Telangana News Live February 3, 2025: TG Mlc Election Nominations : ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలు, తొలి రోజు 9 మంది నామినేషన్ లు దాఖలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 03 Feb 202505:04 PM IST
TG Mlc Election Nominations : ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు పట్టభద్రుల స్థానానికి ఆరుగురు, టీచర్ల స్థానానికి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
Mon, 03 Feb 202502:17 PM IST
Chevella Mla Gunman : చేవెళ్ల ఎమ్మెల్యే గన్ మెన్ శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి బంధువు ఇంటి నుంచి వస్తున్న క్రమంలో అడవి పందిని ఢీకొని బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Mon, 03 Feb 202501:57 PM IST
Mastan Sai : హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తాము విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200లకు పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని లావణ్య ఆరోపిస్తుంది.క
Mon, 03 Feb 202512:36 PM IST
- TG Caste Survey : తెలంగాణలో కుల గణనపై పొలిటికల్ పంచ్‌లు పేలుతున్నాయి. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంటే.. హస్తం పార్టీపై గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని విమర్శలు గుప్పించారు.
Mon, 03 Feb 202511:18 AM IST
Mlc Mallanna On Caste Census : కులగణన సర్వేపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సర్వే బోగస్ అన్నారు. ఇది జానారెడ్డి సర్వే అంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ సర్వేనే 100 శాతం కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించారు.
Mon, 03 Feb 202510:24 AM IST
- Telangana By Elections : కేటీఆర్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Mon, 03 Feb 202509:38 AM IST
Producer KP Chowdary : కబాలి తెలుగు వర్షన్ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక కారణాలు, డ్రగ్స్ కేసు ఆయన సూసైడ్ కు కారణాలుగా తెలుస్తున్నాయి.
Mon, 03 Feb 202509:07 AM IST
TG EAPCET 2025 : తెలంగాణ ఈఏపీసెట్-2025 షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 22 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. మే, ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు.
Mon, 03 Feb 202508:14 AM IST
- TG Caste Survey : తెలంగాణ ప్రభుత్వం దాదాపు 50 రోజుల పాటు కులగణన సర్వే చేపట్టింది. దీన్ని రేవంత్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Mon, 03 Feb 202506:40 AM IST
- Telangana Politics : ఎమ్మెల్యేల పార్టీ ఫిర్యాయింపుల అంశం మరో మలుపు తిరిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణను వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపింది.
Mon, 03 Feb 202505:49 AM IST
- Hyderabad Police : అమాయకుల ఆర్థిక అవసరాలు.. సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. రోజురోజుకూ లోన్ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిల్లో చాలా ఫేక్ యాప్స్ ఉన్నాయి. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా రుణాలు ఇస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. వాటిని నమ్మి జనం మోసపోతున్నారు.
Mon, 03 Feb 202503:25 AM IST
- Medak Father: కొడుకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోతుంటే వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా ప్రవాహంలో ఈదుతూ ఒడ్డుకు చేర్చిన ఘటన మెదక్‌లో ఆదివారం జరిగింది. ప్రాణాపాయం నుంచి కుమారుడిని రక్షించిన ఘటన మెదక్‌లోని అక్బర్ పేట-భూంపల్లి మండలంలో జరిగింది.
Mon, 03 Feb 202502:48 AM IST
- AP TG MLC Elections: ఏపీ, తెలంగాణల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.ఏపీలో 3, తెలంగాణలో మూడు స్థానాలకు గత వారం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ స్థానాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.
Mon, 03 Feb 202501:11 AM IST
- Basasra Devotees: వసంత పంచమి సందర్భంగా చదువుల తల్లి సరస్వతి కొలువైన బాసర పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రారంభమైన దర్శనాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. .