Telangana News Live February 14, 2025: Gangula Kamalakar : సమగ్ర కుటుంబ సర్వే ముసాయిదాను బయటపెట్టండి, మళ్లీ రీసర్వే చేయాల్సిందే- గంగుల కమలాకర్ డిమాండ్-today telangana news latest updates february 14 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live February 14, 2025: Gangula Kamalakar : సమగ్ర కుటుంబ సర్వే ముసాయిదాను బయటపెట్టండి, మళ్లీ రీసర్వే చేయాల్సిందే- గంగుల కమలాకర్ డిమాండ్

Gangula Kamalakar : సమగ్ర కుటుంబ సర్వే ముసాయిదాను బయటపెట్టండి, మళ్లీ రీసర్వే చేయాల్సిందే- గంగుల కమలాకర్ డిమాండ్

Telangana News Live February 14, 2025: Gangula Kamalakar : సమగ్ర కుటుంబ సర్వే ముసాయిదాను బయటపెట్టండి, మళ్లీ రీసర్వే చేయాల్సిందే- గంగుల కమలాకర్ డిమాండ్

Updated Feb 14, 2025 11:12 PM ISTUpdated Feb 14, 2025 11:12 PM IST
  • Share on Facebook
Updated Feb 14, 2025 11:12 PM IST
  • Share on Facebook

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 14 Feb 202505:42 PM IST

తెలంగాణ News Live: Gangula Kamalakar : సమగ్ర కుటుంబ సర్వే ముసాయిదాను బయటపెట్టండి, మళ్లీ రీసర్వే చేయాల్సిందే- గంగుల కమలాకర్ డిమాండ్

  • Gangula Kamalakar : కాంగ్రెస్ కులగణన పేరిట బీసీలను మోసం చేసే కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ కాదు...చట్టబద్దతతో కూడిన రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202505:23 PM IST

తెలంగాణ News Live: MRF Factory Workers : పర్మినెంట్ చేయమన్నందుకు 350 మందికి పైగా ఉద్యోగులను తీసేసిన ఎంఆర్ఎఫ్, కార్మికుల ఆందోళన

  • MRF Factory Workers : సదాశివపేట పారిశ్రామిక ప్రాంతంలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో 350కు పైగా కార్మికులను తొలగించారు. పర్మినెంట్ చేయాలని అడిగినందుకు తమ డ్యూటీని నుంచి తొలగించారని కార్మికులు ఆరోపిస్తున్నారు. తమను డ్యూటీలోకి తీసుకోవాలని కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202504:15 PM IST

తెలంగాణ News Live: CM Revanth Reddy : డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు తెలంగాణ‌ను వేదిక‌గా మార్చాలి- సీఎం రేవంత్ రెడ్డి

  • CM Revanth Reddy : పర్యాటక శాఖను ఆదాయ, ఉపాధి వనరుగా మార్చేందుకు ప్రణాళికలు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన వసతులు మెరుగుపరిచి, ప్రచారం కల్పించాలని సూచించారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202502:24 PM IST

తెలంగాణ News Live: Courier Scams : కొరియర్ స్కామ్ ల పట్ల అప్రమత్తంగా ఉండండి, ఫెడెక్స్ కీలక సూచనలు

  • Courier Scams : కొరియర్ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఫెడెక్స్ సంస్థ తెలిపింది. ఈ మేరకు పలు కీలక సూచనలు చేసింది. ఫెడెక్స్ లేదా ఇతర కొరియర్ సంస్థల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202501:52 PM IST

తెలంగాణ News Live: TG Ration Card : రేషన్ కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్లు, ప్రాసెస్ ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ-సన్నబియ్యంపై అప్డేట్

  • TG Ration Card Update : తెలంగాణలో రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతోంది. పాత రేషన్ కార్డుల్లో పేర్లు యాడ్ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అవకాశం కల్పించింది. ప్రస్తుతానికి ఒక్కొక్కరిని మాత్రమే పాతకార్డుల్లో చేరుస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులపై సన్నబియ్యం అందిచేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202512:16 PM IST

తెలంగాణ News Live: T Congress : పైసలు ఉంటే ఎన్నికల్లో గెలవరు.. ప్రజాబలం ఉంటేనే గెలుస్తారు : రేవంత్‌ రెడ్డి

  • T Congress : పార్టీ కోసం కష్టపడిన వారికే భవిష్యత్తు ఉంటుందని.. రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. కొందరు క్షేత్రస్థాయిలో పనిచేయకుండా.. నేతల చుట్టూ తిరుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు. ప్రజాబలం ఉంటేనే గెలుస్తారని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202511:39 AM IST

తెలంగాణ News Live: Reservation Politics : సామాజిక వర్గాల రిజర్వేషన్లు-పార్టీలకు రాజకీయ అస్త్రం

  • Reservation Politics : తెలంగాణలో రిజర్వేషన్లలో తీవ్ర చర్చ జరుగుతోంది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణతో సామాజిక వర్గాల రిజర్వేషన్లు హాట్ టాపిక్ అయ్యారు. కులగణన అంశాన్ని దేశవ్యాప్తంగా లేవనెత్తేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తుంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202509:16 AM IST

తెలంగాణ News Live: TG Education : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.. రెండేళ్లలో పూర్తవ్వాలి.. రేవంత్ కీలక ఆదేశాలు

  • TG Education : అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటికి సంబంధించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202509:11 AM IST

తెలంగాణ News Live: JEE Main 2025 : జేఈఈ మెయిన్ ఫలితాలలో సత్తా చాటిన నారాయణ విద్యార్థులు

  • JEE Main 2025 : జేఈఈ మెయిన్ లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. తమ విద్యార్థులు 300/300 మార్కులతో 100 పర్సంటైల్ సాధించారని నారాయణ యాజమాన్యం పేర్కొంది. అసాధారణ విజయాలతో తమ విద్యార్థులు పలు రాష్ట్రాల్లో టాపర్ల జాబితాలో ఆధిపత్యం చెలాయించారని తెలిపింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202507:41 AM IST

తెలంగాణ News Live: Telangana Ration Shops : సన్న బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం..! 10 ముఖ్యమైన అంశాలు

  • Telangana Ration Shops : రాష్ట్రంలోని పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని అమలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బియ్యాన్ని సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202507:07 AM IST

తెలంగాణ News Live: Mudigonda Accident: ముదిగొండ - కోదాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు కార్మికుల మృతి, ఏడుగురికి గాయాలు

  • Mudigonda Accident: ఖమ్మం జిల్లా ముదిగొండ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్‌ రాళ్ల లోడుతో వెళుతున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న కార్మికులపై రాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్‌లో చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202507:01 AM IST

తెలంగాణ News Live: KCR Re Entry : కీలక భేటీకి ముహూర్తం ఫిక్స్.. భారీ ప్లాన్‌తో కేసీఆర్ రీ ఎంట్రీ..! ఇక పోరాటమేనా..?

  • KCR Re Entry : తాను కొడితే.. మామూలుగా ఉండదని ప్రకటించిన కేసీఆర్.. పక్కా ప్లాన్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భేటీలో కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తారని సమాచారం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202506:16 AM IST

తెలంగాణ News Live: Medaram Jatara : మేడారం వన దేవతలకు.. బెల్లంను బంగారంగా ఎందుకు సమర్పిస్తారు?

  • Medaram Jatara : మేడారం చిన్నజాతరకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో మేడారం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. భక్తులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ ప్రత్యేకమైన ఆచారం ఉంది. భక్తులు అమ్మవార్లకు బెల్లంను బంగారంగా సమర్పిస్తారు. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202505:01 AM IST

తెలంగాణ News Live: TG New Ration Cards : రేషన్ కార్డు దరఖాస్తుల పేరిట దోపిడీ.. ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఈ నంబర్‌కు కాల్ చేయండి

  • TG New Ration Cards : ప్రస్తుతం తెలంగాణలో మీసేవ కేంద్రాల దందా నడుస్తోంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని.. మీసేవ నిర్వాహకులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్క దరఖాస్తుకు రూ.100 నుంచి వెయ్యి వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202504:59 AM IST

తెలంగాణ News Live: Telangana Caste Census : తేలుతున్న బీసీల లెక్క....! మరో 'డిప్యూటీ సీఎం' రాబోతున్నారా..?

  • తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. కులాల వారీగా లెక్కలను తేల్చే పనిలో పడింది. ఇటీవలే ప్రాథమికంగా వివరాలను వెల్లడించగా.. మరోసారి కూడా సర్వేను నిర్వహించనుంది. అయితే ఈ సర్వే ప్రభావంతో.. బీసీ సామాజికవర్గానికి కీలకమైన పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202503:28 AM IST

తెలంగాణ News Live: HYDRA Demolitions : అక్రమ నిర్మాణాలపై 'హైడ్రా' దూకుడు - కోమ‌టికుంట‌లో కూల్చివేతలు

  • HYDRA Demolitions in Medchal: అక్రమ నిర్మాణలపై 'హైడ్రా' దూకుడుగా ముందుకెళ్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లాలోని కోమ‌టికుంట‌లో అక్ర‌మ నిర్మాణాలను తొల‌గించింది. ప్ర‌కృతి రిసార్ట్స్‌, ప్ర‌కృతి క‌న్వెన్ష‌న్ నిర్మాణాలను కూల్చివేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మాణాలు ఉండటంతో హైడ్రా చర్యలు తీసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202501:09 AM IST

తెలంగాణ News Live: Bandi Sanjay: టిబెట్ శరణార్థుల్ని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, సమస్యలు పరిష్కరిస్తామని హామీ

  • Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కర్నాటకలో పర్యటిస్తున్నారు. మైసూర్ జిల్లాలోని టిబెటియన్ శరణార్థుల పునరావాస కేంద్రమైన బైలకుప్పే ను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 14వ తేదీ ఉదయం దలైలామాతో బండి సంజయ్ భేటీ కానున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202512:55 AM IST

తెలంగాణ News Live: Hyderabad ORR : కోర్ అర్బన్ ఏరియా అంతటా డ్రోన్ సర్వే - మరో 7 ఫ్లైఓవర్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్

  • ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. హెచ్ఎండీఏ అధికారులతో జరిపిన సమీక్షలో కీలక సూచనలు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202512:52 AM IST

తెలంగాణ News Live: Akshara Chitfunds: అక్షర చిట్ ఫండ్స్, అక్షర టౌన్ షిప్ కు ఆస్తుల్ని అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు

  • Akshara Chitfunds: అక్షర చిట్ ఫండ్స్, అక్షర టౌన్ షిప్ కు చెందిన రూ.14.27 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రైవేట్‌ చిట్‌ఫండ్స్‌ పేరుతో డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ఘటనలో జనం భారీగా నష్టపోయారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202512:31 AM IST

తెలంగాణ News Live: TG Local Body Elections 2025 : స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! 10 ముఖ్యమైన విషయాలు

  • తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కానున్నాయి.  కుల గణన సర్వే మరోసారి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించటంతో.. మరికొన్ని రోజులపాటు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఏప్రిల్ లేదా మే మాసంలో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి