Telangana News Live January 15, 2025: ACB Trap : ఏసీబీకి చిక్కిన మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ - మరో ఇద్దరు కూడా అరెస్ట్-today telangana news latest updates january 15 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live January 15, 2025: Acb Trap : ఏసీబీకి చిక్కిన మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ - మరో ఇద్దరు కూడా అరెస్ట్

ACB Trap : ఏసీబీకి చిక్కిన మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ - మరో ఇద్దరు కూడా అరెస్ట్

Telangana News Live January 15, 2025: ACB Trap : ఏసీబీకి చిక్కిన మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ - మరో ఇద్దరు కూడా అరెస్ట్

04:51 PM ISTJan 15, 2025 10:21 PM HT Telugu Desk
  • Share on Facebook
04:51 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 15 Jan 202504:51 PM IST

తెలంగాణ News Live: ACB Trap : ఏసీబీకి చిక్కిన మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ - మరో ఇద్దరు కూడా అరెస్ట్

  • ఐదు వేలు లంచం తీసుకుంటు జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ అసిఫోద్దీన్ ఏసీబీ అధికారులకు చిక్కారు. సబ్ రిజిస్ట్రార్ తో పాటు ఔట్ సోర్సింగ్ అటెండర్ బాణోతు రవి కుమార్, డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవిని కూడా అరెస్టు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202504:26 PM IST

తెలంగాణ News Live: Supreme Court Collegium : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు ఆరుగురు కొత్త జడ్జీలు -సుప్రీం కొలీజియం సిఫార్సు

  •  ఏపీ, తెలంగాణ హైకోర్టులకు జడ్జిలుగా ఆరుగురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను సూచించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202503:34 PM IST

తెలంగాణ News Live: Khammam : ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆహుతైన పత్తి బస్తాలు

  • Khammam Cotton Market : ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మార్కెట్‌ యార్డ్ షెడ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల దాటికి 400కు పైగా పత్తి బస్తాలు దహనమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది… మంటలార్పుతుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202511:49 AM IST

తెలంగాణ News Live: BRS MLA Padi Kaushik Reddy : 'రేవంత్ రెడ్డే ఆదర్శం' - దాడి ఘటనపై వీడియో క్లిప్ విడుదల చేసిన పాడి కౌశిక్ రెడ్డి

  • BRS Padi Kaushik Reddy Attack Case : కరీంనగర్ జిల్లా సమావేశంలో తనపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ముందుగా సంజయ్ తనను నెట్టాడని.. ఆపై మానకొండూరు ఎమ్మెల్యే  కాలర్ పట్టుకుని లాగారని చెప్పారు. ఈ మేరకు వీడియో క్లిప్ విడుదల చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202511:09 AM IST

తెలంగాణ News Live: KTR Petition in Supreme Court : కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు - బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఏం చెప్పిందంటే…

  • KTR petition in Formula-E race case: కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని బీఆర్ఎస్ లీగల్ టీమ్ తెలిపింది. లీగల్ ఒపీనియన్ ప్రకారం విత్‌డ్రా చేసుకున్నట్లు ప్రకటించింది. ఏ కోర్టులో అయినా అప్పీల్ చేసుకునే అవకాశం ఉందిని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతల ప్రచారాన్ని ఖండించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202508:36 AM IST

తెలంగాణ News Live: TG Rythu Bharosa Scheme Survey : సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తారో తెలుసా..? ఈ 10 విషయాలు తెలుసుకోండి

  • తెలంగాణలో రైతు భరోసా  స్కీమ్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. అయితే సాగు యోగత్య లేని భూములకు పంట పెట్టుబడి సాయం దక్కదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాగు యోగ్యత ఉన్న వాటికే డబ్బులు అందుతాయని పేర్కొంది. అయితే సాగులో లేని భూముల గుర్తింపునకు సర్కార్ కార్యాచరణను సిద్ధం చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202507:51 AM IST

తెలంగాణ News Live: KTR Case : కేటీఆర్‌కు సుప్రీంకోర్టులోనూ దక్కని ఊరట.. క్వాష్‌ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన అత్యున్నత న్యాయస్థానం

  • KTR Case : సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు నిరాశే ఎదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో తమ క్వాష్‌ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. గురువారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202506:26 AM IST

తెలంగాణ News Live: Maha Kumbh Mela : మహా కుంభమేళా యాత్రలో విషాదం.. తెలంగాణ వ్యక్తి సజీవ దహనం.. 49 మందికి తప్పిన ప్రమాదం

  • Maha Kumbh Mela : మహా కుంభమేళా యాత్రలో విషాదం జరిగింది. తెలంగాణకు చెందిన వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మహా కుంభమేళా నుండి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న బస్సులో అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202504:01 AM IST

తెలంగాణ News Live: Warangal Crime : వరంగల్‌లో దొంగల బీభత్సం.. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా దొంగతనాలు!

  • Warangal Crime : పండగ పూట వరంగల్ జిల్లాలో వరుస దొంగతనాలు సంచలనంగా మారాయి. దీంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి ఊర్లకు వెళ్లిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస చోరీల నేపథ్యంలో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202502:37 AM IST

తెలంగాణ News Live: TG New Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 10 ముఖ్యమైన అంశాలు

  • TG New Ration Cards : సంక్రాంతి తరువాత గ్రామసభలు నిర్వహించి.. రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రస్తుతం కార్డుల్లో పేరు ఉన్న ఒక్కో లబ్ధిదారునికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందజేస్తామని స్పష్టం చేసింది. దీంతో లబ్ధిదారుల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202501:11 AM IST

తెలంగాణ News Live: Hyderabad Double Murder : హైదరాబాద్ డబుల్ మర్డర్ కేసులో కీలక అప్‌డేట్.. వారిద్దరు అక్కడికి ఎందుకొచ్చారు?

  • Hyderabad Double Murder : హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో డబుల్ మర్డర్ బాధితులను పోలీసులు గుర్తించారు. ఈ హత్య ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని తెలిసినవారే హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అసలు వారిద్దరు అక్కడి ఎందుకొచ్చారనే కోణంలో విచారణ చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి