Telangana News Live January 16, 2025: Nampally Numaish : నాంపల్లి నుమాయిష్ లో షాకింగ్ ఘటన- ప్రాణాలు అరచేతిలో, 25 నిమిషాలు తలకిందులుగా!
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 16 Jan 202505:02 PM IST
Nampally Numaish : నాంపల్లి నుమాయిష్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎగ్జిబిషన్ లో అమ్యూజ్మెంట్ రైడ్ బ్యాటరీ సమస్య కారణంగా 25 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో పర్యాటకులు 25 నిమిషాల పాటు తలకిందులగా ఉండిపోయారు.
Thu, 16 Jan 202504:21 PM IST
Hyderabad Gun Fire : హైదరాబాద్ లో బీదర్ దొంగల ముఠా రెచ్చిపోయింది. బీదర్ లో ఏటీఎం వ్యానుపై కాల్పులు జరిపి... ఆ డబ్బుతో హైదరాబాద్ వచ్చిన ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో దుండగలు మరోసారి కాల్పులకు తెగబడ్డారు.
Thu, 16 Jan 202501:55 PM IST
- రేవంత్ రెడ్డి కక్ష్యసాధింపు చర్యలో భాగంగానే తనపై కేసు నమోదైందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిపై ఏసీబీ, ఈడీ కేసు ఉంది కాబట్టే… తనపై కూడా ఏసీబీ, ఈడీ కేసులు పెట్టించారని ఆరోపించారు. ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫార్ములా ఈరేస్ కేసులో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదని స్పష్టం చేశారు.
Thu, 16 Jan 202501:10 PM IST
- కళల కాణాచి కరీంనగర్ కు మణిహారంగా మారాల్సిన మానేర్ రివర్ ఫ్రంట్ అధికారుల అలసత్వం, పాలకుల అనాలోచిత నిర్ణయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. పట్టించుకునేవారు కానరాక కమీషన్ ల దందాతో కూనరిల్లుతుంది. తీగల వంతెన పూరైనా... ప్రయోజనం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ పనులపై HT తెలుగు స్పెషల్ కథనం….
Thu, 16 Jan 202512:14 PM IST
- Formula-E race case Updates : ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ ను ఈడీ విచారించింది. దాదాపు ఏడు గంటలకుపైగా ప్రశ్నించింది. ప్రధానంగా నగదు బదిలీ చుట్టూనే దర్యాప్తు సంస్థ ప్రశ్నించినట్లు తెలిసింది.
Thu, 16 Jan 202511:19 AM IST
- TG student with Modi : తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థినికి అరుదైన అవకాశం వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన స్టూడెంట్ పీఎం మోదీతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రధానితో సంభాషించే అవకాశం ఇచ్చినందుకు విద్యార్థిని ఆనందం వ్యక్తం చేశారు. పరీక్షలపై మోదీతో చర్చించినట్టు చెప్పారు.
Thu, 16 Jan 202510:08 AM IST
- BRS to Supreme Court : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పంచాయితీ ఢిల్లీకి చేరింది. బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఏడుగులు ఎమ్మెల్యేలపై అనర్హతపై కారు పార్టీ అపెక్స్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావు హస్తినలోనే మకాం వేశారు.
Thu, 16 Jan 202509:07 AM IST
- TG Indiramma Atmiya Bharosa Scheme Updates : భూమిలేని నిరుపేద కూలీల కోసం తెలంగాణ సర్కార్ సరికొత్త స్కీమ్ ను పట్టాలెక్కించబోతుంది. ఇందిరమ్మ అత్మీయ భరోసా పేరుతో ప్రతి ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. అయితే ఈ స్కీమ్ కు సంబంధించిన అర్హులను గుర్తించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది.
Thu, 16 Jan 202508:10 AM IST
Hyderabad restaurant: హైదరాబాద్‌లోని ఒక రెస్టారెంట్‌లో అపరిశుభ్ర పద్ధతులపై ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఒకరికి సర్వ్ చేసిన ఉల్లిపాయలు, చట్నీలను ఇతరులకు సర్వ్ చేయడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.
Thu, 16 Jan 202506:32 AM IST
- KTR ED investigation : మాజీమంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ విచారణకు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఆఫీస్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
Thu, 16 Jan 202504:53 AM IST
- TGEMRS Admissions: తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
Thu, 16 Jan 202504:14 AM IST
- Formula E Car Race Case : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏం జరగబోతోందనే చర్చ జరుగుతోంది.
Thu, 16 Jan 202504:00 AM IST
- Karimnagar Crime: క్రిప్టో కరెన్సీ...ఈ కరెన్సీ గురించి ఏ మాత్రం తెలిసినా ముందుగా చెప్పేది బిట్ కాయిన్.. క్రిప్టో కరెన్సీ రూపంలో ఎన్ని కాయిన్లు చెలామణిలో ఉన్నాయో కూడా ఇప్పుడు మార్కెట్ లో ఉన్న వారికి తెలియదు. కేవలం బిట్ కాయిన్ ధర లక్షలకు చేరుకున్నదంటూ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు.
Thu, 16 Jan 202512:49 AM IST
- Rajanna Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూకబ్జాదారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ భూములను అక్రమంగా పొందిన వారు స్వచ్ఛందంగా సర్కార్ కు సరెండర్ చేస్తున్నారు. పండుగ పూట ఇద్దరు రైతులు గతంలో అక్రమంగా పొందిన భూమిని ప్రభుత్వానికి అప్పగించారు.