Telangana News Live February 2, 2025: Cyber Crime : న్యూడ్ కాల్స్, క్యూ ఆర్ కోడ్, చైన్ స్కీమ్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి -మెదక్ ఎస్పీ
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 02 Feb 202505:07 PM IST
Cyber Crime : రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. న్యూడ్ కాల్స్, క్యూ ఆర్ కోడ్, చైన్ స్కీం నేరాల పైన అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Sun, 02 Feb 202504:45 PM IST
TG Panchayat Elections : ఫిబ్రవరి 15లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కులగణన సర్వే రిపోర్ట్ సిద్ధం కావడంతో కేబినెట్ లో చర్చించి రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అనంతరం పంచాయతీ ఎన్నికలకు వెళ్లనుందని సమాచారం.
Sun, 02 Feb 202503:27 PM IST
CPM on Budget : బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం నేత చుక్కా రాములు విమర్శించారు. ఇద్దరు కేంద్రమంత్రులతో సహా 8 మంది బీజేపీ ఎంపీలున్నా రాష్ట్రానికి నిధులు రాబట్టలేకపోయారని విమర్శలు చేశారు
Sun, 02 Feb 202512:50 PM IST
TG Caste Census : తెలంగాణ కుల గణన సర్వే నివేదికను ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించింది. రాష్ట్రంలో 46.25 శాతం మంది బీసీలు ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కులగణన సర్వే దేశానికే దిక్సూచి అవుతుందన్నారు.
Sun, 02 Feb 202512:18 PM IST
- TG congress MLA House : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా మారారు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి 10 మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారని.. రెండోది ఆయన ఇంటికి సంబంధించిన అంశం. అవును.. ఇప్పుడు ఆయన ఇంటి వీడియో వైరల్ అవుతోంది.
Sun, 02 Feb 202511:48 AM IST
Fake Journalists : నల్గొండ జిల్లాలో నకిలీ విలేకరుల ముఠా రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో నెటిగివ్ వార్తలు రాస్తామని సీఐని బెదిరించారు. వేధింపులు ఎక్కువవ్వడంతో సీఐ తన స్నేహితుడి ద్వారా రూ. 1.10 లక్షలు ఇచ్చారు. అప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sun, 02 Feb 202511:17 AM IST
Gachibowli Gun Fire : గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు బత్తుల ప్రభాకర్ గదిలో మూడో గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద 460 బుల్లెట్లు గుర్తించారు.
Sun, 02 Feb 202510:07 AM IST
- Telangana Congress : కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి వేరే వాళ్లు అవసరం లేదు.. ఆ పార్టీ వారే చాలు.. అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అది వారికున్న అనుభవమో.. అంతకు ముందు జరిగిన పరిణామాలో తెలియదు. కానీ.. తాజా పరిస్థితి చూస్తుంటే ఇదే నిజమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Sun, 02 Feb 202508:09 AM IST
- Hyderabad Traffic : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు అంతాఇంతా కాదు. ట్రాఫిక్ నుంచి తప్పుంచుకొని స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లడం సవాలుగా మారుతోంది. మళ్లీ సాయంత్రం ఇంటికి తిరిగి చేరడం కష్టంగా ఉంటోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Sun, 02 Feb 202507:15 AM IST
- New Osmania General Hospital in Hyderabad : నయా ఉస్మానియా దవాఖానకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవలనే గోషామహాల్ వేదికగా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. వచ్చే వందేళ్లకు సేవలందించేలా ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ కొత్త ఆస్పత్రి విశేషాలు, ప్రత్యేకతలెంటో ఇక్కడ తెలుసుకోండి…
Sun, 02 Feb 202506:22 AM IST
- వసంత పంచమి వేడుకలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం సిద్ధమయ్యింది. మహాసరస్వతి అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసానికి, పుస్తక పూజలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భక్తుల తాకిడి మొదలైంది. మరోవైపు సిద్ధిపేట జిల్లాలోని వర్గల్ సరస్వతి ఆలయంలోనూ భక్తుల రద్దీ పెరిగింది.
Sun, 02 Feb 202506:20 AM IST
- Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయం పెరుగుతుందని ఆశించింది. కానీ ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఇళ్లకు కేటాయింపులు తగ్గాయి. ఈ ప్రభావం తెలంగాణ ఇందిరమ్మ ఇండ్ల పథకంపై పడనుంది.
Sun, 02 Feb 202505:23 AM IST
- Telangana Congress MLAS Meeting : ఎమ్మెల్యేల భేటీ అంశం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ భేటీలో తాను పాల్గొనట్లు వస్తున్న వార్తలపై వరంగల్ సిటీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sun, 02 Feb 202504:58 AM IST
- BRS vs Congress : కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. అన్నపూర్ణ తెలంగాణను.. ఆత్మహత్యల తెలంగాణ చేశారని విమర్శించారు. గతంలో కేసీఆర్ రైతులకు భరోసా ఇస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో బజారునపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఓ వర్గం సంతోషంగా లేదని ఆరోపించారు.
Sun, 02 Feb 202502:40 AM IST
- తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఉపాధి సబ్సిడీ రుణాలను అందించనుంది. ఎంపికైన వారికి వంద శాతం సబ్సిడీ వస్తుంది. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం ఫిబ్రవరి 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Sun, 02 Feb 202501:49 AM IST
- Union Budget 2025-2026 : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో తెలంగాణకు ఏ మాత్రం ప్రాధాన్యం దక్కలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిందని… అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ చెబుతున్నాయి. బడ్జెట్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Sun, 02 Feb 202501:13 AM IST
- కరీంనగర్ లో పీజీ మెడికల్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. హాస్టల్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తోటి వైద్య విద్యార్థి వేధింపులే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రతిమ మెడికల్ కాలేజీలో సంచలనంగా మారింది.