Telangana News Live February 19, 2025: Layout Regularization Scheme : ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, మార్చి 31 లోపు ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 19 Feb 202504:26 PM IST
Layout Regularization Scheme : లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 లోపు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. 10 శాతం ప్లాట్లు రిజిస్టరైన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
Wed, 19 Feb 202502:21 PM IST
Vemulawada Special Buses : మహాశివరాత్రికి వేళయింది. ఈనెల 26న జరిగే మహాశివరాత్రి సందర్బంగా వేములవాడకు భారీగా భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ వేములవాడతోపాటు శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించింది.
Wed, 19 Feb 202512:18 PM IST
- సిరిసిల్లలో కేటీఆర్ టీ స్టాల్ వివాదాస్పదంగా మారింది. అధికారులకు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఆందోళనకు దారి తీసింది. కలెక్టర్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా రాజకీయానికి తెర లేచింది.కేటీఆర్ పేరు ఉంటే టీ స్టాల్ బంద్ చేయించడమేంటని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Wed, 19 Feb 202512:12 PM IST
KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో ఉపఎన్నికలు రాబోతున్నాయని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోయిందని తెలిపారు.
Wed, 19 Feb 202511:38 AM IST
- వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పార్టీ నేతలు పని చేయాలని సూచించారు. పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి హాజరైన కేసీఆర్… ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టాలని సూచించారు.
Wed, 19 Feb 202509:20 AM IST
Karimnagar Land Mafia : కరీంనగర్ లో ల్యాండ్ మాఫియా, భూ ఆక్రమణదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ కు వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టారు. కట్టరాంపూర్ లో తప్పుడు పత్రాలతో భూమిని విక్రయించిన కేసులో నలుగురిని అరెస్టు చేశారు.
Wed, 19 Feb 202508:06 AM IST
- మహాశివరాత్రికి వేళయింది. ఈనెల 26న జరిగే మహాశివరాత్రి సందర్బంగా వేములవాడకు భారీగా భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ వేములవాడ తోపాటు శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించింది.
Wed, 19 Feb 202506:40 AM IST
- TGSRTC Discount Offer: హైదరాబాద్ - విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రూట్‌లో ప్రయాణించే వారికోసం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Wed, 19 Feb 202503:35 AM IST
- Medak Murder: మెదక్‌లో దారుణ హత్య జరిగింది. ప్రమాదవశాత్తూ గాయపడి, మంచాన పడిన భర్తకు వైద్యం చేయించడం ఖర్చుతో కూడిన పనిగా భావించిన భార్య.. అల్లుడితో కలిసి ఉరేసి చంపేసింది. అంత్యక్రియల్లో మెడపై గాయాలు గుర్తించిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.
Wed, 19 Feb 202502:42 AM IST
- TG Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల జారీ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో త్వరలో రేషన్ కార్డుల జారీ చేపట్టాలని సీఎస్ జిల్లా అధికారుల్ని ఆదేశించారు.