తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
TG Caste Census : సర్వేలో పాల్గొనని వారికి మరో ఛాన్స్... ఫిబ్రవరి 16 నుంచి ‘కుల గణన’ సర్వే
Telangana News Live February 12, 2025: TG Caste Census : సర్వేలో పాల్గొనని వారికి మరో ఛాన్స్... ఫిబ్రవరి 16 నుంచి ‘కుల గణన’ సర్వే
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 12 Feb 202501:06 PM IST
తెలంగాణ News Live: TG Caste Census : సర్వేలో పాల్గొనని వారికి మరో ఛాన్స్... ఫిబ్రవరి 16 నుంచి ‘కుల గణన’ సర్వే
- తెలంగాణలో మరోసారి కుల గణన జరగనుంది. సర్వేలో పాల్గొనని వారికోసం ఫిబ్రవరి 16 నుంచి మరోసారి అవకాశం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28లోపు వివరాలు ఇవ్వొచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
Wed, 12 Feb 202512:57 PM IST
తెలంగాణ News Live: Mini Medaram Jathara 2025 : మినీ మేడారం జాతర షురూ - వన దేవతల దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు
- మినీ మేడారం జాతర ప్రారంభమైంది. వన దేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు…. వన దేవతలకు మొక్కులు సమర్పిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
Wed, 12 Feb 202509:21 AM IST
తెలంగాణ News Live: TG MLC Elections 2025 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా 'బీఆర్ఎస్' - ఎందుకిలా...?
- తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుండగా… ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటోంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న కారు పార్టీ… ప్రస్తుతం పోటీకి ఎందుకు దూరంగా ఉంటోందన్న చర్చ జోరుగా జరుగుతోంది.
Wed, 12 Feb 202504:57 AM IST
తెలంగాణ News Live: HYDRAA : చెరువుల్లో మట్టి పోస్తే ఈ నంబర్‌కు సమాచారమివ్వండి - 'హైడ్రా' నుంచి మరో ప్రకటన
- చెరువుల్లో మట్టి పోస్తే కేసులు నమోదు చేస్తామని హైడ్రా హెచ్చరించింది. ఈ మేరకు ప్రత్యేక ఫోన్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. చెరువుల్లో మట్టి పోస్తే ఈ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఓ ప్రకటనలో కోరింది.
Wed, 12 Feb 202503:36 AM IST
తెలంగాణ News Live: FarmHouse Casino: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో క్యాసినో, కోళ్ల పందాలు.. పోలీసుల అదుపులో బడా బాబులు
- FarmHouse Casino: హైదరాబాద్ శివార్లలో గుట్టుగా సాగుతున్న క్యాసినో, కోళ్ల పందాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో జరుగుతున్న దందాలో బడా బాబుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
Wed, 12 Feb 202501:46 AM IST
తెలంగాణ News Live: TG Mlc Elections: ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు, 32 నామినేషన్ల తిరస్కరణ
- TG Mlc Elections: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది నామినేషన్ దాఖలు చేయగా 32 మంది నామినేషన్లు తిరస్కరించారు. టీచర్ల స్థానానికి 17 మంది నామినేషన్ దాఖలు చేయగా ఒకరి నామినేషన్ తిరస్కరించారు.
Wed, 12 Feb 202512:22 AM IST
తెలంగాణ News Live: Ponnam Prabhakar: కేటీఆర్, హరీష్ రావులకు కులగణన సర్వే దరఖాస్తులు పంపిన మంత్రి పొన్నం ప్రభాకర్.…
- Ponnam Prabhakar: కులగణన, బీసీ రిజర్వేషన్లపై రాజకీయ విమర్శల నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందించారు. సర్వేలో పాల్గొనని కెసిఆర్, కేటీఆర్ హరీష్ రావులకు కులగణన సర్వే ఫామ్ లు పంపించారు. కరీంనగర్ నుంచి ముగ్గురికి సర్వే ఫామ్ లు రిజిస్టర్ పోస్ట్ చేశారు.