Telangana News Live December 8, 2024: Sabarimala Special Trains : శబరిమల భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, జనవరి నెలలో 34 స్పెషల్ ట్రైన్స్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 08 Dec 202405:41 PM IST
Sabarimala Special Trains : శబరిమల భక్తుల రద్దీ క్లియర్ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో 34 ప్రత్యేక రైళ్లు నడపనుంది. జనవరి, ఫిబ్రవరి నెలలో తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.
Sun, 08 Dec 202403:49 PM IST
Pushpa 2 Stampede : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప2 విడుదల సమయంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు.
Sun, 08 Dec 202403:06 PM IST
KCR : తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. విగ్రహం మార్పు మూర్ఖత్వమన్నారు. మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
Sun, 08 Dec 202412:34 PM IST
- TG MLC Elections : ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఎస్ యూనియన్ నిర్ణయించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమల్ రెడ్డి ఇన్నారెడ్డిని యూనియన్ నేతలు ఖరారు చేశారు.
Sun, 08 Dec 202412:12 PM IST
- Hyderabad : మంచు మనోజ్ హాస్పిటల్‌లో చేరారు. అతని కాలికి గాయం కావడంతో.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారు. అటు మంచు ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కినట్టు ప్రచారం జరుగుతోంది. మనోజ్, మోహన్ బాబు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరి ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Sun, 08 Dec 202411:48 AM IST
Dharani Portal : ధరణి పోర్టల్ బాధ్యతలు ఎన్ఐసీకి అప్పగించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిపుణుల కమిటీ రిపోర్టు ఆధారంగా ధరణిని ప్రక్షాళన చేస్తామన్నారు. అలాగే ధరణి అప్లికేషన్ పరిష్కారానికి డీసెంట్రలైజేషన్ అమలుచేస్తామన్నారు. 2024 ఆర్వోఆర్ చట్టాన్ని తెస్తున్నట్లు తెలిపారు.
Sun, 08 Dec 202410:39 AM IST
- Chenetha Runa Mafi : తెలంగాణలో నేతన్నలు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఆర్థిక సమస్యలతో ఎంతోమంది తనువు చాలిస్తున్నారు. అటు ఆశించిన స్థాయిలో రాబడి లేదు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్నలకు ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించింది.
Sun, 08 Dec 202409:15 AM IST
T-Fiber Internet : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం టీఫైబర్ సేవలను ప్రారంభించింది. తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. టీఫైబర్ ద్వారా టీవీ, మొబైల్, కంప్యూటర్ వినియోగించవచ్చు.
Sun, 08 Dec 202408:37 AM IST
- Telangana Assembly : రేపటి (ఈనెల 9) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగనున్నాయని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని కోరుతున్నారు. ఎందుకో ఓసారి చూద్దాం.
Sun, 08 Dec 202407:31 AM IST
- SU Job Mela : కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. హెచ్‌ఆర్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు.. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులతో పాటు పీజీ, బీటెక్ పూర్తి చేసిన 2,649 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ గల 427 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.
Sun, 08 Dec 202405:03 AM IST
- Vajedu SI Suicide Case : వాజేడు ఎస్సై సూసైడ్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. కానీ.. ఇంకా కొలిక్కి రాలేదు. హరీష్ ఆత్మహత్యకు కారణాలు ఏంటని ఇంకా తేల్చలేదు. అయితే తాజాగా ఓ వ్యక్తి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
Sun, 08 Dec 202403:18 AM IST
- వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ మిస్టరీ వీడింది. రూ.5 లక్షల అప్పు ఇవ్వనందుకే మాజీ జర్నలిస్ట్ హత్య చేసినట్లు తేలింది. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు… కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Sun, 08 Dec 202402:04 AM IST
- Telangana Talli New Statue: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రూపంతో కూడిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ మేరకు సచివాలయంలో ఏర్పాట్లు సిద్ధం చేసింది. డిసెంబర్ 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అయితే కొత్త రూపంపై వివాదం ముదురుతోంది.
Sun, 08 Dec 202401:31 AM IST
- జగిత్యాల జిల్లాలో కల్తీ పాలు కలకలం సృష్టిస్తున్నాయి. అనారోగ్యానికి గురైన కుటుంబం పాలు పోసే వ్యక్తిని నిలదీయడంతో కల్తీ పాల బాగోతం బయటపడింది. పాలు పోస్తున్న మల్లయ్యపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Sun, 08 Dec 202411:51 PM IST
- ఎంత ఖర్చయినా కానివ్వండి కానీ మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు.