Telangana News Live February 7, 2025: TG MLC Elections 2025 : ఎమ్మెల్సీ నామినేషన్లకు దగ్గరపడిన గడువు - భారీగా నామినేషన్లు దాఖలు-today telangana news latest updates february 7 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live February 7, 2025: Tg Mlc Elections 2025 : ఎమ్మెల్సీ నామినేషన్లకు దగ్గరపడిన గడువు - భారీగా నామినేషన్లు దాఖలు

TG MLC Elections 2025 : ఎమ్మెల్సీ నామినేషన్లకు దగ్గరపడిన గడువు - భారీగా నామినేషన్లు దాఖలు

Telangana News Live February 7, 2025: TG MLC Elections 2025 : ఎమ్మెల్సీ నామినేషన్లకు దగ్గరపడిన గడువు - భారీగా నామినేషన్లు దాఖలు

Updated Feb 07, 2025 09:13 PM ISTUpdated Feb 07, 2025 09:13 PM IST
  • Share on Facebook
Updated Feb 07, 2025 09:13 PM IST
  • Share on Facebook

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 07 Feb 202503:43 PM IST

తెలంగాణ News Live: TG MLC Elections 2025 : ఎమ్మెల్సీ నామినేషన్లకు దగ్గరపడిన గడువు - భారీగా నామినేషన్లు దాఖలు

  • ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదో రోజు పట్టభద్రుల స్థానానికి 28 మంది, టీచర్ల స్థానానికి ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. ఇక నామినేషన్ల స్వీకరణకు ఒక్కరోజు సోమవారం మాత్రమే గడువు ఉంది. చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202502:05 PM IST

తెలంగాణ News Live: TG New Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ - ఇకపై మీసేవాలో కూడా అప్లయ్ చేసుకోవచ్చు, తాజా ప్రకటన ఇదే

  • తెలంగాణ రేషన్ కార్డు దరఖాస్తులపై కీలక అప్డేట్ వచ్చేసింది. నూతన రేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పాత రేషన్ కార్డుల్లో మార్పులు,చేర్పులకు కూడా అవకాశం కల్పించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ వివరాలను పేర్కొంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202501:07 PM IST

తెలంగాణ News Live: Telangana : మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా...! సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదని సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. కేబినెట్ లో ఎవరెవరు ఉండాలనే దానిపై అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పుకొచ్చారు. కసరత్తు కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202511:50 AM IST

తెలంగాణ News Live: TGSRTC : సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ.. చర్చలకు ఆహ్వానించిన కార్మిక శాఖ!

  • TGSRTC : తమ డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ.. ఇటీవల సమ్మె నోటీసు ఇచ్చింది. దాదాపు 10 రోజుల తర్వాత దీనిపై కార్మిక శాఖ స్పందించింది. ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించింది. అయితే.. ఈ చర్చలకు ఆర్టీసీ జేఏసీ నాయకులు వెళ్తారా లేదా అన్నది వేచి చూడాలి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202510:21 AM IST

తెలంగాణ News Live: Kisan Agri Show 2025 : తెలంగాణలోనే అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన.. ప్రారంభించిన మంత్రి తుమ్మల

  • Kisan Agri Show 2025 : కిసాన్ అగ్రి షో 2025ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగునుంది. వ్యవసాయ రంగ ప్రముఖులు, రైతులు, ఆవిష్కర్తలు దీంట్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202509:09 AM IST

తెలంగాణ News Live: Sleep Treatment Center : హైదరాబాద్ లో ‘నిద్ర చికిత్సా కేంద్రం’ - తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారి, ఇవిగో ప్రత్యేకతలు

  • Sleep Treatment Center in Hyderabad : హైదరాబాద్ వేదికగా నిద్ర చికిత్సా కేంద్రం ఏర్పాటైంది. ఈ తరహా సేవలు ప్రారంభం కావటం తెలుగు రాష్ట్రాల్లోనే ఇదే మొదటిసారి అని నిర్వాహకులు తెలిపారు. మొదటి శాఖ జూబ్లీ హిల్స్‌లో ఉండగా… రెండో బ్రాంచ్ కూకట్‌పల్లిలో ప్రారంభమైంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202507:56 AM IST

తెలంగాణ News Live: Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎఫెక్ట్.. ఉపాధి హామీ జాబ్ కార్డుల జారీకి బ్రేక్!

  • Indiramma Atmiya Bharosa : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. వాటిల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఒకటి. ఈ పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతుంది. అయితే.. ఈ పథకం ప్రభావం ఉపాధి హామీ జాబ్ కార్డుల జారీపై పడింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202507:17 AM IST

తెలంగాణ News Live: TG Agriculture : తెలంగాణలో వరిసాగు గణనీయంగా పెరగడానికి కారణాలు ఏంటి?

  • TG Agriculture : గతంలో తెలంగాణలో వరిసాగు చాలా తక్కువగా ఉండేది. దానికి కారణం నీటి ఎద్దడి, కరెంట్ కోతలు, పెట్టుబడి భారం. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. వరిసాగు చేస్తే ఉరే అనే పరిస్థితి నుంచి.. వరిసాగు బహుబాగు అనే పరిస్థితి వచ్చింది. ఇంతలా మార్పు రావడానికి కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202505:54 AM IST

తెలంగాణ News Live: Teenmar Mallanna : బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా.. తీన్మార్ మల్లన్న ఫైర్!

  • Teenmar Mallanna : టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ.. తీన్మార్ మల్లన్నకు షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఆయన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. బీసీ సమాజంతో మాట్లాడి నోటీసులపై సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు తీన్మార్ మల్లన్న.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202504:29 AM IST

తెలంగాణ News Live: TGRTC Strike: సమ్మెకు సిద్ధం అంటున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు... ఈనెల 9నుంచి ఆందోళనలకు ప్రణాళికలు

  • TGRTC Strike: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అంటున్నారు. ఫిబ్రవరి 9నుంచి ఆందోళనలకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202504:19 AM IST

తెలంగాణ News Live: Navodaya Entrance: సిద్దిపేట జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష: 10 కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు

  • Navodaya Entrance: జవహ‍ర్‌ నవోదయ విద్యాలయాల్లో 9,11వ తరగతుల్లో ప్రవేశ పరీక్షలు ఫిబ్రవరి 8న జరుగనుండటంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  సిద్ధిపేటలో ప్రవేశపరీక్ష జరిగే పది కేంద్రాల్లో 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202504:07 AM IST

తెలంగాణ News Live: TG Electricity Consumption : తెలంగాణలో విద్యుత్ వినియోగం ఎందుకు పెరుగుతోంది.. 10 ముఖ్యమైన అంశాలు

  • TG Electricity Consumption : ప్రతి ఏడాది ఎండాకాలంలో విద్యుత్ వినియోగం పెరగడం సాధారణమే. కానీ ఈసారి వేసవి రాకముందే.. తెలంగాణలో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202503:19 AM IST

తెలంగాణ News Live: TG Group1 Results: ఫిబ్రవరిలోనే తెలంగాణ గ్రూప్‌ 1 ఫలితాలు విడుదల, ఏర్పాట్లు చేస్తోన్న టీజీపీఎస్సీ

  • TG Group1 Results: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న గ్రూప్ 1 ఫలితాల విడుదలకు గడువు దగ్గర పడుతోంది. ఏప్రిల్‌లోపు పెండింగ్‌ నోటిఫికేషన్లకు నియామక ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలను ఫిబ్రవరిలోనే విడుదల చేయనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202502:08 AM IST

తెలంగాణ News Live: Kaleswaram: దక్షిణ కాశీ.. ‘కాళేశ్వరం’లో మహా కుంభాభిషేకం, 42 ఏండ్ల తర్వాత జరుగుతున్న పూజలు

  • Kaleswaram: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం మహత్తర ఘట్టానికి సిద్ధమైంది. శుక్రవారం నుంచి కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం జరగనుంది. ఈ నెల 7న మాఘశుద్ధ దశమి శుక్రవారం నుంచి మాఘ శుద్ధ ద్వాదశి 9వ తేదీ ఆదివారం వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడ జరగనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202501:45 AM IST

తెలంగాణ News Live: Hyd To Vja: రూ.99కే హైదరాబాద్‌ - విజయవాడ మధ్య బస్సు ప్రయాణం, ఫ్లిక్స్‌ బస్సులో లాంచింగ్ ఆఫర్

  • Hyd To Vja: హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణాన్ని రూ.99కే అందిస్తున్నట్టు ఫ్లిక్స్‌ బస్ సర్వీసెస్ ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లో ఫ్లిక్స్‌ సర్వీసుల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నాలుగు వారాల పాటు లాంచింగ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202512:29 AM IST

తెలంగాణ News Live: Karimnagar Crime: వివాహేతర సంబంధంతో మహిళ సుపారీ హత్య... ఐదుగురిని అరెస్టు చేసిన కరీంనగర్ పోలీసులు

  • Karimnagar Crime: అక్రమ సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. పసి బాలుడిని తల్లి లేని వాడిలా మార్చింది. సోదరుడితో మరో మహిళ వివాహేతర సంబంధానికి చెక్ పెట్టేందుకు సోదరి ఆడిన నాటకంతో ఐదుగురు కటకటాల పాలయ్యారు. మంచిర్యాల నర్సింగ్ విద్యార్ధిని మమత మర్డర్ కేసు మిస్టరీ వీడింది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202512:19 AM IST

తెలంగాణ News Live: Mlc Nominaions: ఉత్తర తెలంగాణలో జోరుగా ఎమ్మెల్సీ నామినేషన్లు, 4 రోజుల్లో 28 మంది నామినేషన్లు…

  • Mlc Nominaions: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నాలుగు రోజుల్లో 28 మంది నామినేషన్ లు దాఖలు చేశారు. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానానికి 21 మంది, టీచర్ల స్థానానికి ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి