Telangana News Live January 1, 2025: Ramagundam Crime : రామగుండంలో కత్తిపోట్ల కలకలం, అక్రమ సంబంధం అనుమానంతో హత్యాయత్నం
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 01 Jan 202505:28 PM IST
Ramagundam Crime : పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో అనుమానం పెనుభూతమయింది. అక్రమ సంబంధం ప్రాణాల మీదికి తెచ్చింది. మాట్లాడే పనుందని పిలిచి భార్య మేనమామను తల్వార్ తో నరికాడు. మీ మామను చంపేశారని భార్యకు ఫోన్ చేశాడు.
Wed, 01 Jan 202504:04 PM IST
TGB Guidelines : తెలంగాణలోని ఏపీజీవీబీ శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంకుల విలీనం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీజీవీబీ ఖాతాదారులకు టీజీబీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏటీఎమ్ కార్డు, చెక్ బుక్ లు, ఆన్ లైన్ సేవలపై గైడ్ లైన్స్ విడుదల చేసింది.
Wed, 01 Jan 202501:54 PM IST
Fake Certificates : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టైంది. ఈ ముఠాలోని ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్ల తయారి సూత్రధారి రిటైర్డ్ టీచర్ కావడం విశేషం.
Wed, 01 Jan 202512:24 PM IST
Medchal Shamirpet Metro : మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో పొడిగింపునకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్యారడైజ్-మేడ్చల్ (23 కి.మీ),జేపీఎస్-శామీర్ పేట్(22 కి.మీ) మెట్రో కారిడార్లకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ రెండు కారిడార్లకు డీపీఎస్ సిద్ధం చేయాలని ఆదేశించింది.
Wed, 01 Jan 202510:07 AM IST
AP TG Liquor Sales : న్యూ ఇయర్ వేడుకల పేరిట తెలుగు రాష్ట్రాల మందుబాబు రూ.కోట్ల మద్యం ఊదేశారు. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే రూ.520 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగ్గా, ఏపీలో రూ.113 కోట్ల విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.
Wed, 01 Jan 202509:22 AM IST
Karimnagar Cyber Crime : సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి కరీంనగర్ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. అధిక ప్రొఫిట్ ఆశ చూపి పెట్టుబడి పెట్టించిన సైబర్ నేరగాళ్లు చివరికి అకౌంట్ ఖాళీ చేశారు. ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం అవుతుందోనన్న భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Wed, 01 Jan 202507:51 AM IST
- Drink and Drive Cases : హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి.మరోవైపు పోలీసులు మాత్రం.. మందుబాబుల ఆట కట్టించారు. చాలాచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఏకంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో 619 కేసులు నమోదయ్యాయి.
Wed, 01 Jan 202505:51 AM IST
- ఈ న్యూ ఇయర్ వేళ అరుణాచలం వెళ్లేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనున్నారు. బస్సు జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ జనవరి 10, 2025వ తేదీన అందుబాటులో ఉంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.
Wed, 01 Jan 202502:16 AM IST
- Telangana MLC Elections 2025 : ఉత్తర తెలంగాణలో త్వరలో గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు (నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్) జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితాలను అధికారులు విడుదల చేశారు. పట్టభద్రుల ఓటర్లు 3,41,313గా, టీచర్లు 25,921 ఓటర్లుగా ఉన్నారు.
Wed, 01 Jan 202501:32 AM IST
- TG Indiramma Housing Survey Updates: ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. సంక్రాంతిలోపు సర్వే పూర్తవుతుంది. ఆ తర్వాతే అర్హుల జాబితాను ప్రకటించనున్నారు. ఇందులో ఇందిరమ్మ కమిటీలతో పాటు గ్రామసభల పాత్ర కీలకంగా ఉండే అవకాశం ఉంది. 10 ముఖ్యమైన అంశాలను ఇక్కడ చూడండి...