Telangana News Live January 11, 2025: Game Changer : గేమ్ ఛేంజర్ కు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్- స్పెషల్ షోలు, టికెట్ల ధరల పెంపు నిర్ణయం వెనక్కి
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 11 Jan 202505:04 PM IST
Game Changer : గేమ్ ఛేంజర్ తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ షోలు, ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Sat, 11 Jan 202503:45 PM IST
CM Revanth Reddy : రాష్ట్రంలో మద్యం సరఫరాకు ముందుకు వచ్చే కంపెనీల ఎంపికకు పారదర్శక విధానం అమలుచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేట్ల విషయంలో కంపెనీ ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
Sat, 11 Jan 202512:10 PM IST
Mlc Election : ఉత్తర తెలంగాణలో త్వరలో పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఉత్తర తెలంగాణలో విజయంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.
Sat, 11 Jan 202509:27 AM IST
Siddipet News : సిద్దిపేట జిల్లాలో ఘోర విషాద ఘటన జరిగింది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈతకు వెళ్లి ఐదుగురు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
Sat, 11 Jan 202508:08 AM IST
- Hyderabad Durgam Cheruvu : రాబోయే నాలుగు నెలల్లోనే దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ వివాదానికి తెర దించుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఎఫ్టీఎల్ తో పాటు బఫర్ జోన్ ను కూడా ఫిక్స్ చేస్తామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు.
Sat, 11 Jan 202505:39 AM IST
- Young Couple Suicide in Sangareddy :సంగారెడ్డి జిలాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువజంట ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న మునిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sat, 11 Jan 202502:50 AM IST
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెయ్యికి పైగా ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురయ్యింది. ఇప్పటికే 250 ఎకరాలను అధికారులు గుర్తించారు. ఐదు కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో 12 మందిపై ఫిర్యాదులు అందగా అక్రమంగా పొందిన భూమిని ఇద్దరు స్వచ్చంధంగా ప్రభుత్వానికి సరెండర్ చేశారు.