Telangana News Live February 1, 2025: Jagtial News : కుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాల మహిళలు, ఎస్పీ చొరవతో ఆచూకీ లభ్యం
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 01 Feb 202506:16 PM IST
Jagtial News : ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వెళ్లి తప్పిపోయిన నలుగురు జగిత్యాల మహిళల ఆచూకీ లభించింది. జిల్లా ఎస్పీ ప్రయాగ్ రాజ్ పోలీసులను సంప్రదించి మహిళల ఆచూకీ కనుక్కున్నారు. వారిని ఇవాళ జగిత్యాలకు తీసుకొచ్చారు.
Sat, 01 Feb 202505:39 PM IST
TG Mlc Elections : ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉందని సిద్ధిపేట సీపీ అనురాధ తెలిపారు. కోడ్ అమల్లో ఉండడంతో లైసెన్స్ తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయాలని కోరారు.
Sat, 01 Feb 202504:00 PM IST
Hyderabad Firing : హైదరాబాద్ లో ఓ దొంగ పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్, బౌన్సర్ గాయపడ్డారు. కాల్పుల జరిపిన దొంగ మోస్ట్ వాంటెట్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అని సమాచారం.
Sat, 01 Feb 202502:19 PM IST
TG Govt Schools : తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యా్ర్థులకు రుచికరమైన స్నాక్స్ అందిస్తోంది. పాస్ పర్సెంటేజ్ పెంచేందుకు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఇళ్లకు చేరుకునేటప్పటికి ఆలస్యం అవుతుండడంతో స్నాక్స్ అందిస్తున్నారు.
Sat, 01 Feb 202501:13 PM IST
TG Mlc Elections : ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టాయి. బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండేందుకు సిద్ధమైంది.
Sat, 01 Feb 202511:41 AM IST
- Telangana Police : మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కి.. ఎందరో చిన్నారులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారి పాలిట ఆపరేషన్ స్మైల్ వరంగా మారింది. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. తెలంగాణ పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోంది.
Sat, 01 Feb 202511:15 AM IST
Basara Saraswathi Temple : వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్షరాభ్యాసాలు తప్ప ఇతర సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారుల తెలిపారు.
Sat, 01 Feb 202510:47 AM IST
- KCR Strategy : కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. కానీ ఏడాది పాటు కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఎక్కడా ఏం మాట్లాడలేదు. స్పందించాలని కేసీఆర్‌పై ఒత్తిడి ఉండేది. రెస్పాండ్ అవ్వలేదు. తాజాగా కేసీఆర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను రంగంలోకి దిగితే తట్టుకోవడం సులభం కాదని వార్నింగ్ ఇచ్చారు.
Sat, 01 Feb 202509:27 AM IST
- Union Budget 2025 : దేశ గతినే మార్చే అద్బుతమైన బడ్జెట్ ఇది అని.. కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని వివరించారు. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకమైన నిర్ణయం అని కొనియాడారు.
Sat, 01 Feb 202507:53 AM IST
- TG Tourism Papikondalu Package 2025: ఈ ఫిబ్రవరి నెలలో పాపికొండలకు వెళ్లే ప్లాన్ ఉందా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి తీసుకెళ్తోంది. మొత్తం 3 రోజులు ఉంటుంది. ఈ ప్యాకేజీ వివరాలపై ఓ లుక్కేయండి….
Sat, 01 Feb 202507:17 AM IST
- Telangana Congress : తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అలజడి స్టార్ట్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం 10 ఎమ్మెల్యేలని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారనే టాక్ ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
Sat, 01 Feb 202505:44 AM IST
- Hyderabad : హైదరాబాద్ నగరం వారాసిగూడలో మహిళ మృతి ఘటన కన్నీరు పెట్టిస్తోంది. ఈ కేసులో పోలీసులు తాజాగా సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ముగ్గురి పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ లెటర్ ఎవరు రాశారు.. ఎందుకు రాశారు.. ఎప్పుడు రాశారు.. ఆ వివరాలు చూద్దాం.
Sat, 01 Feb 202505:10 AM IST
- TG Local Body Elections : పంచాయతీ ఎన్నికల నగారా ఏ క్షణంలోనైనా మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఓటర్ల జాబితా మొదలు.. బ్యాలెట్ బాక్స్‌లను రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మరో కొత్త విషయం తెలిసింది. రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది.
Sat, 01 Feb 202504:39 AM IST
- Kaloji Health University : వైద్య విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేలాదిమంది మెడిసిన్ చదవడానికి ఆసక్తి చూపుతారు. తెలంగాణలో వైద్య విద్య పర్యవేక్షణ కోసం.. పదేళ్ల కిందట కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ.. ఇప్పటివరకు కీలక పోస్టులను భర్తీ చేయలేదు.
Sat, 01 Feb 202502:29 AM IST
- మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ చెప్పింది. యాత్రికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 6 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ రైళ్లను ఆపరేట్ చేయనుంది.ఈ మేరకు అధికారులు వివరాలను పేర్కొంది.
Sat, 01 Feb 202501:15 AM IST
- కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వి.నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్ నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
Sat, 01 Feb 202511:49 PM IST
- సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ అంశాలకు సంబంధించిన నివేదికలు రాబోతున్నాయని చెప్పారు. ఈ రెండు అంశాలపై శాసనసభలో చర్చిస్తామని ప్రకటన చేశారు.