వందలాది మంది భక్తులు

  • Vemulawada SivaDeeksha: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. వందలాది మంది భక్తులు మండల దీక్ష 41 రోజుల శివ దీక్షా స్వీకరించిన శివన్నామ స్మరణలో నిమగ్నమయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202505:20 AM IST

తెలంగాణ News Live: Mahabubabad Crime : మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. మహిళను హత్యచేసి పాతిపెట్టి.. పక్కనే పొయ్యి పెట్టారు!

  • Mahabubabad Crime : మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను హత్య చేసి ఇంటిపక్కనే పాతిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా.. పేడతో అలికి పొయ్యి పెట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులకు విషయం తెలియడంతో.. నిందితులు పరారయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202504:39 AM IST

తెలంగాణ News Live: Hyderabad : మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ.. నగదు, బంగారు ఆభరణాలు మాయం!

  • Hyderabad : హైదరాబాద్‌లో మరో వీఐపీ ఇంట్లో దొంగతనం జరిగింది. మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో బంగారు ఆభరణాలు, డబ్బును దొంగలు దోచుకెళ్లారు. దీంతో ఆయన సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202504:18 AM IST

తెలంగాణ News Live: warangal RTC Income: సంక్రాంతి పండుగకు ఆర్టీసీకి కాసుల వర్షం, వారంలో వరంగల్ రీజియన్ కు రూ.16.47 కోట్ల ఆదాయం

  • warangal RTC Income: వరంగల్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కాసుల వర్షాన్ని కురిపించింది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో దాదాపు వారం రోజుల పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించగా.. గతంతో పోలిస్తే ఈసారి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202504:08 AM IST

తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : లక్షల్లో దరఖాస్తులు.. వేలల్లో ఇళ్లు.. మొదటి విడతలో ఎవరికి ఇస్తారు?

  • TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటు ప్రభుత్వం చెప్పిన డెడ్‌లైన్ కూడా దగ్గరపడింది. అధికారులు లబ్ధిదారులను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తులు లక్షల్లో ఉండగా, ఇళ్లు మాత్రం వేలల్లో ఉన్నాయి. దీంతో ఎవరికి ఇస్తారనే చర్చ నడుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202502:54 AM IST

తెలంగాణ News Live: Hyd Fire Accident: హైదరాబాద్‌ షేక్‌పేట జుహి ఫెర్టిలిటీ సెంటర్‌‌లో భారీ అగ్నిప్రమాదం

  • Hyd Fire Accident: హైదరాబాద్‌ షేక్‌పేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షేక్‌పేట ప్రధాన మార్గంలో ఉన్న  భారీ కాంప్లెక్స్‌ రెండో అంతస్తులో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఇవి మూడో అంతస్తుకు కూడా వ్యాపించడంతో భవనం అగ్ని కీలల్లో చిక్కుకుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202501:33 AM IST

తెలంగాణ News Live: TG Teachers Transfers: ఉపాధ్యాయ దంపతుల బదిలీలకు సీఎం అమోదం, డిఎస్సీ 2008 అభ్యర్థులకు టైమ్‌ స్కేల్ పోస్టింగ్

  • TG Teachers Transfers: తెలంగాణలో దంపతులైన ఉపాధ్యాయులకు సర్కారు తీపి కబురు చెప్పింది. జీవో నంబర్ 317తో నష్టపోయిన ఉపాధ్యాయులకు మేలు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. 2008డిఎస్సీ అభ్యర్థులకు టైమ్‌ స్కేల్‌తో ఉద్యోగాలు ఇస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 17 Jan 202512:23 AM IST

తెలంగాణ News Live: KoushikReddy: నేతల మధ్య మాటల యుద్ధం, కరీంనగర్ కోర్టుకు హాజరైన హుజురాబాద్ MLA కౌశిక్‌ రెడ్డి

  • KoushikReddy: బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు రాజకీయ దుమారం రేపుతుంది. కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేసులకు భయపడం, ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్‌ఎస్ చెబుతోంది. 
పూర్తి స్టోరీ చదవండి