తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live January 10, 2025: Vemulawada : చిన్నారి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు - ముగ్గురు మహిళలు అరెస్ట్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 10 Jan 202504:11 PM IST
తెలంగాణ News Live: Vemulawada : చిన్నారి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు - ముగ్గురు మహిళలు అరెస్ట్
- ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో నాలుగేళ్ళ చిన్నారి మిస్సింగ్ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. మహబూబాబాద్ కు చెందిన ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. చిన్నారిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్ౕ మహాజన్ వెల్లడించారు.
Fri, 10 Jan 202501:02 PM IST
తెలంగాణ News Live: Telangana Govt : కేసుల ఎత్తివేత, ఉచితంగా సోలార్ పంపు సెట్లు - ఆదివాసీలపై సీఎం రేవంత్ వరాల జల్లు
- ఆదివాసీలపై పెట్టిన ఉద్యమ కేసులు ఎత్తివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.ఆదివాసీ విద్యార్థులకు వంద శాతం ఓవర్‌షిప్ స్కాలర్‌షిప్‌లు ఇస్తామన్నారు. ప్రతి నాలుగు నెలలకోసారి నాయకులతో సమావేశం ఉంటుందని.. సాగుకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు అందజేస్తామని చెప్పారు.
Fri, 10 Jan 202510:18 AM IST
తెలంగాణ News Live: TGSRTC : పండగ వేళ అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ - ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు హెచ్చరికలు
- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు తెలంగాణ ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. పండగ వేళ ప్రయాణికుల వద్ద అదనపు చార్జీలు వసూలు చేయవద్దన్నారు. అలా చేసే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తపవన్నారు.
Fri, 10 Jan 202508:57 AM IST
తెలంగాణ News Live: Hyderabad RRR : ఓఆర్ఆర్ - రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో రేడియల్ రోడ్ల నిర్మాణం... ఆ పరిశ్రమలన్నీ అక్కడే - సీఎం రేవంత్
- ఔటర్ రింగ్ రోడ్డుకు రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యన రేడియల్ రోడ్లను నిర్మించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. రీజినల్ రింగ్ రోడ్ చుట్టూ తయారీ పరిశ్రమ, మార్కెటింగ్ కు అవసరమైన కేంద్రీకృత ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నది తమ ఉద్దేశ్యమని చెప్పారు.
Fri, 10 Jan 202503:55 AM IST
తెలంగాణ News Live: Bus Accident: సూర్యాపేటలో ఘోర ప్రమాదం, ఇసుక లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, నలుగురు మృతి
- Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒడిస్సా నుంచి ప్రయాణికులతో వస్తున్న ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందగా 17మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిద్ర మత్తు, పొగమంచుతో ఈ ప్రమాదం జరిగింది.
Fri, 10 Jan 202512:54 AM IST
తెలంగాణ News Live: Mohan Babu: సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట... కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశం
- Mohan Babu: జర్నలిస్ట్ పై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.జర్నలిస్టుపై దాడి కేసులో తదుపరి విచారణ వరకు పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గతేడాది డిసెంబర్ 10న జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్ దాడి కేసులో ఊరట లభించింది.
Fri, 10 Jan 202512:24 AM IST
తెలంగాణ News Live: Bandi Sanjay: ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలి: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
- Bandi Sanjay: ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫీజు బకాయిలను వన్‌టైం సెటిల్‌మెంట్ పద్ధతిలో క్లియర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం సిగ్గు చేటన్నారు.
Fri, 10 Jan 202512:06 AM IST
తెలంగాణ News Live: TG Rythu Bharosa Scheme : రైతు భరోసాకు 'సీలింగ్' విధిస్తారా..? సర్కార్ ఏం చేయబోతుంది..?
- Telangana Rythu Bharosa Scheme : జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా స్కీమ్ అమలు కానుంది. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోగా… అధికారికంగా మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. అయితే రైతు భరోసాకు సీలింగ్ విధిస్తారా..? లేదా..? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.